Friday 2 August 2019

చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

చరణం 1:

జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
కలల అలల పై..

చరణం 2:

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

https://www.youtube.com/watch?v=yGBYvp8BDhA

No comments:

Post a Comment