Saturday 15 September 2018

ప్రేమించు పెళ్లాడు (1985)



ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

లాల...లాలా....లాలా..లా.లా..
ల..లా..లాలా...ల..లా..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 1:

విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..

తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 2:

గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

https://www.youtube.com/watch?v=9kndifGXDEQ
IR's Ee Chaitra Veena -Preminchu Pelladu-Vamsy (my version)
Music: Maestro Ilaiyaraja Lyrics: Veturi Singers: SPB & S Janaki Film: Preminchi Pelladu Director: V...

No comments:

Post a Comment