Saturday 28 May 2016

01.ముద్దుబిడ్డ ,02. బంగారు పంజరం , 03. శుభలేఖ , 04. పౌర్ణమి, 05.స్వర రాజా ఇళయరాజా,06. సింధు భైరవి,06. ప్రేమించు పెళ్లాడు , 07.స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ 08.తూర్పు సిందూరం 09.అందమైన అనుభవం ,10. మహామంత్రి తిమ్మరుసు (1962) 11. పాండురంగ మహాత్మ్యం (1957)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

Les il·lustracions de Yao Xiong:
సర్వేజనా సుఖినోభవంతు 
జయ మంగళ గౌరీ దేవి...దయ చూడుము చల్లని తల్లీ...
చిత్రం : ముద్దుబిడ్డ
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : పి. లీల

పల్లవి:
జయ మంగళ గౌరీ దేవి...దయ చూడుము చల్లని తల్లీ
చరణం 1:
కొలిచే వారికి కొరతలు లేవు
కలిగిన బాధలు తొలగ జేయు
కాపురమందున కలతలు రావు
కమ్మని దీవెనలిమ్మా.. అమ్మా..

చరణం 2:
ఇలవేలుపువై వెలసిన నాడే
నెలకొలిపావు నిత్యానందం
నెలకొలిపావు నిత్యానందం
నోచే నోములు పండించావు
చేసే పూజకె కొమ్మా.. అమ్మా..

చరణం 3:
గారాబముగా గంగ నీవు
బొజ్జ గణపతిని పెంచిరి తల్లీ
ఇద్దరి తల్లుల ముద్దులపాపకి
బుద్దీ జ్ఞానములిమ్మా.. అమ్మా..

గట్టు కాడా ఎవరో...సెట్టు నీడా ఎవరో...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో...
చిత్రం : బంగారు పంజరం
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : S.జానకి

గట్టు కాడా ఎవరో...సెట్టు నీడా ఎవరో...
నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో...

చరణం :
ఓ...ఓ...ఓ......
తోటు పాటు సూసుకోని ఏరు దాటి రావాలా...
ముళ్ళు రాళ్ళు ఏరుకోని పులతోవా నడవాలా...
ఆగలేక రాచకొడకా...సైగ సేసేవెందుకు...సైగెందుకు...

ఏటిగట్టూ కాడా...మావిసెట్టు నీడ...ఎవరో...
హొయ్...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో...

చరణం :
ఓ...ఓ...ఓ...
పైర గాలి పడుచుపైట పడగలేసి ఆడేను...
గుండెపైనే గుళ్ళపేరు ఉండలేక ఊగేనూ...
తోపు ఎనకా రాచకొడకా...తొంగి సూసేవెందుకు...నీవెందుకు...సైగేందుకు...

ఏటిగట్టూ కాడా...మావిసెట్టు నీడ...ఎవరో...
హొయ్...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో...



నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక..నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక

చిత్రం : శుభలేఖ
సంగీతం : KV.మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : SP.బాలసుబ్రహ్మణ్యం , జానకి

పల్లవి :

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక.. నగవు చిలుక..
తగదు అలుక.. తగవు పడక

చరణం 1 :

అడిగింది కన్నెయీడు శెలవింక.. నిన్నే శెలవింకా
ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక.. ఇస్తా నెలవంకా
ఆపాలి అబ్బాయిగారు చొరవింక.. చిలిపి చొరవింకా
పచ్చ పచ్చని కాపురాలే మనవింక.. వింటే మనవింకా
అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా
నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక

నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక
నా వెనుక నీ నడక నాకెందుకులే కినుక
ఓ.. ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక

చరణం 2 :

మనసైన మరునాడే త్వరపడక.. నువ్వు జొర పడక
పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా.. కొంగు ముడి పడక
ఆపాలి అమ్మయిగారు గొడవింకా.. మతులే పడవింకా
నీవు నేనైన రేవు చేరే పడవింకా.. సాగే గుడివంక
బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా

ఓ..ఉలికి పడక.. కలికి పలుక.. కలత పడక.. కలత పడక
https://www.youtube.com/watch?v=0-IL_5W6grU
Subhalekha | Nee Jada Kuchulu song
Listen to one of the evergreen romatic melody hits of SP Balasubramaniam and SP Sailaja,"Nee Jada Ku...



 పౌర్ణమి
భరత వేదముగ
శంభో శంకర హర హర మహాదేవ
తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా
హర హర మహాదేవ
అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ
జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా
హర హర మహాదేవ

స్వర రాజా ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు ..
( ఇళయరాజా గారు కేవలం 3 నోట్స్ ( స . రి . గ ) తో కల్యాణి రాగంలో అది కూడా రెండు భాషల్లో పల్లవి మరియు చరణములతో పాట మొత్తం కంపోజ్ చేసారు )
రాగం రసమయ వేదమై స్వర సంచారములను చేయదా
తానం తకధిమి తాళమై తనువంతా పులకలు రేపదా
ప్రతిస్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్న వారి జన్మ ధన్యమై పోదా
పాడనా తీయగా ఎనాడెవ్వరు వినని
గానమే ఊపిరై నాలో మెదిలే కధని
ఉయ్యాలలూగే కనుపాపలో కలని
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగిరికి నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొదలు చిలిపి మనసు గెలవనీ
ససససా సారి గరి సరి ససాస
రిరిరిరీగ రిగరిసా రిసగరి
గారీ గరి గరి గరీసా
రీసా రిస రిస రిసగా
గరి గరి సగరి
సాస సాస గాగ గాగ రీరి రీరి రీరి రీరి
సస గరిగ ససరి సరిగా
గగ సరిస గగ రిగరి గగ
గరిగ గగ రిసరి గగ సరిస
గరిస గరి సారీ సరీగా రిగ
సారీ రీగ రిగా సాగ సారీగ
తా దీ గినతోం .. తా దీ గినతోం
స్వర రాజా ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు ..
( ఇళయరాజా గారు కేవలం 3 నోట్స్ ( స . రి . గ ) తో కల్...

నేనొక సింధు కాటుక చిందే...రాగాల పూరిల్లునే...ఉన్న శోకాల పుట్టిల్లునే

చిత్రం : సింధు భైరవి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

పల్లవి :

నేనొక సింధు కాటుక చిందే
రాగాల పూరిల్లు నే
ఉన్న శోకాల పుట్టిల్లు నే
తండ్రి ఆకాశం తల్లి సముద్రం
సొంతమంతా లోకమే
ఇది కల్లకాదు నిజమే

చరణం :

ఈ వింత బంధాల కెన్నెన్ని పేర్లూ
గోదారి పాటకు తలితండ్రులెవరో
విధితోడ నేనాడ వైకుంఠపాళి
విధియేను ఈ అడవి పెద తోటగాను...
పాట పాడేనా సంగతిఉంది
నా పాట లోపల సంగతి ఉంది...అర్ధమైతే

చరణం :

ఆతల్లి ఒడి చెరి పులకించువేళా
అమ్మా అని పిలిచేటి అధికారమేది
నా విది తప్పని నేనెరిగి ఉంటే
గర్భాన కరిగి కన్నీరై పోనా
విది పాటకెవరూ ఆ పల్లవి రాసే
ఈ పాటకెవరూ ఆ పల్లవి రాసే దేవుడేనా

http://m3.linksden.xyz/telugu/Sindhu%20Bhairavi%20%281985%29/Nenoka%20Sindhu.mp3


నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

చిత్రం : ప్రేమించు పెళ్లాడు
సంగీతం: ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె

చరణం :

హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తారలా..
ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే

చరణం :

అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా..
మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే

https://www.youtube.com/watch?v=lG3rT8C0CzM
nirantaramu vasanthamule (Ilayaraja Golden Hits)

నీతోనే ఢంకాపలాసు...ఇది ప్రేమాటైనా పేకాటైనా...నువ్వే నా కళావరాసు

చిత్రం : స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు

నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా...ఆ..

పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి ..హహహ..
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా...

https://www.youtube.com/watch?v=cvQAktVmBOk
Neethone Dankapalasu Song - Stuavtpuram Police Station Songs - Chiranjeevi, Nirosha, Ilayaraja
Stuartpuram Police Station movie songs, starring Chiranjeevi, Vijayashanthi, Nirosha, Sarath Kumar,B...
 

"ఇళయరాజా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు :) "
పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే...ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే...

చిత్రం : తూర్పు సిందూరం (1990)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు

పల్లవి :

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్

చరణం : 1

చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి
బంగరు దేహం సోలుతుంది పాపం
చ ల్లనీపూటా కోరుకుంది రాగం
నీవే అన్నావే నే పాడాలంటూ
ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్

చరణం : 2

ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే
చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే
మెత్తగా లాలీ నే పాడుతాలే
విరిసే హరివిల్లే ఊరించే వేళా
మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్

http://m3.linksden.xyz/telugu/Thoorpu%20Sindhooram%20%281990%29/Poddu%20Valipoye.mp3


 అందమైన అనుభవం 

హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
నేనే నువ్వొయ్.. నువ్వే నేనోయ్..
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes you
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది..
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా..హల్లో నేస్తం గుర్తున్నానా...

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం..
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం..
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో..
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో..
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..

చైనా ఆట ..మలయా మాట.. హిందూ పాట.. ఒకటేను..
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్...
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా...
సాయారేమో ఇండియా...
సాయావాడ చైనా...
హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్...
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
https://www.youtube.com/watch?v=vbDICiuXeT8

Hello Nestam Bagunnava Song - Andamaina Anubhavam Movie Songs - Kamal Hassan - Rajnikanth
W

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఎస్. వరలక్ష్మి

పల్లవి:

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం 1:

వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో

అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు...
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం 2:

నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో

మైమరచిన చెలి మాటే లేదని....
ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు...

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...

https://www.youtube.com/watch?v=WjU4XSoHBQM

leelakrishna ne leelalu ne theliyaga in mahamantri thimmarusu
Maha

నీవని నేనని తలచితిరా...నీవే నేనని తెలిసితిరా

చిత్రం : పాండురంగ మహాత్మ్యం (1957)
రచన : సముద్రాల రామానుజాచార్యులు
గానం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : టి.వి.రాజు

నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా

నిజమిది......ఋజువేదీ...
ఊహూహూ..ఆహాహా....

కలయగ జూచితి నీకొరకై నే
కలయగ జూచితి నీకొరకై నే

కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా
అవునో కాదో నే చూడనా..........నీవని నేనని తలచితిరా..

కలవరపాటున కల అనుకొందూ
కలవర పాటున కల అనుకొందూ
కాదనుకొందు కళా నీ ముందూ
కాదనుకొందు కళా నీ ముందూ

కాదు సఖా కల నిజమేలే..........నీవని నేనని తలచితిరా..

https://www.youtube.com/watch?v=s-u8x5bhgVE
Neevani Nenani Song - Panduranga Mahatyam Movie, NT Rama Rao, Anjali Devi, Vijaya Nirmala
Watch Neevani Nenani Song From Panduranga Mahatyam Movie, starring N.T. Rama Rao , Chittor V. Nagaia...

1 comment: