Sunday 15 April 2018


నేటి సినమా గీతం (ఓమనసా)
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

మనసుకు తీరిక లేదు - మమతకు కోరిక లేదు 
వయసుకు ఓపిక లేదు - ఈ జీవితానికి మార్పులేదా 
ఓమనసా నీవైనా చెప్పు - ఈ లోకం తీరు ఏమిటో 

మమతే మాయ కదా - చెలియా  గుండె కోత కదా 
మౌనం చేయుట వ్యర్ధం కదా - చెలిమే నీకు ఆసరా కదా 
శిలగా మారుట ఎందుకు -  గతాన్ని తవ్వటం ఎందుకు 
తరుణాన్ని వ్యర్ధపరుచుట ఎందుకు -  
ప్రాణం తో చేలగాడుట  ఎందుకు 

మనసుకు తీరిక లేదు - మమతకు కోరిక లేదు 
వయసుకు ఓపిక లేదు - ఈ జీవితానికి మార్పులేదా 
ఓమనసా నీవైనా చెప్పు - ఈ లోకం తీరు ఏమిటో 

ఎగసి పడే కెరటాన్ని ఆపలేవు - తపనపడే తీరాన్ని దాటలేవు 
మేఘం లా నాపై కురవలేవు - నాకున్న దాహాన్ని తీర్చలేవు 
జన్మ జన్మల బంధమైనావు  - అడవిని కాచిన వెన్నెలగా మారవు 
జగతి కోర్క తిర్చలేకున్నావు - మనసు మనసు కల్పలేకున్నావు 

మనసుకు తీరిక లేదు - మమతకు కోరిక లేదు 
వయసుకు ఓపిక లేదు - ఈ జీవితానికి మార్పులేదా 
ఓమనసా నీవైనా చెప్పు - ఈ లోకం తీరు ఏమిటో 

అందని జాబిలీ కోసం ఆరాట పడ్డావు     
తుఫాన్కు చిక్కిన నావల ఉండి పోయావు  
బ్రతుకు అర్ధం చేసుకోలేక మిగిలిపోయావు 
ఓమనసా భవిత అర్ధం తెలపలేకున్నావు 

మనసుకు తీరిక లేదు - మమతకు కోరిక లేదు 
వయసుకు ఓపిక లేదు - ఈ జీవితానికి మార్పులేదా 
ఓమనసా నీవైనా చెప్పు - ఈ లోకం తీరు ఏమిటో 

ఈ పాట  ఈ రోజు నా ఆలోచన
నాకు సంగీతం రాదు ఇది ణ భావన మాత్రమె 
పాటకు ప్రాణం తెలిసినవారు తెలపగలరు
అందరికి వందనములు

No comments:

Post a Comment