Friday 13 May 2016

01. ,స్టేషన్ మాస్టర్ (1987) .02.ద్రువ నక్షత్రం (1989) ,03.అమెరికా అల్లుడు (1985) ,04. సూర్య IPS (1991,) 05.మంచి మనసులు (1962), 06.రాముడు-భీముడు (1964), 07.ప్రేమనగర్ (1971),08.మల్లెపువ్వు (1978) 09.క్షణం క్షణం (1991),10. ఆఖరి పోరాటం (1988),11. గోవిందా గోవిందా (1993)

ఓం శ్రీ రాం   ఓం  శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ - సంగీత ప్రభ 

image not displayed
సర్వేజనా సుఖినోభవంతు 
నా వాలుజడ కృష్ణవేణి...నా పూలజడ వెన్నెల గోదారి...

చిత్రం : అమెరికా అల్లుడు (1985)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : పి. సుశీల

పల్లవి :

నా వాలుజడ కృష్ణవేణి
నా పూలజడ వెన్నెల గోదారి
నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా
నర్తన చేసిన రతిని భారతిని
కూచిపూడి భారతికి హారతిని...భారతిని...

చరణం : 1

ఏ జన్మలో మల్లెపూ
పూజ చేశానో కుంద రదనైనాను
ఏనాటి కార్తీక దీపాల వెలుగో
ఇందువదననైనాను
అమరావతి బౌద్ధ ఆరామ శిల్పాల
వైరాగ్య భావాల దీకావిరంగు
ఈ చీర చెంగు
మమత సమత మతమై వెలసిన
మధుర భారతి వీణను నెరజాణను నేను

చరణం : 2

ఈ నాల్గువేదాల పాఠాలు
విన్నానో హంసగమననైనాను
ఏ నాసికత్వాల వాదాలు విన్నానో
గగన జఘననైనాను
క్షేత్రయ్య పదకీర్తనావేశ నాట్యాల
రాజ్యాలలో చిందు నా కాలి చిందు
మీ కళ్లవిందు
శ్రుతికి లయకి సుతనై పుట్టిన
మధుర భారతి వీణను నెరజాణను నేను

https://www.youtube.com/watch?v=IHrhkFxTrgw
Naa Vaalu Jada, America Alludu


నెలరాజా..ఆ.. ఇటు చూడరా...నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
చిత్రం : సూర్య IPS (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :
ఓ.. ఓ.. ఓ.. ఓ...
నెలరాజా..ఆ.. ఇటు చూడరా
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేళరా ..తగవేలరా ..రవితేజా

నవరోజా..ఆ.. తెర తీయవా..
నవరోజా..ఆ.. తెర తీయవా..

చరణం 1 :
నీ కోసం ఆశగా నిరీక్షించె ప్రాణం..
నీ చెతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చలించింది పాదం..
నీ రూపే దీపమై ప్రయాణించె జీవం

నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా..ఆ..
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా..ఆ..
రతిరాజువై జతచేరవా..
విరివానవై ననుతాకవా..

నవరోజా..ఆ.. తెర తీయవా..
నవరోజా..ఆ.. తెర తీయవా..
దివితారక తవితీరగా నినుచూచా
జవనాలతో జరిపించవే జతపూజా

నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..

చరణం 2 :
ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని..
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కన్నులపాపగా కలలొ ఆడుకోని ..
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని

ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించనీ ..
దిగంతాల తారల కోట ప్రవేశించనీ
గతజన్మనే.. బ్రతికించనీ..
ప్రణయాలలో.. శృతి పెంచనీ

నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నవరోజా..ఆ.. తెర తీయవా..

ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జతపూజా

నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నవరోజా..ఆ.. తెర తీయవా..


Ilayaraja's one of the best

https://youtu.be/bN6nRqVORy8?list=PLFBE498A261FCAE7D
నన్ను వదలి నీవు పోలేవులే
చిత్రం : మంచి మనసులు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:
నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

చరణం 1:
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

చరణం 2:
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..

ఓ…
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

చరణం 3:
తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా...
నీ మేని హొయలు నీలోని వగలు... నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి... ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..కనరాని లోకాలు కనగా...

ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే..


manchi manasulu,anr,savitri

https://youtu.be/bqA_zXNZvUc?list=PLFBE498A261FCAE7D
మనసులేని బ్రతుకొక నరకం
చిత్రం : సెక్రెటరి (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : రామకృష్ణ

పల్లవి :
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం?
మనసులేని బ్రతుకొక నరకం

చరణం 1 :
మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది

ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది

మనసులేని బ్రతుకొక నరకం
చరణం 2 :
మరువలేనిది మాసిపోదు.. మాసిపోనిది మరలి రాదు
మరువలేనిది మాసిపోదు.. మాసిపోనిది మరలి రాదు

రానిదానికై కన్నీళ్లు...
రానిదానికై కన్నీళ్లు...
రాతి బొమ్మకు నైవేద్యాలు...

మనసులేని బ్రతుకొక నరకం
చరణం 3 :
తరుముకొచ్చే జ్ఞాపకాలు.. ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతు తెచ్చే అందాలు.. కూలిపోయిన శిల్పాలు

కన్ను నీదని.. వేలు నీదని.. పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం?
మనసులేని బ్రతుకొక నరకం


Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidery of Rama Naidu…

https://youtu.be/gD9qfhGcST0
మనసు గతి ఇంతే
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:
తాగితే మరచిపోగలను... తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే ...

చరణం 1:
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే
చరణం 2:
అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే
చరణం 3:
మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే


nice song from the telugu movie premnagar featuring ANR

https://youtu.be/iq16LZmEARc
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:
ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం

చరణం 1:
ప్రేమభిక్ష నువ్వే పెట్టీ
ఈ పేద హృదయం పగులగొట్టీ
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు

ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??

చరణం 2:
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ

ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం

చరణం 3:
మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ
నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..


Nageshwara Rao And Vanishri " Prem Nagar " Movie -Evarikosam Video Song .........For More Old Video…


https://youtu.be/njjKRm_oC0s
మరు మల్లియ కన్నా తెల్లనిది
చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : బాలు

పల్లవి:
చేయి జారిన మణిపూస చెలియ నీవు
తిరిగి కంటికి కనబడితీవు గాని
చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు...
ఎంతటి శాపమే
ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..

చరణం 1:
సఖియా.. ఆ..ఆ.. నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
సఖియా.. ఆ..ఆ.. నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం..

ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..

చరణం 2:
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే..ఏ..
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే..

ఓ.. ప్రియా..
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది..

ఓ.. ప్రియా..



అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే...
చిత్రం: క్షణం క్షణం (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి :
అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే.. అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ...వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ...అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా

చరణం 1 :
మొజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ... చీకటిలో ఇద్దరమే ఉన్నమనుకో
చూడదా సహించని వెన్నెల
దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా

చరణం 2 :
పారిపోను కదా.. అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా.. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటు ఇటు చూడకు..
సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు


Kshana Kshanam Movie Songs - Ammayi Muddu Ivvande Song - Venkatesh, Sridevi, MM Keeravani…

స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వణుకు అందగత్తెలో...
చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :
స్వాతి చినుకు సందెవేళలో...
లేలేత వణుకు అందగత్తెలో...
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా...
భలే కదా గాలి ఇచ్చటా...

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా..
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..
ఇదే కదా చిలిపి ఆపదా

చరణం 1 :
ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్

నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన
చరణం 2 :
ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన




అందమా అందుమా అందనంటే అందమా...చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా

చరణం 1 :

ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగన్నంటది దాగనంటది
ఆకుచాటు వేడుక కిరుక్కుమంటది
వెన్నపూలు విన్నపాలు విన్నానమ్మి ..
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి..
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత...

చరణం 2 :

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చు కోట్టన్ని ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ..
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా.. చింత

https://www.youtube.com/watch?v=x-V0ekPj5hE
Govinda Govinda Movie | Andamaa Anduma Video Song | Nagarjuna, Sridevi
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

2 comments: