Tuesday 10 April 2018

గుడిగంటలు

చిత్రం ; గుడిగంటలు
రచన: ఆత్రేయ
గానం & సంగీతం: ఘంటసాల

నీలోన నన్నే నిలిపేవు నీవే
ఏ శిల్పి కల్పనవో
ఏ కవి భావనవో (2)
ఆ హా హా...ఓ హో హో...ఆ హా....హా

ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో
నండూరివారి ఎంకి ఉంది నీలో
ఆ హా....హా....ఓ హో హో
ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో
నండూరివారి ఎంకి ఉంది నీలో
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది
మా బాపిరాజు శశికళ ఉంది //నీలోన నన్నే//

ఆ హా హా...ఓ హో హో...ఆ హా...హా
ఖయ్యాము కొలిచే సాకీవి నీవే
కవి కాళిదాసు శకుంతల నీవే
ఆ హా...హా....ఓ హో హో
ఖయ్యాము కొలిచే సాకీవి నీవే
కవి కాళిదాసు శకుంతల నీవే
తొలి ప్రేమ దీపం వెలిగించినావే
తొలి పూలబాణం వేసింది నీవే //నీలోన నన్నే// 
https://www.youtube.com/watch?v=a9CPCVZq0IU
ntr gudi gantalu
neelona nanne

No comments:

Post a Comment