Sunday 26 May 2019

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి...అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి...

చిత్రం : ద్రువ నక్షత్రం (1989)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

చరణం 1 :

తత్వమసి... డిప్లమసి పనికి రావురా
తాళిబొట్టు తగిన జట్టు తప్పు కాదురా
కొంప అనే కుంపటినే నాకు పెట్టకు
కొంగు ముడి రంగు తడి నాకు గిట్టదు
ప్రేమ అమృతం.. ప్రేమ జీవితం..
నవ్వేటి యవ్వనమే ప్రేమకంకితం

చరణం 2 :

సీత సొద రామ వ్యధ విన్నదే కదా
పెళ్లి కథ ఊటి కథ ఎందుకే రొద
అమ్మ కథ నాన్న కథ పెళ్ళియే కదా
జంటకొక బొంత ఇక ఫిక్సుడే కదా
ప్రేమ కులాస.. అదే ప్రేమ బరోసా
ఏనాడు తీరనిదే ప్రేమ పిపాసా

https://www.youtube.com/watch?v=dNUeKIVO52U
Dhruva Nakshatram 1989, Pelli Pelli

No comments:

Post a Comment