Wednesday 25 May 2016

01.శ్రీకృష్ణావతారం , 02.నర్తనశాల 03. సీతారామ కళ్యాణం, 04.శత్రువు (1991), 05. మెకానిక్ అల్లుడు (1993),06. Danceforever ,07. బందిపోటు ,08-24, 09.విక్రమసింహ, 10. రోబో (2010), 11. బాబా (2002)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనాసుఖినోభావంతు

ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది...రేలుపవలు తెలియని నా మనసు

చిత్రం : శ్రీకృష్ణావతారం
సంగీతం : టి. వి. రాజు
రచన : సముద్రాల
గానం : సుశీల

పల్లవి :

ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు
రేకులు విప్పిన తొలి వయసు

చరణం 1 :

పువ్వులు... మువ్వలు...
పువ్వలు పులకరించి నవ్వులొలుకుతున్నవి
మువ్వలు పరవశించి సవ్వడి చేస్తున్నవి.. సవ్వడి చేస్తున్నవి

చరణం 2 :

నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా

https://www.youtube.com/watch?v=_ZoaavWsc3Y
ememo avutundi egisi egisi in ntr krishnavataram
sri krishnavatharam

సలలిత రాగ సుధా రససారం ....సర్వ కళామయ నాట్య విలాసం....

చిత్రం : నర్తనశాల
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సంగీతం : మంగళంపల్లి బాలమురళి కృష్ణ ,బెంగళూర్ లత
సాహిత్యం : సముద్రాల

సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రససారం

మంజుల సౌరభ సుమకుంజములా
రంజిలు మధుకర మృదు ఝుంకారం
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రససారం

ని దా ద ప నీ ప నీ దా ప మ గ మ గ పా స రి గ

కల్పనలొ ఊహించిన హొయలు
కల్పనలొ ఊహించిన హొయలు
శిల్ప మనొహర రూపమునొంది
పద కరణములా మృదు భంగిమలా
పద కరణములా మృదు భంగిమలా
ముదమార లయమీరు నటనాల సాగె
సలలిత రాగ సుధా రససారం
ఝనన ఝనన ఝనన నొంపుర నాదం
ఆ ఆ ....
ఝనన ఝనన ఝనన నొంపుర నాదం
భువిలొ దివిలొ రవళింపగా
ప ద ప మ పా ఆ ... మ ని ద మ దా ఆ .. గ మ ద ని సా ఆ...
రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ దా మ ప నీ దా నీ దా పా మా గ పా మ ప ని సా సా

భువిలొ దివిలొ రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినొదమీ
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం

https://www.youtube.com/watch?v=ehSC4t9_pgc
Narthanasala Songs - Kalalitha - NTR - Savithri
NTR Savithri S V Ranga Rao Sobhana Babu's Narthanasala Telugu Old Movie Song Music : Susarla Dakshin...



అమ్మ సంపంగి రేకు...అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు...అందాలు అంటుకోకు

చిత్రం : శత్రువు (1991)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత :సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :
అమ్మ సంపంగి రేకు...అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు...అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు...
విచ్చుకుంటా గానీ వీడిపోకు...
జై మదనకామ నా ప్రేమ ఈ భామా సై అంటే మోతరో...
నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంతలేతరో...

చరణం :
కలే కలై కలయికే సెగై చలి గిలా గిలా ముగిసే
సరే సరే గడు సరే జతై మగసిరి పురి తెలిసే
శ్రీరాగం చిందులు వేసే నాపాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే
సైఅంటే నీకళ్ళు సందిల్లే పందిళ్ళు
ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దేళ్ళు
మాపటేలా దీపమేల చందమామ లాంటిపిల్ల చందనాలు చల్లిపోతే

చరణం :
యమో యమో చలి ఉపాయమో కసి కధాకళీ తెలిపే
నమో నమో మరునిబాణమో విరి దుకాణమో తెలిసే
నీ చూపుల ధీమంత్రాలే సాయంత్రాలాపాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే
ఇంకేమి ఇవ్వాలో తమకేమీ అవ్వాలో
ఒకటైతే మనసివ్వు రెండైతే ఒకటవ్వు
మంచిరోజు పొంచివుంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో


ఝుమ్మనే తుమ్మెదవేట...ఘుమ్మనే వలపులతోట...
చిత్రం : మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం : రాజ్ - కోటి
రచన : భువన చంద్ర
గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం, చిత్ర

ఝుమ్మనే తుమ్మెదవేట...ఘుమ్మనే వలపులతోట
అదేమో మామా...అదేలే ప్రేమా
జగదేక వీరసూరా తరించెయ్ రా
సరసాల సాగరాలే మధించేయ్ నా

మిడిసి మిడిసి పడు ఉడుకువయసు కధవినలేదా
ఎగసి ఎగసి పడు తనువు నువ్వు కనలేదా
పెదవులతో కలవమని
అందుకే నీ ముందుకొచ్చా
అందినంతా ఆరగిస్తా
రారా రారా రాజచంద్రమా

సెగలు రగిలె ఒడి బిగిసె రవికముడి కదిలేవో
చిలిపి వలపు జడి తగిలె రగిలె ఒడి జవరాలా
వడి వడిగా ముడి పడనీ
చెప్పలేకే చేరుకున్నా
ఓపలేకే మేలుకున్నా
రావే రావే రాజమంజరి

ఝుమ్మనే తుమ్మెదవేట...ఘుమ్మనే వలపులతోట
అదేమో మామా...అదేలే ప్రేమా
శృంగార సార్వభౌమా తరించేయ్ రా
సరసాల దేవి చేరి సుఖించేయ్ నా

Watch the song 'Jhummani tummeda...' featuring Chiranjeevi and Vijayashanthi from the film 'Mechanic Alludu'. Directed by B Gopal, this film…
 06. Danceforever 

 
చిత్రం : బందిపోటు
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
రచన : ఆరుద్ర

ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే
ప్రియా....ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే

వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే
దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే
సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే



ప్రేమ పరిచయమే దైవ దర్శనమే...ప్రేమ అడుగులలో దేవతార్చనమే...
చిత్రం : 24
సంగీతం : AR.రెహమాన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : హ్రిదయ్ గట్టని,చిన్మయి శ్రీపాద

పల్లవి :
ప్రేమ పరిచయమే దైవ దర్శనమై
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

చరణం :
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులు ఎవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన చెలిమిలేని ప్రేమనే
నీలో చదివా ఈ క్షణమే

చరణం :
హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో

Listen to the full audio song 'Prema Swaramulalo' from the Telugu movie '24'. Singers: Hriday Gattani, Chinmayi Sripada Music: A. R. Rahman Lyrics:…
youtube.com


ఏదేమైనా సఖి విడువను నిన్నే...ఒట్టుగా ఒట్టుగా చెపుతున్నానే
ఏలే సూర్యుడి పైన జాబిలి పైనా ...ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే

చిత్రం : విక్రమసింహ
సంగీతం : AR.రెహమాన్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : ఉన్నికృష్ణన్,లత రజనీకాంత్

ఏదేమైనా సఖి విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెపుతున్నానే
ఏలే సూర్యుడి పైన జాబిలి పైనా
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఒకపాపగా నిన్నే కనుపాపగా నిన్నే
కాచుకొందుకై బాసలు చేయుచుంటినే

జ్జ్ఞాపకమే రారిక కన్నవారైనా
కలనైనా తలవను ఏ కన్నెనైనా
చిట్టి గొలుసు చప్పుల్లకే చెంతకి రానా
ఒట్టుకి ఒక ముద్దునొసగి బానిసకానా
నువ్వడిగే ఏ వరమైనా భారము కాదే
మన నడుమున ఏ వాడదనైన ఓటమి నాదే

ఆశతీరినాక ప్రేమ ఆపుకోనే
అర్దరాత్రి దొంగైనీకు బెదురుతానే
నువ్వు ముసలివైన వేళ ముదమూడవకాలౌతా
నలత గుంటే నా ఒడినే పానుపు చేస్తా
ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పోస్తా
నీవారిని నావారిగ యదలో దాస్తా
నీ కల నిజమవటానికి ననుబదులిస్తా
నీ క్షేమం కోసమైతే ప్రాణాలిస్తా

ఏదేమైనా సఖా విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెపుతున్నాలే
తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా
ఒట్టుగా ఒట్టుగా చెపుతున్నాలే
ఒక దీపం ఓలే ప్రతిబింబం నిన్నే
కొలుచుకుందుకై బాసలు చేయుచుంటిని

Watch Yedemaina Sakhi Official Song Video from the Movie Vikramasimha Song Name - Yedemaina…

నీలో వలపు అణువులే ఎన్నని...neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని
చిత్రం : రోబో (2010)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వనమాలి
గానం : విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషల్

నీలో వలపు అణువులే ఎన్నని
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే
అయ్యో...సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ newton సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

నువ్వు బుద్దులున్న తింగరివి
కానీ ముద్దులడుగు మాయావి
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం
ధీం తోం తోం మదిలో నిత్యం
తేనె పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ధీం తోం తోం మదిలో నిత్యం

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

సీతాకోక చిలకమేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరిగెత్తు వాగుల నీటిలో oxygen మరి అధికం
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం
ఆశవై రావ! ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా
వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు
గుండె వాడుతున్నది
వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన
ప్రేమల కాలం వాడుతున్నదే

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

నీలో వలపు అణువులే ఎన్నని
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో
సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ newton సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

Neelo Valapu Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman Movie:…

దేవా...దేవా...తల్లివి నీవే తండ్రివి నీవే...ప్రణవము నీవే ప్రాణము నీవే...
చిత్రం : బాబా (2002)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : శివగణేష్
గానం : కార్తీక్

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మెమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..
శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..
దేవా...దేవా...
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
రేణువు నీవే స్థాణువు నీవే
జులుమునణచుటకు
గురిని గెలుచుటకు శక్తినివ్వూ

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మేమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ..

నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వూ
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వూ
తల పొగరు సిగపట్టి ఈడ్పించు శక్తినివ్వూ
పేదింటి చీకటిని తొలగించు శక్తినివ్వూ
దావాగ్ని జ్వాలల్ని ఛేదించే శక్తినివ్వూ
నా మాటతో ఊరు మారేటి శక్తినివ్వూ

తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
దేవా...దేవా...

బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ని వంచించబోను
ఓ నిచ్చెనై నిలుచుండి నేమోసపోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నే బ్రతికేది నీ కొరకె విడిచి నే పోనూ
గద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించిపోను
దేవా... దేవా...

తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
రేణువు నీవే స్థాణువు నీవే
జులుమునణచుటకు
గురిని గెలుచుటకు శక్తినివ్వూ
నేనడుగేస్తే అదరాలి అధికార పీఠం
నేనెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ..శక్తి నివ్వూ..

Watch : Baba Telugu Movie || Sakthinivvu Full Song || Rajinikanth, Mansiha Koyirala Subscribe to our…

2 comments: