Friday 2 August 2019

జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)


ప్రియతమా నను పలకరించు ప్రణయమా...అతిథిలా నను చేరుకున్న హృదయమా...

చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

చరణం 1:

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ కలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే
మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

చరణం 2:

ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

https://www.youtube.com/watch?v=bSiiIrfYJJ8

Jagadeka Veerudu Atiloka Sundari | Priyathamaa Video Song | Chiranjeevi, Sridevi
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

No comments:

Post a Comment