Wednesday 9 March 2016

01.అంకురం, 02.నువ్వు నేను ప్రేమ...,03.జెంటిల్ మాన్ (1993),04.నువ్వు-నేను,05. కాళహస్తి మహాత్మ్యం (1954) ,06.జోడి (1999) ,07.నరసింహ 08. ఐ (మనోహరుడు) 09. వీరాభిమన్యు (1965) ,10. శ్రీ కృష్ణావతారం (1967), 11.కళ్యాణ మండపం

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

hands - holding
సర్వేజనా సుఖినోభవంతు

చిత్రం అంకురం
ఎవరో ఒకరు
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేలదారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలిచూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

International women's day -2011special ,Ankuram Movie-Hello all indian girls,womens ladies be…
ప్రేమించే ప్రేమవ...ఊరించె ఊహవ...ప్రేమించే ప్రేమవ...పూవల్లె పుష్పించే...
చిత్రం : నువ్వు నేను ప్రేమ...
సంగీతం::AR.రెహమాన్
రచన::వెన్నెలకంటి,వేటూరి
గానం::శ్రేయాఘోషల్,నరేష్ అయ్యర్

ప్రేమించే ప్రేమవ...
ఊరించె ఊహవ...
ప్రేమించే ప్రేమవ...
పూవల్లె పుష్పించీఎ...
నే..నేనా అడిగా నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదే...
ప్రేమించే ప్రేమవ

రంగో రంగోలి అని గొరింకె గుప్పెటే
రంగే పెట్టిన మెఘం విరిసి గాజుల సవ్వది ఘల్ ఘల్...
రంగో రంగొలీని గొరింకే గుప్పెటే,
రంగే పెట్టిన మేఘం విరిసి సుందరి
వన్నెలు చల్లగ మద్యాన చల్లని పున్నమి వెన్నెలై విరిసే...
ప్రేమించే ప్రేమవ

ఆ..ఆ...ఆ...ఊఊఊ......
పువై నా పూస్తున్నా నీ
పరువంగనె పుడుతా..
మదుమాసపు మాలల
మంటలు రగిలించెఉసురె..
నీవే న మది లొ వాడ,
నెనె నీ మొటమై రాగ...
నా నాడులొ నీ రక్తం,
నడక లొ నీ షబ్ధం ఉందె హొ...
తోడే దొరకని నాడు,
విల విల లాడె ఒంటరినై నెన్ హ్మ్మ్...
ప్రేమించే ప్రేమవ
నే నేనా అడిగా నన్ను నేనే...
ప్రెమించే నా ప్రేమవ... ఊరించే ఊహవ...

వెలవెల వాడుక నడిగి
నెలవంకల గుడి కడదామ..
న పొదరింటికి వెరె అథిదులు రా తరమా...
తుమ్మెద చేరిన వెలె...
నీ మదిలొ చోటిస్తావా...
నెన్ ఒదిగె యెదపై ఎవరో
నిదురించ ర తరమా...
నీరే సంద్రం చెరే,
గలగల పారే మది తెలుసా...
ప్రేమించే ప్రేమవ

నే..నేనా అడిగ నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదె...
ప్రెమించే ప్రేమవ...
ఊరించే ఊహవా...
ప్రెమించే నా ప్రేమవ,
పూవల్లె పూవల్లె...

Watch & Enjoy Nuvvu Nenu Prema Movie Video Songs (720p) Starring Suriya, Jyothika, Bhoomika,…
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం...ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం చిత్రం : నువ్వు-నేను
సంగీతం : RP.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : K.K,ఉష

పల్లవి :
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని
మనకున్న బలమే ప్రేమ ప్రేమా

చరణం 1
నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమలేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచభూతాలు

చరణం 2
నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు



మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

చిత్రం: కాళహస్తి మహాత్మ్యం (1954)
రచన: తోలేటి వెంకట రెడ్డి
సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే....ఏ......ఏ.....
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

ఆగమ సంచారా
ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా..
భావజ సంహారా...
భావజ సంహారా.....
భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా

పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో..
భారము నీదయ్యా
పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
జయహే సర్వేశా!
జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ..
కారుణ్య గుణసాగరా!..
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

https://www.youtube.com/watch?v=Jon0s51aCKI
Madhuramu Shiva Mantram || Rajkumar Hit Songs - Telugu Devotional Songs
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...



చుట్టూ చుట్టి వచ్చావా...చూపుడు వేనితో పేల్చావా...

చిత్రం : నరసింహ
సంగీతం : AR.రెహ్మాన్
సాహిత్యం : AM.రత్నం,శివ గణేష్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం, హరిణి

చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేనితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్ళతొ ఏదొ చూసావా
కాయ పండా అడిగావా
నాలోని ప్రాయం వేగిపోగ

చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతొ నన్ను కాల్చావా
ముద్దాడె ఆశ ముదిరిపోగ
ఎందరొ పడుచులు వచ్చారు నన్ను తొందరపెట్టగ చూసారు
నీవె నను కొంగును కట్టావు

సుందరి సొగసూ ఉక్కిరి బిక్కిరి కాగ
సుందర వదనా తీయని వేదన సాగ
ఇది పాన్పు గుర్తుతొ ప్రేమ ఎన్నికలు గెలిచి నువ్వు వర్దిల్లు

నా చెవిని కొరుకు చెవిని కొరుకు
పంటికి గాయపరుచు గాయపరుచు గాజుకి
ఎదను తాకు ఎదను తాకు
కాలికి ముద్దులివ్వనా
నా సొగసు తాకు తాకు పెదవికి
మనసు లాగు మనసు లాగు పంటికి
ముక్క గిల్లు ముక్క గిల్లు
గోటికి ముద్దులివ్వనా
అరె తుమ్ము వచ్చిన చీమ కుట్టిన
విడిపోవద్దూ
తమ తపన తీరగ ముసుగు కప్పుకొని పడుకోవద్దూ
నా కనులు సోలిన
చేతులు ఊరుకోవుగా
మన పెళ్లికి ముందుగ ఉయ్యాలలు ఊపించకు

చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతొ నన్ను కాల్చావా
ముద్దాడె ఆశ ముదిరిపోగ
ఎందరొ పడుచులు వచ్చారు నన్ను తొందరపెట్టగ చూసారు
నీవె నను కొంగునా కట్టావు

సుందరి సొగసూ ఉక్కిరి బిక్కిరి కాగ
పురుషుడు చేసే అల్లరి వల్లరి కాగ
ఇది పాన్పు గుర్తుతొ ప్రేమ ఎన్నికలు గెలిచి నువ్వు వర్దిల్లూ

నే పాల వోలి పాల వోలి పొంగగ
పెరుగు వోలి పెరుగు వోలి మారగ
తాడు మీద తాడు వేసి అయ్యొ చిలికేవా
నే మత్తు మత్తు మత్తు సోలగ
మత్తు వదిలి మత్తు వదిలి లేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యొ ఉలికేవా
మండుటెండలొ వయసు పూతల కరివేపకు
చలివేంద్రమ దాహమన్నచొ తోసేయకు
హద్దు దాటేయకు నన్ను కాటేయకు
నా అధరాన్ని నీకధరాన్నికడ్డేయించకు

చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతొ నన్ను కాల్చావా
ముద్దాడె ఆశ ముదిరిపోగ
ఎందరొ పడుచులు వచ్చారు నన్ను తొందరపెట్టగ చూసారు
నీవె నను కొంగునా కట్టావు

https://www.youtube.com/watch?v=DImtTkAk9hw
Narasimha Songs - Rajni - Soundarya - Chuttu Chutti Vachava
Narasimha, Narasimha Songs Juke Box Movie : Narasimha Rajinikanth - Soundarya and Ramyakrishna's Nar...

నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ...

చిత్రం : ఐ (మనోహరుడు)
సంగీతం : AR.రెహమాన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సిద్ శ్రీరామ్,ఇష్రాత్ ఖాద్రే

వీచే చిరుగాలిని వెలివేస్తా
హో పారే నదిలా విరిచేస్తా
నేనున్న నేలనంతా మాయం చేస్తా
లేదే లేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా ...
నువ్వుంటే నా జతగా

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
నువ్వుంటే నా జతగా
...
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
పువ్వుల్లోని తేనె పురుగులకందునా
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా
బూచినే చూసిన పాపనై బెదిరా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊనువ్వుంటే నా జతగా...

https://www.youtube.com/watch?v=LrNRCsmb87Q
I - Manoharudu - Nuvvunte Naa Jathagaa Video | Vikram, Amy Jackson | A.R. Rahman
'Nuvvunte Naa Jathagaa' from 'I - Manoharudu' is a painful love ballad sung by Sid Sriram & Isshrath...

చూచి.. వలచి.. చెంతకు పిలచి..నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి...

చిత్రం : వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

చూచి.. వలచి.. చెంతకు పిలచి..
నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి

చూచి.. వలచి.. చెంతకు పిలచి..
సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి

చూచీ.. వలచీ.. చెంతకు చేరీ
నా సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

చరణం 1 :

అందాలన్నీ దోచీ.. ఆనందపుటంచులు చూచి
అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి
సందిట బంది చేసీ... సందిట బంది చేసీ
నా బందీ వశమైపోతి..
చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

చరణం 2 :

నూతన వధువై నిలచీ.. వరుణి వలపుల మధువై మారి
నూతన వధువై నిలచీ.. వరుణి వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ.. సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరమునైతీ

చూచి.. వలచి.. చెంతకు పిలచి..
నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి
చరణం 3 :

వలపుల తేనెల మధురిమ గ్రోలితి.. నిదురా జగమూ మరచీ...
వలపుల తేనెల మధురిమ గ్రోలితి.. నిదురా జగమూ మరచీ
నీవే జగమై... నీలో సగమై.. నేటికి నిండుగ పండితి

చూచి.. వలచి.. చెంతకు పిలచి..
నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

https://www.youtube.com/watch?v=VHFc7e2LI_k
Veerabhimanyu Songs - Chuchi Valachi - Kanchana - Sobhan Babu
NTR Sobhan Babu Kanchana's Veerabhimanyu Telugu Old Movie Song Music : K V Mahadevan Lyrics : Aarudr...

నీ చరణ కమలాల నీడయే చాలు...ఎందుకోయీ స్వామి బృందావనాలు

చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టివి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, పి.లీల

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు

నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు

నును మోవి చివురుపై
నను మురళిగా మలచి పలికించరా..ఆఆ..
పలికించరా మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే
మధురానురాగాలు చిలికింతునే

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీ దళాలలో తొలివలపులందించి
తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా...ఆఆ..ఆఆఅ...
పూజింతునా స్వామి పులకింతునా
పూజలను గ్రహియించి పులకింతలందించి
పూజలను గ్రహియించి పులకింతలందించి
లోలోన రవళింతునే
లోలోన రవళింతునే
ఓ దేవి నీలోన నివసింతునే
ఓ దేవి నీలోన నివసింతునే

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందనవనాలు
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు

https://www.youtube.com/watch?v=5BX3dblHfrg
enduko swamy brudavanalu in ntr krishnavataram
sri krishnavatharam

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే...వలచే మనసుకు బదులుగ బదులుగ

చిత్రం : కళ్యాణ మండపం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమ విధాత జీవననేత ప్రేమ విధాత
అను గుడిగంట విను ప్రతిజంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
జీవనగంగా వాహిని కాదా , జీవనగంగా వాహిని కాదా
అను ప్రతిజంట – విను గుడిగంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

https://www.youtube.com/watch?v=J_a7wUd8sFM
Kalyana Mandapam Movie Songs || Sarigama Padanisa || Shoban Babu || Kanchana
Sobhan Babu - Kanchana - Anjali Devi`s Kalyana Mandapam Telugu Movie - Sarigama Padanisa Palike Varu...

1 comment: