Thursday 19 April 2018


హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాక నిలువవే కడదాకా
జీవంలో ఒదగవే ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓఓఒ
హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం
ఊహలలోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
మరి నా కను పాపలలో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దేవేనలిస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హాలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలద ఓ ఓ ఓఓ ఓ ఓ
హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం



నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా 
లేకా నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నదిలాగ నువ్వూ కదలాడతుంటే
నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా
నిశిరాత్రి నీవు .. నెలవంక నేను
నీతోపాటూ నిలిచే కాలం చాలందునా
మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ
కలలే నాకిచ్చీ కనులను దోచావూ
ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు
నా బ్రతుకే నువ్వూ
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
భువిలోన గాలి కరువైన వేళా
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
నీలాల నింగీ తెలవారకుంటే
నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా
శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
అలలా నువు రాగా అలజడి ఔతున్నా
దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా
నీలో సగమవ్వనా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా
లేకా నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

No comments:

Post a Comment