Sunday 19 May 2019

baatasaari -1961                                                                         
samudraala ragavachaarya
bhanumati & gikki 
జగమును సృజియించనదెవడో వాడే జనులను సృజియించె
ఆకలినిచ్చినదెవడో వాడే అన్నము సృజియించె

కనులకు తోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండీ సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగ రాని తలపులున్నవి కొన్ని

సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించె
పలుకులొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించె

కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించె
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించె

వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం 
https://www.youtube.com/watch?v=B3geaWfRrAo


No comments:

Post a Comment