Tuesday 15 March 2016

01. ఉయ్యాల - జంపాల (1965) ,02.శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)03 సంకల్పం,04అల్లరి బుల్లోడు (1978),05.రాంబంటు ,06. సంపూర్ణ రామాయణం (1971),07. దేవీపుత్రుడు 08.నరసింహ నాయుడు ,09.చూడాలనివుంది (1998) 10.రాగం,11. ఆజాద్


                                        ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
                                       ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
                                           Not a chance in Hell that I'd ever use a guitar or bass that looked like this (I just hate spiders), but it is a pretty cool and unusual looking bass.:

                                         సర్వేజనా సుఖినోభవంతు



అందాల రాముడు ఇందీవర శ్యాముడు...ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు...

చిత్రం: ఉయ్యాల - జంపాల (1965)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: లీల

పల్లవి:

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
ఎందువలన దేవుడు

చరణం 1:

తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను...ఊ..ఊ..
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు...

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం 2:

అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ...ఊ..
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను..
అందాల రాముడు అందువలన దేవుడు ...

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం 3:

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను...ఊ..ఊ..
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకాసతినే విడనాడెను...
అందాల రాముడు అందువలన దేవుడు

అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... అందాల రాముడు
ఇందీవర శ్యాముడు... ఇందీవర శ్యాముడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు

https://www.youtube.com/watch?v=QYrbhbL9Cug
andala ramudu .flv
from uyyala jampala, devotional
 

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ...సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో
చిత్రం : సంకల్పం
సంగీతం : కోటి
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం,K.S.చిత్ర

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ

ఉల్లిపూల నావగట్టి మల్లెపూల గొడుగుబట్టి ఉరేగాలంట వెన్నెల్లో
నారుమల్ల చీరగట్టి నల్ల మబ్బు కాటుకెట్టి ఊగేయాలంట ఊహల్లో
సూదంటు చూపులున్నవాడు నా వన్నెకాడు
లేలేత బుగ్గలిచ్చి అల్లరి ముద్దులు ఉబ్బిన క్షణమున

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

కూసింది కన్నెపిట్ట కసెక్కే కౌగిలి వలపున వాటంగా వలపివ్వని
ఊగింది మల్లెమొగ్గ సురుక్కు చూపులు తడిమిన వాకిట్లో విడిదిమ్మనీ
పెదవులలో చెలీ సఖీ స్వరాలు శ్రుతించనా
మధువులలో ప్రియా ప్రియా పదాలు లిఖించనా
రవికకు రాగాలు నేర్పించనా
మదనుడి మాన్యాలు రాసివ్వనా

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

తుళ్ళింది లేత ముళ్ళు తపించే తుంటరి తుమ్మెద వెచ్చన్ని ఒడి చేరగా
కొట్టింది తేనె జల్లు వలేసే ఒంపున నడుమున వయ్యారి నిలదీయగా
అలసటలే తెలియని సుఖాల మదింపులో
బిడియములే ఎరుగని నరాల బిగింపులో
నడుముకి నాట్యాలు నేర్పించనా
పరువపు శంఖాలు పూరించనా
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ

Watch Acchatlo Song From Sankalpam Movie, starring Jagapathi Babu, Gowthami, Chandra…
youtube.com

చిత్రం: అల్లరి బుల్లోడు (1978)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

చరణం 1:
నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక

నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చరణం 2:
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆ.........
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి

Provided to YouTube by Sa Re Ga Ma Chukkala Thotalo · S P Balasubrahmanyam · P Susheela Allari Bullodu Tlg ℗ Saregama India Ltd Released on: 1978-01-12 Auto-...
youtube.com

చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి...సందెమసక చీరగట్టి సందు చుసి కన్ను కొట్టి
చిత్రం : రాంబంటు
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చుసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటె మగరాయుడు
అరిటిపువ్వు తెస్తడు అడవి పురుషుడు

భద్రాద్రిరామన్న పెళ్లికొడుకవ్వాల
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల
బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల

విన్నపాలు వినమంటె విసుగంటాడు
మురిపాల విందంటె ముసుగెడతడు
బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదర చిలకడు
కౌగిలింతలిమ్మంటె కరునించడు
ఆవులింతలంతాడు అవకతవకడు

ఏడుకొండలసామి ఏదాలు సదవాల
చెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తెన్న అన్ని వరాలివ్వాల
సింహాద్రి అప్పన్న సిరిజాశలివ్వాల

పెదవి తెనెలందిస్తె పెడమొములు
తెల్లరిపొతున్నా చెలి నొములు
పిల్ల సిగ్గు చచ్హినా మల్లె మొగ్గ విచ్హినా
కదలడు మెదలడు కలికి పురుషుడు


ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా...ప్రాణమా...ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా...కుంకుమ...
చిత్రం : దేవీపుత్రుడు
సంగీతం : మణిశర్మ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాలు, ప్రసన్న

పల్లవి :
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...
ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా కుంకుమ...
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా

చరణం : 1
అసలెందుకే ఆ అమృత మే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
సెగ కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి...

చరణం : 2
శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చే రుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...

Devi Putrudu 2001 Telugu film directed by Kodi Ramakrishna. The film stars Daggubati Venkatesh, Anjala Zaveri, and Soundarya in important roles

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో...కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో

చిత్రం : నరసింహ నాయుడు
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ్, హరిణి

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
సిగ్గే తీరక చిర్రెక్కుతున్నదు సింగారంలో
ముంచావే మైకంలో
దించావే నన్నీ మాయదారి హాయివేడిలో

నీదేహంతో స్నేహం కావాలింకా
ఐపోతానే నేనీ కోకా రైకా
కలివిడిగా నువు కలపడగా అతిగా
నిలవదిక చెలి అరమరిక సరిగా
నిగనిగ నిప్పుల సొగసులు చిమ్మక
మిల మిలలాడే ఈడు జాడ చూడనీ ఇక

సింగంలాగా ఏంటా వీరావేశం
శృంగారంలో చూపించాలా రోషం
దుడుకుతనం మా సహజగుణం చిలకా
బెదరకలా ఇది చిలిపితనం కులుకా
సరసపు విందుకు సమరము ఎందుకు
తళతళలాడే తీపి ఆకలి తీరనీ ఇక

https://www.youtube.com/watch?v=BzqggPHS9R4
Narasimha Naidu Songs | Kokkokomali Video Song | Balakrishna, Simran | Sri Balaji Video
Watch & Enjoy Narasimha Naidu Movie Video Songs (720p) Starring Bala Krishna, Simran, Asha Saini, Di...
 
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు...అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు

చిత్రం: చూడాలనివుంది (1998)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుజాత

పల్లవి:

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
అబ్బబ్బా.. ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో
గిల గిలలాడే సొగసుకే జో లాలి....

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు

చరణం 1:

వాటేసుకో వదలకు..... వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
దోచెయ్యనా దొరికితే..... దొరకని కోకసిరి
రాసెయ్యనా పాటలే పైట చాటు చూసి
ఎవరికి తెలియవు....... ఎద రసనసలు
పరువాలాటకు...... పానుపు పిలిచాకా.......
తనువు తాకినా తనివి తీరని వేళా...ఆ..

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు

చరణం 2:

జాబిల్లితో జతకలు.... జగడపు రగడలతో
పొంకాలతో నిలు నిలు పొగడమాల వేసి
ఆకాశమే కొలు కొలు..... తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు చుక్క మంచుతోటి
అలకల చిలకలు..... చెలి రుసరుసలు
ఇక జాగెందుకు.... ఇరుకున పడిపోకా....
మనసు తీరినా వయసు జారనీ వేళా....ఆ

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో
గిల గిలలాడే సొగసుకే జో లాలి....

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ము..

https://www.youtube.com/watch?v=aq6iwpYTyb8
Choodalani Vundi Movie | Abbabba Iddu Video Song | Chiranjeevi, Soundarya, Anjala Zhaveri
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
 
తాయే యశోదా ఉందన్నాయకులతుదిత్త..వాయన్ గోపాలకృష్ణన్ చెయ్యుమ్
జాలత్తైకేలడి

చిత్రం : రాగం(rAgam) (2006)
రచన : ఊతుకా వెంకటసుబ్బయ్యర్
సంగీతం : మణిశర్మ
గానం : రంజనీ రామకృష్ణన్,సుధా రఘునాథన్

సాసాస రిరిసస్ససాస రిరి సాసాస
నిసరిస నిసరిస నిసరిస
నిరిస దాదా
దదరీరీరి రీరిరీరి నిరినిరి గారీ
నిగరి నిరిని దనిద
మగమ గరిని ఆ....
తాయే యశోదా
ఉందన్నాయకులతుదిత్త
వాయన్ గోపాలకృష్ణన్ చెయ్యుమ్
జాలత్తైకేలడి॥యశోదా॥॥
తాయే... యశోదా...
ఓ యశోదా ద సన్ ఆఫ్ యువర్స్
దేర్ ఈజ్ నన్ లైక్ హిమ్
ఇన్ ద యూనివర్స్
ఓ యశోదా ద సన్ ఈజ్ యువర్స్
దేర్ ఈజ్ నో వన్ లైక్ హిమ్
ఇన్ ద యూనివర్స్
తానమ్‌త తానమ్‌త తననన (2)
తానమ్‌త తానమ్‌త తననననన
నననననా...
ధీంతనన ధిరనననానా
ధీంతనన ధిరనన ధిరనా
తాననననా తాననననా
తాన నననానా
ససరి సరిసా సస్సరిససా
పద మదనిసా నిగ రినిసదా
నిసరిసరిసా సాసనీ
నీనీనీనీ సరిసనిసరిసనీ రిసనిదా
దదద నినిని దదద
రిరిరి దదద గా... గరి నిరిగారీ
గగరిరీ నినిదదాగగరిరీ
రినిసా రిరిరీ నిరిదా
రిరిసా సాస నిసరిసా నిసరిస నిసరిస నిరిస నిరిస నిరిస
దా మదనీనినీని దదనీనినీని
దదరీరిరీరి
సగరి సరిసా రినిసనిదనీ దదని
దమదా మదమదనిసా
గరిసా రిసనీ రిసనీ సనిదా గరిస
నిద రిసనిద పదనిదపమ
పదనిదపమ పదపమ దపమగరి
ససస రిరిరి గగగ మమమ
పదపమ గగగ మమమ
దదద నినినిసా
సరిసరిగమపమ గమగమపద
నిద పదపదనిసరిస
నిగరి నిదమ గరిని రిగరి గమగ
మదమ దని రినిదమ
రిగమగమద మదని
దనిరి మగరిని
మదని దనిరి నిరిగరి రిగమపమ గమపా...ఆ...ఆ...నా...
తాయే యశోదా... యశోదా... యశోదా...యశోదా...

https://www.youtube.com/watch?v=TZBnwIPsfIU
Morning Raga video song - Thaye Yashoda (Great quality) [www.keepvid.com].mp4
my mosssssssst favourite song.
 

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా...అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

చిత్రం : ఆజాద్
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్,మహాలక్ష్మి

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కల్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

https://www.youtube.com/watch?v=dutCy4En6F4
Azad Movie || Kala Anuko Kaladanuko Video Song || Nagarjuna, Soundarya, Shilpa Shetty
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

1 comment: