Tuesday 11 February 2020

కిల్లర్ (1991)

ప్రియా ప్రియతమా రాగాలు...సఖి కుశలమా అందాలు
చిత్రం : కిల్లర్ (1991)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వేటూరి
గానం : మనో, చిత్ర

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం నీలో నాలో పలికే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే
నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

శరత్తులోనా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

No comments:

Post a Comment