Wednesday 12 February 2020

విచిత్ర దాంపత్యం (1971)

శ్రీ గౌరి శ్రీగౌరీవే శివుని శిరమందు...ఏ గంగ చిందులు వేసినా
చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం : అశ్వద్ధామ
రచన : సి.నారాయణరెడ్డి
గానం : పి.సుశీల

శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా

సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి ఆ హరుమేన సగమై పరవశించిన

నాగకన్యగా తాను జనియించినా జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా తరళాత్మమైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతిపదములందు నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతిసిగను దూకి నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి చలిత జీవన తరంగ రంగ గంగ
దవళాంశు కీర్తి గౌరి నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని మృతి యెరుగని నిజమిది శ్రీగౌరి శ్రీగౌరియే




--(())--

ఎవరికోసం ఎవరికోసం...ఎంతకాలం ఎంతకాలం
ఈ జాజి తీగ రోజు రోజు పూలు పూసేదెవరికోసం...ఎంతకాలం

చిత్రం : విచిత్రదాంపత్యం
సంగీతం : అశ్వద్థామ
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

ఎవరికోసం ఎవరికోసం
ఎంతకాలం ఎంతకాలం
ఈ జాజి తీగ రోజు రోజు
పూలు పూసేదెవరికోసం ఎంతకాలం

వాడి పోయిన నిన్నలన్ని మరచిపోయి
చిగురు లేసే ఒక్క రేపుని తలచి మురిసి
ఆ రేపు నేడై నేడు నిన్నై
రూపు మాసి పోవు వరకు
ఎదురు తెన్నులు చూచుకుంటూ
ఎరుపు కన్నులు సోలిపోతూ
ఎవరి కోసం ఎంతకాలం

కట్టుకున్న పందిరేమో కాలదన్నే
పుట్టి పెరిగిన పాదులో మమతెండిపోయే
ఇవ్వ గలిగినదివ్వలేక పొంద దలచినదేదీ పొందక
పొద్దు పొద్దు మొగ్గలేస్తూ తెల్లవారి రాలిపోతూ
ఎవరికోసం ఎంత కాలం

ముళ్ళ కంచెలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును ఒంటరిగనే మోసినాను
రాగమన్నది గుండెలో రాజుతున్నది ఎందుకో
రగిలి రగిలి నేను నేనుగ మిగిలి పోవుటకా
మిగిలియున్న రోజులైనా వెలుగు చూచుటకా
ఎవరి కోసం ఎంత కాలం
ఎవరి కోసం ఎంత కాలం

https://www.youtube.com/watch?v=GPYPL5YfUJE

ఎవరికోసం...ఎంతకాలం...


No comments:

Post a Comment