Tuesday 21 May 2019

ప్రేమనగర్ (1971)



నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం...నీ కోసం విరిసిందీ హృదయనందనం...

చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె .వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల , పి.సుశీల

పల్లవి :

నీ కోసం... నీ కోసం..
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

చరణం 1 :

ప్రతి పూవూ నీ నవ్వే నేర్చుకున్నదీ,
ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నదీ
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ,
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

చరణం 2 :

అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ,
చెప్పలేని తలపులు చేతలయేదిక్కడ
విడిపోని బంధాలు వేసుకొనేదిక్కడ,
తొలి చెలిమి అనుభవాలు తుది చూసేదిక్కడ
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం

చరణం 3 :

కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు,
శిల వంటి మనిశిని శిల్పంగా మార్చావు
తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిసావు,
నువు మలిచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం

నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం
నీ కోసం....నీ కోసం

https://www.youtube.com/watch?v=9DuPOi9TZSE
YouTube- Neekosam - Prema Nagar - Akkineni Nageshwara Rao & Vanisri.mp4

No comments:

Post a Comment