Friday 6 May 2016

రాణీ రత్నప్రభ (1955),02. వారసుడొచ్చాడు (1988), 03. సూర్యవంశం (1998), 04. చినరాయుడు (1992),05. రుద్రనేత్ర (1989) ,06. కొదమ సింహం (1990),07.కొండవీటి దొంగ (1990) , 08. పల్లకిలో పెళ్లి కూతురు (2004) 09. సంపూర్ణ రామాయణం (1971) 10.,శంకరాభరణం (1980) 11.సిరివెన్నెల (1986)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

image not displayed
సర్వేజనా సుఖినోభవంతు

నీ అందం నా ప్రేమ గీత గోవిందం...నీ వర్ణం నా కీరవాణి సంకేతం...
చిత్రం : వారసుడొచ్చాడు (1988)
సంగీతం : ఇళయరాజా
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం

నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే

నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

చరణం 1 :
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా

నీ కోసమే ఈడు నేను వేచాములే
నీ కోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసంధ్య పేరంటం
ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం

చరణం 2 :
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా
రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా
గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా

నీ పించమే కిలకించితాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వరబృందా విహారాల కుందేటి ఆనందం

Watch Nee Andam HD Video Song from Varasudochhadu Movie,

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట ...వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే...
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియందే
నేనెట్టా ఎట్టా పిలిచేది...

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే

చరణం 1:
కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గమ్మత్తుగుంది మావా
లేనే లేదంటు హద్దు ముద్దుముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా
బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే వుంచా నేను పోకిరి
చక్కంగ ముందుకొచ్చి సందేళ విందులిచ్చి కాదంటానా జత రా మరి
వారం వర్జ్యం చూడాలి ఆపైన నీతో ఓడాలి

చరణం 2:
ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో
జంట బాణాలు చూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టా మావయ్యో
గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్ధమేమిటో
మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే మరి దేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి

Watch Bullipitta Bujjipitta Song From Chinarayudu Movie, Starring Venkatesh, Vijayashanti among…

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చిత్రం : రుద్రనేత్ర (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే
నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా
అరె గోలీ మార్ దో ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా

https://www.youtube.com/watch?v=UEEP03PIJHE
Rudranetra Movie || Ek Dho Teen Full Video Song || Chiranjeevi, Radha, Vijayashanti
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

చక్కిలి గింతల రాగం...ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...
ఓ ప్రియ యా యా యా యా....

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా ....

సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యాయా...

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా....

చరణం 1:

కౌగిట్లో ఆ కళ్ళు.. కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు...
పాలల్లో మీగడ్లు.. పరువాల ఎంగిళ్ళు ...
మెత్తంగ దోచాడమ్మ లౌజు....
వచ్చాక వయసు.. వద్దంటే ఓ యెస్సు..
బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు

ఊ.. అంటే తంట.. ఊపందుకుంటా...

నీ ఎండ కన్నేసి.. నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు...
యా యా యా....
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలిగుంటల గీతం...
ఓ ప్రియ యా యా యా యా....

చరణం 2:

చూపుల్లో బాణాలు.. సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు...

నీ ప్రేమ గానాలు.. లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు..

గిలిగింత గిచ్చుళ్ళు.. పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే.. నాకు మనసు

సై అంటే జంట.. చెయ్ అందుకుంట...
బుడమేటి పొంగంటి.. బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు
య యాయ....

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...
ఓ ప్రియ యా యా యా యా....

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా ....

సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యాయ...

https://www.youtube.com/watch?v=BNZCk8n4wvY
Kodama Simham Movie Songs || Chakkiliginthala Raagam || Chiranjeevi || Sonam
Chiranjeevi, Radha and Sonam's Kodama Simham Telugu Movie - Chakkiliginthala Raagam Song with HD Qua...

టిప్పు టాపు లుక్కు...లిప్ మీద క్లిక్కు...ఎప్పుడంటే అప్పుడే రెడీ..

చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

హు... హా... హే...
హా టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
రప ప ప ప
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..

చరణం 1:

చం చం చంచం
చం చం చంచంచంచంచం
చం చం చంచం
చం చం చంచంచంచంచం

వేళ లేని పాళ లేని వెర్రిలో
వేడి బుగ్గలంటుకుంటే వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరికా
సమ్మర్ ఇంటి సాల్టు సందెవేళ బోల్టు
అందమైన స్టార్టు ఆకశాన హల్టు
సొమ్ములప్పుచేసి సోకు చూసుకోనా
సొంతమైన దిచ్చేసి సోమసిల్లి పోనా
షేకు నిన్ను చేసేసి షాక్ చూసుకోనా
బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా
తడి సరకుల ఒడి దూడుకుల
ముడి సరకుల ముడి విడుపులలో హొ...
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..

చరణం 2:

చం చచంచం చం చచంచం చం చచంచంచం...
చం చచంచం చం చచంచం చంచంచచంచచంచచం...

మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవీ
కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మోత్తుకున్నమోజులన్ని పిల్లవీ
పైన కోకోనట్టు లోన చాకిలెట్టు
ఈడు స్పీడ్ జెట్టు ల్యాండ్ కాదు ఒట్టు
కన్నుమాటలన్నేసి నిన్ను కమ్ముకోనా
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా
చెంప చేతికిచ్చేసి చేమగిల్లి పోనా
తేనే పట్టు ఒగ్గేసి తెప్పెరిల్లి పోనా
కచటతపల కసి వయసుల గచట ఎప్పుడు
చలి ముడి పడునో హొ...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ..
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
దాదదూదు దీదిదాద...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
హే రపపాపపప రపపాపపప
రంపపాప రంపపాపపా

https://www.youtube.com/watch?v=Tsu0wJSllH0
Kondaveeti Donga Songs Tiptop Look - Chiranjeevi Radha Vijaya Santhi Ilayaraja
Movie: Kondaveeti Donga, Cast: Chiranjeevi, Vijayashanti, Radha, Producer: T Trivikrama Rao, Directo...
 
నేపథ్య గాయని సునీత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)
నా పాట తేట తెలుగు పాట...నాపాట తేనెలొలుకు పాట...

చిత్రం : అతడే ఒక సైన్యం
సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి
రచన : చంద్రబోస్
గాత్రం : సునీత

పల్లవి :

నా పాట తేట తెలుగు పాట నాపాట తేనెలొలుకు పాట
పూల తోటలకు పరిమళమిచ్చే గుమ గుమ పాట
నీలి మబ్బులకు స్నానం పోసే చిట పట పాట
రామ చిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయలపాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట

చరణం :

లేతమనసు కాగితాలలో రాసుకున్న పాట
పూతవయసు పుస్తకాలలో దాచుకున్న పాట
చిలిపికలల చేట్టుకోమ్మలో ఊగుతున్న పాట
పడుచు గుండె ప్రాంగణాలలో మ్రోగుతున్న పాట
అందరుమేచ్చే పాట ఒకరికి అంకితమిచ్చే పాట
పదాలు అన్ని బోయేలుఅయి ప్రేమపల్లకిని మోసే

చరణం :

పైరగాలి పాఠశాల లో నేర్చుకున్న పాట
కోకిలమ్మ కళాశాల లో చదువుకున్న పాట
నదుల లోని జీవరాగమే నింపుకున్న పాట
వెదురు లోని మధురనాదమే ఒదిగి ఉన్న పాట
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట
మనస్సు గెలిచినా పురుషునికి స్వరాలూ అర్చన చేసే
https://www.youtube.com/watch?v=05kR-z23Rak&app=desktop


నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ... నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..

చిత్రం : పల్లకిలో పెళ్లి కూతురు (2004)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : సునీత

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ...
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ... మీలో.. ఒకరైనా..
నా పేరు చెప్పుకోండి .... నా .. నా .. నా పేరు చెప్పుకోండి

కవిత, సరిత , మమత, నిఖిత, రెండు జళ్ళ సీత....
ప్రతిమ, ఫాతిమ, మహిమా, ఉమ, సత్యభామ.....
నీలిమేఘాలతోటి ఆడుకుంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి పాడుకుంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది గాని నా పేరు భాగ్యం కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
ఓటమంటు వొప్పుకోను విజయను కాను వొట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను
నా పేరు... నా .. నా ... నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా

చిన్ని చెక్కిళ్ళలోనా కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నను అర్చించుతున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
బోలేడంత జాలి ఉంది కరుణను కాను
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను....
నా పేరు చెప్పుకోండి .... నా .. నా .. నా పేరు చెప్పుకోండి
మీలో ఎవరైనా ... నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ... మీలో.. ఒకరైనా..
నా పేరు రాణి రాణి రాణి

https://www.youtube.com/watch?v=pXcWL59zar4
Pallakilo Pellikuthuru Songs | Naperu Cheppukondi Video Song | Gowtam, Rathi | Sri Balaji Video
Watch & Enjoy Pallakilo Pellikuthuru Movie Video Songs (720p) Starring Gowtham, Rathi, Screenplay K....

రామయ తండ్రి ఓ రామయ తండ్రి ....... సంపూర్ణ రామాయణం (1971)
రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి ||2||
చరణం : 1
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకె ఇరిసావంట ||2||
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట
చరణం : 2
ఆగు బాబు ఆగు
అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ ||2||
నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే
నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట ||2||
దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
చరణం : 3
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే ||2||
నువు దాటలేక కాదులే రామయతండ్రి ||2||
నన్ను దయ చూడగ వచ్చావు రామయతండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా.....
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : K.V.మహదేవన్
రచన : కొసరాజు రాఘవయ్య
గానం : ఘంటసాల
https://www.youtube.com/watch?v=0zNX0Cbqvyw
రామయ్య తండ్రి || సంపూర్ణ రామాయణం ( Sampoorna Ramayanam )మూవీ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్
Watch Ramayya Thandri Video Song from Sampoorna Ramayanam Movie Starring Shobhan Babu, Chandrakala, ...

దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ...

చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, వాణీజయరాం

పల్లవి :

దొరకునా... దొరకునా... దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ...
దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ...

చరణం 1 :

రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

నాదాత్మకుడవై... నాలోని చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నాదాత్మకుడవై... నాలోని చెలగి
నా ప్రాణదీపమై.. నాలోన వెలిగే
నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా...
దేవాదిదేవా... ఆ...

దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ...

చరణం 2 :

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

నాలోని జీవమై... నాకున్న దైవమై
వెలుగొందువేళ... మహానుభావా
మహానుభావా....

దొరకునా.... సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ... దొరకునా ఇటువంటి సేవ...

https://www.youtube.com/watch?v=cWzIMlh6czk
Dorakuna Ituvanti Seva - Sankarabharanam - Manju Bhargavi
Dorakuna Ituvanti Seva - Sankarabharanam - Manju Bhargavi - Telugu Songs. Groove yourself to the mes...

ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు...

చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు,సుశీల

పల్లవి :

ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు

ఈ గాలి..ఈ.. ఈ నేల..

చరణం 1 :

చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా.. నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా
చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా.. నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా

ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక.. ఎగసేను ని౦గి దాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక.. ఎగసేను ని౦గి దాక
ఎగసేను.. నింగి దాక...ఆ..

ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. ఆ..ఆ..ఆ.. నా కళ్ళ లీగిళ్ళు
ఈ గాలి..ఈ.. ఈ నేల..

చరణం 2 :

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి..ఈ.. కన్నాడో ఈ కలను.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను

ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను

ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను

చరణం 3 :

కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై

గగన గళము ను౦డి అమర గానవాహిని .. ఆ..ఆ..ఆ..
గగన గళము ను౦డి అమర గానవాహిని
జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి..ఈ.. అమృతవర్షిణి..ఈ అమృతవర్షిణీ..
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడే
నీ మురళిలో నా హృదయమే.. స్వరములుగా మారే..
ఆహాహ ఆహ ఆహ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను కన్న నా వాళ్ళు..ఊ.. నా కళ్ళ లోగిళ్ళు..ఊ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ..

https://www.youtube.com/watch?v=VXKFDk1f4Ns
Sirivennela - Telugu Songs - Ee Gali Ee Nela Song
Sirivennela Songs, Siri vennela Songs, Siri vennela movie songs, Sirivennela movie Songs Movie: Siri...

3 comments: