Saturday 15 September 2018

సిరివెన్నెల

కొంచం కారంగా.. కొంచం గారంగా...కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా

చిత్రం : చక్రం
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : చక్రి
గానం : కౌసల్య

కొంచం కారంగా.. కొంచం గారంగా
కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలీ..
బంధించనీ కాలాన్నీ కౌగిలీ..
సుడిగలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరె నీ జాలే.........
మంటల్లే నను మరిగించాలి

కొంచం కారంగా.. కొంచం గారంగా
కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా

తలుపేసుకుంటే నీ తలపాగుతుంధా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమె పాకింది నరనరమునా
ఇక నా వశము కాకుంది యమ యాతనా
లేని పోని నిందలుగాని
హాయిగానె వుందీ హానీ
ఉన్నమాట నీతో చెప్పనీ..ఈ..

కొంచం కారంగా.. కొంచం గారంగా
కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా

అమ్మాయి నంటు నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకె చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు కంది మన్మద లేఖ
కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా..

కొంచం కారంగా.. కొంచం గారంగా
కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలీ..
బంధించనీ కాలాన్నీ కౌగిలీ..
సుడిగలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరె నీ జాలే.........
మంటల్లే నను మరిగించాలి

కొంచం కారంగా.. కొంచం గారంగా
కొంచం కష్టంగా.. కొంచం ఇష్టంగా

https://www.youtube.com/watch?v=p9F4ofijNnA
Chakram Songs With Lyrics - Konchem kaaranga Song
Listen & Enjoy Chakram Songs With Lyrics - Konchem kaaranga Song Subscribe to our Youtube Channel - ...

No comments:

Post a Comment