అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా..ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా...
చిత్రం : భగత్ సంగీతం : నవీన్ జ్యొతి గానం : చిత్ర
అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా? ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా కలనైనా రమ్మని పిలిచేవా? నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?
గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను ఈ మూగ రాగమేదొ ఆలకించవా ఆలకించి నన్ను నీవు ఆదరించవా
చందమామ రాకుంటే కలువ నిలువ లేదు జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా
https://www.youtube.com/watch?v=KdrMSo-T-28 |
No comments:
Post a Comment