Friday 4 March 2016

01.జరిగిన కథ ( 1969 ) ,02.baatasaari -1961 ,03.పుణ్యస్త్రీ 04.ఆడాళ్ళు మీకు జోహార్లు (1981) ,05.ఆడదే ఆధారం (1998) ,06.లక్షాధికారి (1963),07.సంకీర్తన (1987) ,08.బ్రహ్మ, 09రుద్రవీణ (1988) ,10.వేటగాడు (1979) ,11. జగదేకవీరుడు అతిలోకసుందరి (1990



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం
ప్రాంజలి  ప్రభ - సంగీత ప్రభ
red+roses+and+butterflys
సర్వేజనా సుఖినోభవంతు
ఏనాటి కైనా ఈ మూగ వీణా...రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

చిత్రం: జరిగిన కథ ( 1969 )
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా
ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

నిను చెరి నా కధా వినిపించలేను...
ఎద లోని వేదనా ఎలా తెలుపను
నిను చెరి నా కధా వినిపించలేను...
ఎద లోని వేదనా ఎలా తెలుపను
మనసేమో తెలిసి మనసారా పిలిచీ...
మనసేమో తెలిసి మనసారా పిలిచీ
నీలోన నిన్నే నిలుపుమూ స్వామీ...

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...
నా స్వామి మెడలో నటియించునా
ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...
నా స్వామి మెడలో నటియించునా
ఏలాటి కానుక తేలేదు నేనూ...
ఏలాటి కానుక తేలేదు నేనూ
కన్నీట పాదాలు కడిగేను స్వామీ
ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా
క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

https://www.youtube.com/watch?v=VXh3OnNpsQI
Yenaatikainaa Song - Jarigina Katha Movie Songs - Krishna - Kanchana - Jaggaiah
Watch Yenaatikainaa Song From Jarigina Katha Movie, Starring Krishna, Jagayya, Vijayalalita among Ot...


మహిళలు మహరాణులు... మహిళలు మహరాణులు...
అచ్చమైన ప్రతికధకు తల్లివేరు పడతులు

చిత్రం : ఆడదే ఆధారం (1998)
సంగీతం : శంకర్ గణేష్
గీతరచన : సిరివెన్నెల
గానం : S.P . బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :

మహిళలు మహరాణులు... మహిళలు మహరాణులు...
అచ్చమైన ప్రతికధకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాన అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు

చరణం :

ఆశ పుడితే తీరే దాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు నెలతలు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవ్వరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు

మహిళలు మహరాణులు... మహిళలు మహరాణులు...

చరణం :

విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లె ముప్పుకాదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే వద్దంటే మానము మరియాదా ఆగునా ఆయింటా...
కన్నులను కరుణ కొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే అపేదింకెవరులే...
వంగివున్నా కొమ్మలే బంగారు బొమ్మలూ...

https://www.youtube.com/watch?v=-ZHMAAPRqFA
mahilalu maharanulu adade adharam
Mahilalu Maharanulu చిత్రం - ఆడదే ఆధారం (1998) సంగీతం - శంకర్ గణేష్ గీతరచన - సిరివెన్నెల గానం - S.P ...


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే..
చిత్రం : లక్షాధికారి (1963)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి :
దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

చరణం 1 :
నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని.. తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే

చరణం 2 :
పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే


Watch NTR Krishna Kumari's Lakshadhikari Telugu Old Movie Song With HD Quality Music - T Chalapathi Lyricist - C Narayana Reddy

ఏ నావదే తీరమో..ఏ నేస్తమే జన్మవరమో..కలగానో.. కథగానో..మిగిలేది నీవే..ఈ జన్మలో..

చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం: ఏసుదాస్

పల్లవి :

ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో...ఓ..ఓ... కథగానో.... ఓ.. ఓ..
మిగిలేది నీవే... ఈ జన్మలో... ఓ...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

చరణం 1 :

నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో

విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను... ఉ.. ఉ...

ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

చరణం 2 :

ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను

కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
నీవు... నేనే... సాక్షాలను...

ఏ నావదే తీరమో.... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో... ఓ... కథగానో.... ఓ...
మిగిలేది నీవే ఈ జన్మలో...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

https://www.youtube.com/watch?v=ILdYpASsacI
Ye Naavadi Ye Teeramo - Superhit Telugu Song - Sankeerthana Movie Video Song
Ye Naavadi Ye Teeramo - Superhit Telugu Song - Sankeerthana Movie Video Song. Watch and enjoy this b...


ముసి ముసి నవ్వులలోన...కురిసిన పువ్వుల వాన...

చిత్రం: బ్రహ్మ
గానం: ఏసుదాస్
సంగీతం: బప్పిలహరి

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాన్ని అవమానపరచినా
ఎదలోని చీకటంతా వెన్నలగా మార్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

అనురాగజీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళ బతుకులోనా వడగళ్ళురాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

https://www.youtube.com/watch?v=mSIpc_gc-U4
Musi Musi Navvulalona _with lyrics_ - Brahma _1992_ - Bappi Lahari.flv


నీతోనే ఆగేనా సంగీతం బిళహరి...నీతోనే ఆగేనా సంగీతం...బిళహరీ అని పిలువకుంటే...

చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఏసుదాస్

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం
బిళహరీ అని పిలువకుంటే
స్వరవిలాసం మార్చుకుంటే
ఆరిపోదు గానజ్యోతినీతోనే ఆగేనా సంగీతం

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
యుగయుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

నీతోనే ఆగేనా సంగీతం

విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది
ఏ జ్ఞానం ఆ నాదం
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో
ఎడారిపాలు కాదా గానవాహిని
వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా

నీతోనే ఆగేనా సంగీతం

మగపద నీ..తోనే
సరీగ రిగాప గపాద నీ...తోనే
సరిగ రిగప మగపద మగ రిగప
గపద మగపదదరి నీ...తోనే
పాదమ గపద రిస రీగరి సనిదప ద
దాసరిగ పాగసరి గాపదస రీగసరి సరిగపదరి నీతోనే
సరిగ పమగ రిగపమగరి సాస సాస రీరి రీరి
సని ద సని ద పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద రిగరి సనిదప
మగపద గసనిదప దని సనిద
సరిగపద రిగపద దరి
నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే
స్వర విలాసం మార్చుకుంటే
ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం

https://www.youtube.com/watch?v=uxuJHogDTyc

Bilahari Neethone Song - Rudraveena Movie Songs - Chiranjeevi - Shobhana - Illayaraja
Watch Bilahari Neethone Song From Rudraveena Movie. Starring Chiranjeevi, Gemini Ganesan, Shobana, K..


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా...

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

చరణం 1 :

తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలూ ..
ఆకలి తీరని విరవిరలూ ...
అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా

జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

చరణం 2 :

గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడనని గంగలలో .. అలలై పొంగిన అందాలు

కౌగిట కాముని పున్నములు ..
వెన్నెల వీణల సరిగమలు ..
పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా

రోజా.. రాజా... రోజా.. రాజా
రోజా.. రాజా... రోజా.. రాజా

https://www.youtube.com/watch?v=tJBtu5SBq7A
Jaabilitho Cheppanaa Video Song | Vetagadu Telugu Movie Songs | NTR | Sridevi | Mango Music
www.youtube.com

Jaabilitho Cheppanaa Video Song from Vetagadu Telugu Movie on Mango Music, featuring NTR / NT Rama R...

1 comment: