Friday 11 March 2016

01.బుద్ధిమంతుడు (1969), 02.కంచుకోట (1961) ,03.ప్రేమనగర్ (1971) ,04.కృష్ణావతారం (1982) ,05.అప్పు చేసి పప్పు కూడు,06.మాతృదేవోభవ (1993) 07.తిరుపతమ్మ కథ, 08.భార్యాభర్తలు (1961),09.అంతులేని కథ (1976),10.రౌడీ గారి పెళ్ళాం , 11.రుద్రవీణ (1988)

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- సంగీత ప్రభ 

modern macaroni masterpiece | handmakery.com:
సర్వేజనా సుఖినోభవంతు


గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది...గుడిలోన జేగంట మ్రోగింది..

చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ.. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది

ఓ..గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
ఓ.. గుండెలో తొలివలపు పండింది

చరణం 1:

నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది
తనువు సెలరేఖలై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 2:

కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే...
గోరింక తానింక గూడు కట్టకపోతే
కొమ్మా యెంతో చిన్న బోతుంది...
కొమ్మా యెంతో చిన్న బోతుంది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 3:

సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
మనసైన జవరాలే వలచింది...
మనసైన జవరాలే వలచింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
ఊ...ఊ

https://www.youtube.com/watch?v=9IlZzEmVxN8
Buddhimanthudu Movie Songs - Guttameeda Guvva Kusindi Song - ANR - Shoban Babu - Vijaya Nirmala
Buddhimanthudu Movie Songs, Buddhimanthudu Songs, Buddhimanthudu Film Songs, ANR's Buddhimanthudu So...

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు...సెరువంత చీకటిని సుక్కంత వెలుగు

చిత్రం: కృష్ణావతారం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు
సెరువంత చీకటిని సుక్కంత వెలుగు
సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల
సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల...

చరణం 1:

పువ్వులో పువ్వుంది బంగారు తల్లి
పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి
మనసున్న మడిసొకడు ఈడనున్నాడు
ఈడు రాకుండాను తోడుండగలడు

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు

చరణం 2:

ఓ కంట కన్నీరు ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు కురిసేను నేడు
కన్నతల్లి మనసు మురిపాలవెల్లి
కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...
ఒంటిపైన లేని మనసంతవోయి
ఒడిలోని పాపాయి వటపత్ర శాయి

చరణం 3:

హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి
హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు మొలకపాపాయి

అత్తరూ లేదురా పన్నీరు లేదు
ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు
సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ
నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు
కన్నతల్లికి కంటి పాపవే గాని
కడవాళ్లకే కంటి నలుసు వయ్యావు
నేలపై పారాడు బాల కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా
నేలాపై పారాడు బాలా కిట్టమ్మా
నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా

https://www.youtube.com/watch?v=v8WcQ3EXlVw
Krishnavataram | Sinnari Navvu song
Watch the melodious song,"Sinnari Navvu" sung by SP Balasubramaniam and SP Shailaja from the movie K...
 
అప్పు చేసి పప్పు కూడు

అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
.
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
.
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
.
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా
.
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా




వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి...

చిత్రం : మాతృదేవోభవ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర

పల్లవి:

వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి

మాతృదేవోభవ.. మాతృదేవోభవ
పితృదేవోభవ.. పితృదేవోభవ
ఆచార్యదేవోభవ.. ఆచార్యదేవోభవ

చరణం 1:

ఏడుకొండలకైనా బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడుకొండలకైనా బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే

ఈ కంటిలో నలక లోవెలుగునే గనక
నేను మేననుకుంటే ఎద చీకటే.....
హరీ..... హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ... రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి.. ఈ.. ఈ.. గాలినైపోతాను గగనానికి

చరణం 2:

నీరు కన్నీరాయే.. ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో..
నీరు కన్నీరాయే.. ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో..

ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు...
హరీ..... హరీ..... హరీ.....
రెప్పనై ఉన్నాను మీ కంటికి.. పాపనై వస్తాను మీ ఇంటికి...

వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోయాను గగనానికి..
గాలినైపోయాను..... గగనానికి.....

http://m3.linksden.xyz/telugu/Maathrudevobhava%20%281993%29/Venuvai%20Vachanu.mp3
పూవై విరిసిన పున్నమి వేళ..బిడియము నీకేలా..బేలా..
చిత్రం: తిరుపతమ్మ కథ
సంగీతం: పామర్తి & బి శంకర్
రచన: సి నా రె
గానం: ఘంటసాల, సుశీల

పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకేలా..బేలా..

చల్లని గాలులు సందడి చేసే..
తోలి తోలి వలపులు తొందర చేసే..
జలతారంచుల మేలిముసుగులో
తలను వాల్తువేలా..బేలా..

మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఆ..ఆ..ఆ..
తెలిసెనులే నీ తలపులేమిటో...
తొలగిపోదువేలా...బేలా

తీయని వలపుల పాయసమాని..
మాయని మమతల ఊయలలూగి..
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా


ఏమని పాడెదనో ఈ వేళా...మానస వీణ మౌనముగా నిదురించిన వేళా...
చిత్రం : భార్యాభర్తలు (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల

పల్లవి:
ఏమని పాడెదనో ఈ వేళా...
ఏమని పాడెదనో ఈ వేళా...
మానస వీణ మౌనముగా నిదురించిన వేళా...
ఏమని పాడెదనో...

చరణం 1:
జగమే మరచి హృదయ విపంచి...
జగమే మరచి హృదయ విపంచి...
గారడిగా వినువీధి చరించీ...
గారడిగా వినువీధి చరించీ...
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా...

ఏమని పాడెదనో...
చరణం 2:
వనసీమలలో హాయిగా ఆడే...
వనసీమలలో హాయిగా ఆడే...
రాచిలుక నిను రాణిని చేసే...
రాచిలుక నిను రాణిని చేసే...
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచే వేళా...

ఏమని పాడెదనో ఈ వేళా...
ఏమని పాడెదనో ఈ వేళా...
మానస వీణ మౌనముగా నిదురించిన వేళా...
ఏమని పాడెదనో... ఓ.. ఓ..

Akkineni Nageshwara Rao and Krishna Kumari's Bharya Bhartalu Movie - Emanipadedano Eevela…

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...ఇక ఊరేల సొంత ఇల్లేల...ఓ చెల్లెలా...
చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఏసుదాసు

పల్లవి:
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

చరణం 1:
నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

చరణం 2:
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

చరణం 3:
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం


కుంతి కుమారీ తననోరు జారి...రాసింది ఒక భారతం...
చిత్రం : రౌడీ గారి పెళ్ళాం
సంగీతం : బప్పిలహరి
గానం : ఏసుదాస్

పల్లవి :
కుంతి కుమారీ తననోరు జారి...
రాసింది ఒక భారతం...
కన్యాకుమారి తనకాలు జారి...
చేసింది న జీవితం...
క్షణ కాల పాపం కను మాయచేసి తన పేగు తెంచింది రా
లోకాలు పుట్టే ఆ మురికి తొట్టె నను కన్నా కడుపాయేరా

చరణం :
నీలాలు కారే నకల్లనిండా నీరెండేమిగిలిందిరా
పాలార బోసే పసిగుండేలోనా పగనిండి పోయిందిరా
లోకాలులు తిరిగి ఏకాలాగా శోకాన్ని దాచానురా
గతమంత మరిచే గరళాన్ని తాగి బ్రతుకిడ్చుచున్ననురా

చరణం :
నడి వీధిరాల్లె గుడిలోనబెట్టి దేవుణ్ణి చేసారురా
నను కన్నా వాళ్ళే నడివిధినేసి నగుబాటు చేసారురా
ఎ దేవుడైనా నాలాగ పుడితే ఈ బాధ తెలిసేది రా
దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా


నీతోనే ఆగేనా సంగీతం బిళహరి...నీతోనే ఆగేనా సంగీతం...బిళహరీ అని పిలువకుంటే...
చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఏసుదాస్

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం
బిళహరీ అని పిలువకుంటే
స్వరవిలాసం మార్చుకుంటే
ఆరిపోదు గానజ్యోతినీతోనే ఆగేనా సంగీతం

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
యుగయుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

నీతోనే ఆగేనా సంగీతం
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది
ఏ జ్ఞానం ఆ నాదం
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో
ఎడారిపాలు కాదా గానవాహిని
వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా

నీతోనే ఆగేనా సంగీతం
మగపద నీ..తోనే
సరీగ రిగాప గపాద నీ...తోనే
సరిగ రిగప మగపద మగ రిగప
గపద మగపదదరి నీ...తోనే
పాదమ గపద రిస రీగరి సనిదప ద
దాసరిగ పాగసరి గాపదస రీగసరి సరిగపదరి నీతోనే
సరిగ పమగ రిగపమగరి సాస సాస రీరి రీరి
సని ద సని ద పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద రిగరి సనిదప
మగపద గసనిదప దని సనిద
సరిగపద రిగపద దరి
నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే
స్వర విలాసం మార్చుకుంటే
ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం

Watch Bilahari Neethone Song From Rudraveena Movie. Starring Chiranjeevi, Gemini Ganesan,…

1 comment: