Tuesday 17 May 2016

,01. అన్నదమ్ముల అనుబంధం (1975), 02.ఉమ్మడి కుటుంబం,03. నేరం నాదికాదు ఆకలిది (1976), 04. పెళ్ళిగోల, 05.,తారక రాముడు, 06.బావ - బావమరిది (1993) ,07.రాజసింహం 08 అక్బర్ సలీం అనార్కలి (1978) ,09.కిల్లర్ (1993) ,10.చంటి (1992) 11.మొండి మొగుడు పెంకి పెళ్ళాం

ఓం శ్రీ రాం   ఓం  శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ - సంగీత ప్రభ 


సర్వేజనా సుఖినోభవంతు 

చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా

చరణం : 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి

వెలుతురైనా చీకటైనా విడిపోదు
ఈ అనుబంధం

చరణం : 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి

ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం -

Movie: Annadammula Anubandham Actor : NTR, Bala Krishna, Murali Mohan
youtube.com

Movie : Ummadi Kutumbam(ఉమ్మడి కుటుంబం)(1967)
CAST : NT Rama Rao, Krishna Kumari
MUSIC : TV Raju
Lyricist : Dr. C Narayana Reddy
Singers : Ghantasala , P.Susheela
చెప్పాలని ఉంది అహా
చెప్పాలని ఉంది మ్మ్
దేవతయే దిగివచ్చి
మనుషులలొ కలసిన కథ
చెప్పాలని ఉంది
పల్లెటూరి అబ్బాయిని
పదును పెట్టి వెన్ను తట్టి (ప)
మనిషిగ తీర్చి దిద్దిన
మరువరాని దేవత కథ
చెప్పాలని ఉంది
కోరనిదే వరాలిచ్చి
కొండంత వెలుగునిచ్చి(కో)
మట్టిని మణిగా చేసిన
మమతెరిగిన దేవత కథ
చెప్పాలని ఉంది
అంతటి దేవికి
నాపై ఇంతటి దయ ఏలనో(అంత)
ఎన్ని జన్మలకు
ఈ ఋణం ఎలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో
ఆ దేవికింత చోటిస్తే (నీ)
ఆ లోకమే మరచిపోవు
నీలోనే నిలిచిపోవు
అహా..హా..అహా..అహాహాహా..
ఓ..హో..ఓహో..ఓహో హో

► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema
youtube.com



చిత్రం : నేరం నాదికాదు ఆకలిది (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు

పల్లవి :
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి

చరణం 1 :
కత్తితో ఛేదించనిదీ కరుణతో ఛేదించాలి..
కక్షతో కానిదీ క్షమాభిక్షతో సాధించాలి
తెలిసీ తెలియక కాలుజారితే..
తెలిసీ తెలియక కాలుజారితే.. చేయూతనిచ్చి నిలపాలి

మనలో కాలుజారనివరూ ఎవరో చెప్పండి..
లోపాలు లేనివారూ ఎవరో చూపండి

మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి

చరణం 2 :
గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు

ఆకలి తీరక నేరం చేసే
ఆకలి తీరక నేరం చేసే.. అభాగ్య జీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి

మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి

చరణం 3 :
తప్పు చేసిన ఈ దోషినీ ఇప్పుడే శిక్షించాలి
మరుపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి
ఆహా అయితే.. ఎన్నడు పాపం చేయనివాడూ

ఎన్నడు పాపం చేయనివాడూ.. ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి
ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి

మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి

Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7lW…
youtube.com



ఇది రాగమైన అనురాగమే...తొలి అనుభవ గీతమిదే...
చిత్రం : పెళ్ళిగోల
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజ్ - కోటి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
పల్లవి :
ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే
కన్నులే యద జల్లగా...కాటుకే హరివిల్లుగా
జత పడిన మనకు శ్రుతి కలిసెనిపుడు
ప్రియతమా మధురలయే కదా మనుగడ

చరణం :
వేణువులూదేను వేసవి గాలి
మువ్వలు చిందే కిన్నెరసాని
మగసిరి మారాజు దొరికేనని
సొగసిరి అందాలు దొరకేనని
ఇటు పూలతోట..అటు తేనెపాట
ప్రియ స్వాగతాలు పాడేసన్నగా
అలివేణిలాగా చలి వీణతీగ
విరి మూగబాసలాడె ముద్దుగా
యద ఝుమ్మని...దరి రమ్మని
తొలిఋతువు పలికె పసి పెదవి వణికే
మామ అనే మధుర వసంతమే మనుగడ

చరణం :
నవబృందావని నవ్వుల మాసం
మమతల కోయిల మధురసరాగం
మనసున నీ నీడ పోడిగించగా
మనిషిగ నీలోన తలదాచగా
ముసినవ్వు సిగ్
గు ముత్యాలముగ్గు
రస రాజధాని స్వాగతాలుగా
అటు గోకులాన ఇటు గుండెలోన
నవ రాసలీల సాగేలీలగా
నను రమ్మని...మనసిమ్మని
ఒక తలపు పిలచె ఒడి తలుపు తెరిచే
కలవరాలొలుకు కధే కదా సరిగమ...




చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయం చేయమని....చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని....
చిత్రం:తారక రాముడు
గానం: బాలు
సంగీతం: కోటి
రచన:సిరివెన్నెల
హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి
తియ్యతియ్యనైన పాట పాడనీయి బాధ పోనీ రానీ హాయి
చురుకుమనే మంటకు మందును పూయమని
చిటికెలలో కలతను మాయం చేయమని
చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని
కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే
కుదురు కలిగేలా సేవజేసి సేదదీర్చే ఆశే నాదిలే
వెంటనే నీ మది పొందనీ నెమ్మది
అనితలచే ఎదసడిని పదమై పలికే మంత్రం వేయని
మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్నుకాచే
ముల్లై నిలవనా
మన్నులో వున్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా
నువ్విలా కిలకిలా నవ్వితే దివ్వెలా
కడవరకు ఆవెలుగు నిలిపే చమురై నేనే ఉండనా

Hai Hai vennelamma Video Song from Taraka Ram Telugu Movie Starring Srikanth and Soundarya…
youtube.com


ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...ఉత్తరాలు రాయజాలని ప్రేమలో...

చిత్రం : బావ - బావమరిది (1993)
సంగీతం : రాజ్ కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో...
కలత నిదర చెదిరె తొలి కలల వలపు ముదిరె
కొత్త కొత్తందాలు మత్తెక్కి౦చె జోరులో

చరణం 1 :

ఈ కన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్ద౦టున్న మోమాటాల పక్కనా
ఓ ముద్దు ముద్ద౦టాయే ఆరాటాలు ఏక్కడో
చేరుకో పోదరిళ్ళకి... చీకటి చిరుతిళ్ళకి
అలకాపురి చిలకమ్మకి కులుకె౦దుకో ఒకసారికి
ఒల్లే వేడెక్కి౦ది గిల్లి కజ్జా ప్రేమకి

చరణం 2 :

మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేలా మంచాలేసి సంకురాత్రి చేసుకో
మా మల్లె మాగాణుల్లో మాసులంత చేసుకో
పూబంతి పువ్వందాలు పండిగిట్టి వెళ్ళిపో
పూటకో పులకి౦తగా జ౦టగా పురి విప్పుకో
మరు మల్లెల మహరాజుకి తెరచాటులా ప్రతి రోజుకి
ఆపేదెట్టదింకా పూవ్వై పోయే రెమ్మని..

https://www.youtube.com/watch?v=2tluje83E2A
Uththarala Neeli Full Song ll Bava Bavamaridhi Songs ll Suman, Malasri
Watch & Enjoy : Uththarala Neeli Full Song from Bava Bavamaridhi Songs,Starring Suman, Malasri Subsc...

ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా...
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని..

చిత్రం : రాజసింహం
సంగీతం : రాజ్ - కోటి
సాహిత్యం : వేటూరి
గానం : మనో,చిత్ర

ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని
ఇవి పాడలేని ప్రేమ పాట మూగ పలకరింతలు
ఎద నోరు విప్పి చెప్పలేని కన్నెపూల బాసలు
ఒక చిన్నమాట ప్రియతమా ఒడి కోరుకున్న హృదయమా
అరచేతిలోన చూపు నాకు ప్రేమరేఖనీ...
ఇవి జంకు బొంకు లేని ప్రేమ లింకు సంకురాత్రులు
నును లేత బుగ్గ కందగానే జరుగు జంట శాంతులు

జమలు పడ్డ వయసుమీద సొగసులెక్క చూడనా
చిలిపి లిప్పు వలపు అప్పు కలిపి నేను తీర్చనా
వలపునింక అదుపు చేసి పొదుపు చేస్తే మెచ్చనా
తలుపు చాటు చిలిపి కాటు పడితే నిన్ను గిచ్చనా
కౌగిళ్లు లవ్ గిల్లు క్యాషు చేసి చూడనా
చెక్కిళ్ళ చెక్కుల్లో క్రాసు చేసి ఇవ్వనా
ఒక పసిడి వనిత రజిత కమల నిలిచె కనుల ఎదుట
ఇక గనక గుళిక విసరమనక మనకు పవరుబరువై

ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని

పడుచు సోకు ఉడకబోత మెడల దాకా ఎక్కినా
తలుపు నేను తెరవలేను వలపు గాలిగా
నడుములేని నడకలోని తడుపు ఎంత చూసినా
తడమలేను తొడిమనింత తొలకరింతగా
ఎన్నెల్లో ఎండల్లే మనసు మంట పెట్టనా
కనుల్లో గుండెల్నే కలలు గంట కొట్టినా
ఇది ఒకరికొకరు దొరికి ఇరికి చెవులు కొరుకు వయసు
ఇది మెలిక పడిన మెరుపు చెలికి నాలుగులిడిన వెలుగే

ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని
ఇవి పాడలేని ప్రేమ పాట మూగ పలకరింతలు
నును లేత బుగ్గ కందగానే జరుగు జంట శాంతులు
లల...లలల...లల...

https://www.youtube.com/watch?v=OKH5u129uM0
Raja Simham Songs - Oka Chinna Maata Priyatama Song - Rajasekhar - Soundarya - Ramyakrishna
Raja Simham Movie Songs, Raja Simham Songs, Raja Simham Film Songs, Oka Chinna Maata Priyatama Song,.

కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే

చిత్రం : స్టూడెంట్ నెం:1 (2001)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

పల్లవి :

కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

చరణం : 1

అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్
కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్
అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్
అందగాడి గోటి ముద్ర కావాలోయ్...

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే
ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే

చరణం : 2

మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
గుత్తిగా నీ బంగారం త లకు తగులుతుంటే
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
బుగ్గలోన పండుతుంది జాంపండు
పక్కలోన రాలుతుంది ప్రేంపండు
రాతిరేళ వచ్చిపోరా రాంపండు
బంతులాడి పుచ్చుకోరా భాంపండు...

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే

https://www.youtube.com/watch?v=IIBzVbISXsQ&feature=youtu.be
kaastha nannu nuvvu Student No1

చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం : సి. రామచంద్ర
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : మొహమ్మద్ రఫి, సుశీల

పల్లవి :

తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా పిడుగులే రువ్వుతుంటే ఏం చేయను?

చరణం 1 :

నేను అనుకొంటినా? మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని..ఆ ఆ
నేను అనుకొంటినా? మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని
అందమే నన్ను చేరి కొనగోటితో...
అందమే నన్ను చేరి కొనగోటితో... గుండెలో మీటుతుంటే ఏం చేయను?

తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?

చరణం 2 :

చేత మధు పాత్ర లేదు..
చేత మధు పాత్ర లేదు.. నాకిప్పుడు......ఐనా అంటారు నన్నే...తాగేనని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై...
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై...కైపులో ముంచుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?

చరణం 3 :

నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ ... ఆ.. ఆ... ఆ
నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై... ఊహలో పొంగుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
లలా... లలలాలలా.... లలా... లలలాలలా

Akbar Saleem Anarkali Movie || Thane Meli Musugu Video Song || NTR, Balakrishna, Deepa
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

సింధూరపూ పూదోటలో చిన్నారి ఓ పాపా...ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా

చిత్రం: కిల్లర్ (1993)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ..
ఆ కథ ఎందుకులే..ఏ..

చరణం 1:

తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ
విధి చదరంగంలో.. విష రణరంగంలో
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట

చరణం 2:

రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై..
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా

https://www.youtube.com/watch?v=PEvJ32XXQt8

Killer Movie || Sindhura Puvvu Video Song || Nagarjuna, Nagma
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll

పావురానికి పంజరానికి...పెళ్లిచేసె పాడు లోకం...

చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు

పల్లవి :

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం
ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ...

చరణం 1 :

తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను
చేసిన పాపములా ... ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ... ఇది దేవుని శాసనమా .. ఇది తీరేదే కాదా

చరణం 2 :

తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం .. నా మీద నాకేలే కోపం
నా తొలి నేరములా .. ఇవి తీరని వేదనలా
నా మది లోపములా .. ఇవి ఆరని శోకములా .. ఇక ఈ బాధే పోదా

https://www.youtube.com/watch?v=UuV8H5WCd0E
Chanti Songs - Pavuraniki Panjaraniki Song - Venkatesh, Meena - Ilayaraja Hits
Chanti Telugu movie songs, Pavuraniki Panjaraniki Song starring Venkatesh, Meena. Directed by Ravi R...
 

నాటకాల జగతిలో జాతకాల జావళి...కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి...

చిత్రం : మొండి మొగుడు పెంకి పెళ్ళాం
సాహిత్యం : వేటూరి
సంగీతం : కీరవాణి
గానం : కీరవాణి,

పల్లవి :

నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు
నీటికి నీరే పుట్టదు నీకు ఈ బాదే తప్పదు

చరణం :

పరువాల పాప చెరువుల్లో చేప నీరంతా కడిగేస్తున్నా
అది చూసి లోకం విసిరేస్తే గాలం గాలైన కాపాడేనా
విలువ బలైనా జన్మకు శిలువ పడేనా
విధికి గులామై ధర్మం తలవంచేనా
చేలైనా మేసేటి కంచిలివేలే

చరణం :

అందాల చెల్లి తన చంటి తల్లి మానాలు మసిబారేనా
ఓణి కి రాని ఓ ఆడ ప్రాణి సింగాల కసి చూసేనా
నరకమనేది ఇంటికి ముందు వసారా
శునకమనెది భర్తకు మిగిలిన పేరా
దెయ్యాలు వేదాలు పాడిన వేళ

https://www.youtube.com/watch?v=krktpxKt364
Mondi Mogudu Penki Pellam Songs - Naatakala Jagathilo Song - Suman, Vijayashanti
For more content go to http://www.mangomobiletv.com/ Follow us on twitter at https://twitter.com/man...

No comments:

Post a Comment