Tuesday 21 May 2019





ప్రాంజలి ప్రభ - నేటి చైతన్య గీతం  
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా 
ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా 

కాలం కదులుతుంది, మనస్సు చెదురుతుంది 
కబురులేకుండా సాగుతుంది, వయసుతో పరిగెడుతుంది 
నిత్యనూతనముగా ఉంది, వృద్ధాప్యం తెలియకుండా ఉంది 
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా 
   
కన్య రూపాన్న వస్తుంది, తరుణిగా మారి తపింప చేస్తుంది  
కాలంతో కలవ మంటుంది, అనాధ బాలాగా మారుతా నంటుంది   
కౌగిలిలో నలిగినట్లు నలిగి, గుర్తెరగని కాలంగా మారిపోతుంది   
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా 

మోనానికి నేస్తముగా ఉంటుంది, ప్రేమకు సాక్షిగా ఉంటుంది    
కష్టానికి ఫలితంగా ఉంటుంది, నష్టానికి రూపంగా ఉంటుంది 
ప్రాణానికి ప్రాణమై ఉంటుంది, ప్రకృతిలో ప్రకృతిగా మారి పోతుంది  
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా 

విద్యావాణిగా ఆవహిస్తుంది, గుణాల్ని నిర్ణయిస్తుంది
మనిషిని మనిషిగా గుర్తించు కోమంటుంది, కాలం నీతోనే ఉంటుంది      
ఊపిరికి ఊపిరిగా, వయసుకు తోడుగా, నిండగా ఉండి పోతుంది 
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా 


--((**))--


ప్రాంజలి ప్రభ-నేటి చైతన్య గీతం
రచయిత:మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి

విజయానికి ఉండాలి వైనం, దేహానికి ఉండాలి శుభ్రం
నిజానికి ఉండాలి ధైర్యం, మాటలకి ఉండాలి లౌక్యం...... 

వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి

ప్రేమలకు ప్రేమైతేే సాక్షం, మనసుకు మమతే సాక్షం
వయసుకు వలపే సాక్షం, ధనముకు మనమే సాక్షం ....... 

వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి

కాలాలతో పొందాలి శక్తి, తరుణంలో ఉండాలి ఓర్పు
ప్రకృతిలో చూడాలి సత్యం, నిత్యం నీవు నిలపాలి ధర్మం

వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో స్వామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి

--((**))--


ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ

కృప చూపుమా కలియుగేశ్వరా
కృషి సల్పితి దుర్భిక్షం తొలగించురా 

ఎండలు మెండై బండలు కరిగే
గుండెలు దడ దడలు పెరిగే
ఎండకు చెట్టు గూడు మండే
నీరంతా ఆవిరిగా మారే మారే

గొడ్డుకు నీడ కూడు కరువై
ప్రాణానికి ప్రాణమే బరువై
చెడు విలయ తాండవమై
నూరేళ్ళ బతుకుకు గండమై

ఆశలు తీర్చుకొనే దారి లేదే
పుట్టుక పరమార్ధం తెలియలేదే
పిల్లల వృధ్ధుల ఆక్రందనలు పెరిగే
దారి తెన్నులేని బతుకులే చితికే

రాబందుల మూకలు పెరిగే
బలమున్న వాడి వింత గోలే
విధిని అదుపు చేసేవారు లేకే
అందరి ప్రవర్తనలు మారే మారే

మనసు విలిచె మనసు దలఁచె  
కనగరమ్ము వేగ కలియుగేశ్వరా
ప్రాణమంతయు గుప్పెటలో ఉందిరా 
తనువు వేగి ఉంది కలియుగేశ్వరా  

కృప చూపుమా కలియుగేశ్వరా

కృషి సల్పి దుర్భిక్షం తొలగించురా 

--((**))--

Luminous Leaves
అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా  
ఏ పూట మరవకురా ఓ మానవా 

ఉన్నాడు దేవుడే లేడనేవాడురా  
కానీ అమ్మ లేనివాడు ఎవడూ లేడురా  .....  2
అమ్మ ని  ప్రేమించని వాడు లేనేలేడురా 
అమ్మకు సేవ చేసే వాడే నిజమైన వాడురా  .... 2 

అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా  
ఏ పూట మరవకురా ఓ మానవా 

అమ్మ  అంటే  అంతు లేని సొమ్మురా 
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా  ..... 2 
అమ్మ అమృతాన్ని అందించునురా 
మనసు మనసు తట్టి సుఖ పెట్టునురా .... 2  

అమ్మ  అన్నది ఒక కమ్మని మాటరా  
ఏ పూట మరవకురా ఓ మానవా 

మరిచి పోలేనిది అమ్మ  ఒక్కటేరా  
అందరికీ అర్ధమయ్యేది అమ్మ  ఒక్కటేరా 
ప్రేమను అందించేది అమ్మ ఒక్కటేనురా  
హృదయాలను కలిపేది అమ్మ ఒక్కటేరా 

అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా  
ఏ పూట మరవకురా ఓ మానవా   

--((*))--


మాజీ  ముఖ్యమంత్రి తెలిపే - ప్రస్తుత ముఖ్య మంత్రి తో  

ప్రాంజలి ప్రభ - చతన్య గీతం 
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  

ఓహో భావమా - ఓహో వేదమా 
ఓహో రూపమా - ఓహో దీపమా 
   
వేరొక భావము లేదు నాకు  
ఉన్నది చెప్పెద నీకు నేను  
లేనిది చెప్పుట వద్దా నీకు   
చెప్పుడు మాటలు వింటా నేను  

ఓహో భావమా - ఓహో వేదమా 
ఓహో రూపమా - ఓహో దీపమా 

వేచెద నిచ్చట నీకొరకు 
చూపెద అంతయు కానుకను 
వాదన వేదన ఎందుకులె    
కాలము గాళము నీకొరకు 

ఓహో భావమా - ఓహో వేదమా 
ఓహో రూపమా - ఓహో దీపమా 

చూచెద వంతయు వేడుకలొ   
తొందర చేయుము ఇక్కడకు 
వద్దని రానని చెప్పకము 
ఉన్నది పుచ్చుకొ అందరిలొ 

ఓహో భావమా - ఓహో వేదమా 
ఓహో రూపమా - ఓహో దీపమా 
--((**))--


mobile9 - Nokia 5233 Wallpapers Download Free - Page 1 of 0
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవీ రామకృష్ణ

ఏమండోయ్ చిన్ని గారు     
ఏమండోయ్ నాని గారు

నీ  వంపు సొంపులు చూస్తూ ఉంటే 
వయ్యారపు  నడక చూస్తూ ఉంటే
వాలు చూపులతో కవ్విస్తూ ఉంటే
నా గుండె జల్ జల్లంది చిన్ని గారు

ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు     

ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు

వడ్డు బొడ్డు వయ్యారంగా ఉంటె సరి పొతుందా
వాలు చూపులతో మత్తెక్కిస్తే సరి పోతుందా
కన్ను ముక్కు పన్ను చన్నులుంటే సరిపోతుందా   
వినయ్ విధేయతలు అవసరం లేదా నాని గారు

ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు

ఓసి చిన్న దానా నేను నీకు తోడుగా
వయసు పంచి వలపు అందించాలిగా
కళ్ళు కళ్ళు కలిపి కోటి  స్వప్నాలు తీర్చిలిగా
పాలల్లో నీళ్లలాగా కల్సిపోదాం చిన్ని గారు
ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు

నేను కాదన్నా చిరుజల్లుల్లో జలకాలాడదామా
వెన్నలల్లో విహారించి విందు ఆరగిద్దామా
మనసు మనసు కలిపి మమేకమై పోదామా
కలసి ఆశలు తిరుచుకుందామా నాని గారు

ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు
ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు
--((**))--

హరవిలాస - ర/జ/ర/జ/న/గ
UI UI UI UI - UI UI III U
16 అష్టి 31403
కల్వ లేదు, పిల్వ లేదు, మర్వ లేదు  మనసులో
చెప్ప లేదు, ఒప్ప లేదు, మెచ్చ లేదు మనసుతో
మంచి లేదు, చెడ్డ లేదు, మాయ లేదు వయసులో
వింత లేదు, పొంత లేదు, వంత లేదు వయసుతో   


ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం
రచయత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

తగ్గ లేదు, వెల్గు లేదు, ఒగ్గు లేదు సొగసులో 
మాట లేదు, పాట లేదు, వేట లేదు  సొగసుతో   
మార్పు లేదు, నేర్పులేదు, కూర్పులేదు mmatalo   
aali  లేదు, గాలి లేదు, మాలి లేదు mamataతో

అంద మైన చంద మామ - యాక సాన వెలుగురా 
అంద మైన సూర్య మామ - నింగి లోన వెలుగురా
పిల్ల పాప లందు మామ  - తల్లి తండ్రి వెలుగురా
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా 

--((**))--

No comments:

Post a Comment