Wednesday 12 February 2020

చెల్లెలి కాపురం (1971)


రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..కృష్ణుడు.. రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..

చిత్రం : చెల్లెలి కాపురం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : జానకి, పి. బి. శ్రీనివాస్

పల్లవి :

ఈ దారి నా స్వామి నడిచేనే... పాదాల జాడలివిగోనే
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..
కృష్ణుడు.. రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..
లేవండీ పొదరింటా.. లేవండీ పొదరింటా.. లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..

ఎవరే . . ఎవరే . . ఎవరే . .
మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు
కన్నుల చల్లని వెన్నెల జల్లుల విరజిమ్మే వాడే.. నన్నేలువాడు
ఓహొ.. ఓహొ.. ఓహొ

ఈ నల్లని రూపం చూచీ.. ఈ పిల్ల సోయగము వలచీ
ఈ నల్లని రూపం చూచీ.. ఈ పిల్ల సోయగము వలచీ
రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే

లేవండీ పొదరింటా.. లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ.. కృష్ణుడు
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..

చరణం 1 :

అటు అడుగిడితే నా తోడూ . . ఇటు చూడూ
అటు అడుగిడితే నా తోడూ.. ఇటు చూడూ
ఇట నిలిచినాడు నీ కోసం.. లీలా ప్రియుడూ.. ఇటు చూడూ

వలచి వలచి వచ్చినదెవరో.. పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు
వలచి వలచి వచ్చినదెవరో.. పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు
పిల్లగ్రోవినడుగూ... ఇటు చూడూ

చరణం 2 :

కృష్ణా.. ఏల స్వామీ దయమాలీ.. ఈ దీనురాలిని ఎగతాలీ
ఏల స్వామీ దయమాలీ.. నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ.. పాదధూళిని పొందలేనీ
నీడకైనా నోచుకోనీ.. రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ

కనులకు తోచేది కాదు సోయగమూ.. మనసులో పూచేటీ మధురిమగానీ
నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ.. నేను వలచేదీ నా నీలలోదీప్తి

https://www.youtube.com/watch?v=dylbc6GwJ7M


Chelleli Kaapuram | Ee Dhaari song
Listen to one of the melodious hit songs of S Janaki and PB Sreenivos, "Ee Dhaari Nee Swamy" from th...



No comments:

Post a Comment