Saturday 25 May 2019

మానవత్వం పరిమళించే...మంచి మనసుకు స్వాగతం

చిత్రం : నేటి భారతం
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : శ్రీ శ్రీ
గానం : జానకి

మపనిపా మపనిపా నిసగసా...పమప గమసా...

మానవత్వం పరిమళించే మంచి మనసుకు
స్వాగతం స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి
స్వాగతం స్వాగతం స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం1:

కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో
వెలుగులను ప్రసరింపచేసిన కాంతిమూర్తి స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం2:

అంతు తెలియని వేతనలతో అలమటించే ఆర్తజనులకు
కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలి....
స్నేహశీలి స్వాగతం....
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

చరణం3:

పనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకు
చిగురుటాశల దారి చూపిన మార్గదర్శి స్వాగతం
మానవత్వం పరిమళించే మంచి మనసుకు
స్వాగతం స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి
స్వాగతం స్వాగతం స్వాగతం

https://www.youtube.com/watch?v=X9pGTVPDuXg
manavathvam....mp4




No comments:

Post a Comment