Sunday 16 September 2018




ఆరాధ్య ప్రేమ లీల, Pranjali Prabha.com

రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

మేఘంలా కరిగే మనసు నీకు దొరికిందా
మధువులా అందించేటి మనసు దొరికిందా
దుప్పటిలా వెచ్చగుండే మనసు దొరికిందా
ఉత్సాహంలా పనిచేసే మనసు దొరికిందా

నవ్వులా వెలుగునిచ్చే మనసు దొరికిందా
వెన్నెలా చల్లగ నుంచే మనసు దొరుకిందా
తక్కెడిలా చెలి తూచే మనసు దొరికిందా
చీకటిలా చలి పంచె మనసు దొరికిందా

మనసున్న వాడికి
దొరకంది లేదు
ఆకలున్న వాడికి
దొరకంది లేదు
వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


వసంతం చేరి వళ్లంతా వయ్యారంగా మారితే రావేమిటి
- చీకటి వెన్నల గాలిలో శ్రావ్యంగా మారితే రావేమిటి
చెలి మనస్సు ప్రేమగా పిలవంగా కోరితే రావేమిటి
- విరహాగ్నితో కలువ విచ్చగా పిలివగా రావేమిటి

తాను పడే ఆవేదనను చూసి చాలార్చగా రావేమిటి
- గులాబీల రెక్కల్లా వలువలు తొల్గించగా రావేమిటి
శిశిరాలను మోయలేని హృదయం ఉండగా రావేమిటి
- ఉషోదయంలా నిత్యం సహకరిస్తూ ఉండగా రావేమిటి


పెదవిచాటున నవ్వులను చూపిస్తుండగా రావేమిటి
- రామనామంలా జపిస్తూ ఉంటె కరుణించగా రావేమిటి
కురులన్ని నీపేరే పిలుస్తూ ప్రేమిస్తుండగా రావేమిటి
- ఏకాంత విందును సమర్పిస్తాననగా నీవు రావేమిటి


కన్నుల సోయగాల్ని చూచుటకు తొందరగా రావేమిటి
- శ్వాసలలో నీ ఊసే కలవరించు చుండగా రావేమిటి
ప్రేముండగా పెద్దలను ఎదిరించి ధైర్యంగా రావేమిటి
- పెళ్లి చేసుకొని హాయిగా మారుదాం సంసారిగా రావేమిటి


రెండు చేతులు కలిస్తే శబ్దం
రెండు పెదాలు కలిస్తే మౌనం
రెండు కళ్ళు కలిస్తే ప్రణయం
రావేమిటి అడిగినా అడ్డు కాలం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


ఇది వేణు గోపాల స్నేహ లీల

--((**))--

No comments:

Post a Comment