Thursday 1 August 2019

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా...

చిత్రం : భద్రకాళి (1976)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి:

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ .. ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ.. లాలిపాట పాడేనూ

చరణం 1:

నీ ఒడిలో నిదురించీ .. తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ .. పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ .. తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ .. పుణ్యమెంతో చేశానూ

ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా
అమ్మ వలె రమ్మనగా .. పాప వలె చేరేవూ
నా చెంత నీవుంటే .. స్వర్గమే నాదౌనూ
గాయత్రి మంత్రమునూ .. జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ .. ఇవ్వకున్న వదలనులే

చరణం 2:

స్నానమాడి శుభవేళా .. కురులలో పువ్వులతో
దేవి వలే నీవొస్తే .. నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ .. కాటుకను దిద్దేనూ
చెడు చూపు పడకుండా .. అదరు చుక్క పెట్టేనూ

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ .. ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ.. లాలిపాట పాడేనూ

జోలాలీ .. జోలాలీ .. జోలాలీ .. జోలాలీ ..జో జో జో...

https://www.youtube.com/watch?v=meT2fPnE6hU
Chinni Chinni Kannayya - Bhadra Kali
Chinni Chinni Kannayya - Bhadra Kali



No comments:

Post a Comment