Thursday 17 March 2016

01.అశోక చక్రవర్తి (1993),02.బావ బావ పన్నీరు ,03.శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ,04.మాధవయ్య గారి మనవడు 05. అభిమానం ,06. తెనాలి రామకృష్ణ (1956),07. శ్రీవారికి ప్రేమలేఖ , 08.అష్టా -చెమ్మ09. జయదేవ అష్టపది,10. మహామంత్రి తిమ్మరుసు (1962),11.శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)




ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

                                    
సర్వేజనా సుఖినోభవంతు


www.dailymotion.com

Watch Madhavayya Gaari Manavadu Songs/ Madhavaiah Gari Manavadu Movie Songs/ Madhavayya Gari Manawad.

ఓహో బస్తి దొరసాని ' పాటకి మాతృక హిందీ అయినా అందులో 'హాయ్' ఉంది. అభిమానం
ఇప్పుడే గుర్తు వచ్చిన ఒక హిందీ కాపీ పాట. రెండు బాషలలోను నాకు ఇష్టం.
పల్లవి:
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 1
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతికూడ ముడిచింది
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతికూడ ముడిచింది
హాయ్.. ఆపై కోపం వచ్చింది
వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 2
కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది
మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది
కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది
మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది
హాయ్... ఆమెకు సరదా వేసింది
జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 3
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్... చివరకు చిలిపిగ నవ్వింది
చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ
https://www.youtube.com/watch?v=gkbFfqs5IhE&feature=youtu.be
Abhimanam Songs - Oho Basthi Dorasani - Akkineni Nageswara Rao, Savitri, Krishna Kumari
Abhimanam Songs - Oho Basthi Dorasani Watch more movies @ http://www.youtube.com/volgavideo http://w...



చందన చర్చిత నీలకళేబర....
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి
గీతరచయిత: జయదేవుడు
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
హరి విహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరి విహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చరణం 1:
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధుసూదన వదనసరోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధుసూదన వదనసరోజం
హరి విహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చరణం 2:
ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామా.. ఆ ఆ ఆ...
హరి విహ ముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి


                                                                             


సరిగమపదని స్వరధారా...రస సాగర యాత్రకు ధ్రువతారా...

చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలు

తననం తననం తననం

గమప మపని దానిసా....
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా

పల్లవి:

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
వీణవై ...వేణువై ...మువ్వవై ...వర్ణమై
వీణవై జాణవై వేణువై వెలధివై
మువ్వవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 1:

అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
మందారంలో మల్లికలా..... ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై..... శ్రుగారంలో నీ లయలై
అలుముకున్న భూతావిలా... అలవికాని పులకింతలా
హిందోళ రాగా గంధాలు నీకు ఆందోళికా సేవగా

ఆ.............

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 2:

హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
శాద్వరానా హిమదీపికలా ....శరద్వేలా అభిసారికలా
చరణాలన్నీ లాస్యాలై.....నీ చరణానికి దాస్యాలై
అష్ఠపదుల ఆలాపనే....సప్తపదుల సల్లాపమై
పురి విప్పుకున్న పరువాల పైట సుదతి నే వీవగా.....ఆ...

ఆ.......

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

https://www.youtube.com/watch?v=_9vux62woc4
Srivariki Premalekha Movie Songs - Sarigama Padani - Naresh,Poornima
www.youtube.com

For latest updates on ETV Network http://www.etv.co.in/ Subscribe for more latest Episodes - http://...

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ...నీ పంట పండిందె ప్రేమ
చిత్రం : అష్టా -చెమ్మ
సంగీతం : కళ్యాణ్ మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీకృష్ణ

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ
నీ పంట పండిందె ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ
నీ పంట పండిందె ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఊరంత ముంచేస్తు హంగామ చెస్తావేంటె గంగమ్మా
ఘొరంగ నిందిస్తు ఈ పంతాలెందుకు చాల్లె మంగమ్మా
చూసాక నిన్ను వేశాక కన్ను ఎనక్కెలాగ తీసుకోను
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్న నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలొ మెలేసే గల్ల బాటలొ
నీ దాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

నా నేరం ఏముందె ఏం చెప్పిందొ నీ తల్లొ జేజమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్లొ జాజమ్మా
పువ్వంటి రూపం నాజూగ్గ గిల్లి కెవ్వంది గుండె నిన్నదాక
ముళ్ళంటి కోపం ఒళ్లంత అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తె తప్పేం లేదమ్మా మరీ ఈ మారాం మానమ్మా
ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మ


భక్తి రంజని8 - జయదేవ అష్టపది




తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ...
చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఎస్. వరలక్ష్మి, సుశీల

పల్లవి:
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ

చరణం 1:
నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా
నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా...
మంజుల వలపుల... మలయానిలముల...
మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా...

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
చరణం 2:
ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస
గరిగపమగరిస...
మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ
మపద మ గ రి పమరి నినిప ససని నినిస
మగరిగ నిసరి నదమపనిస
నిసరి నిదమపదప
దపదమగరిగనిస...

ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
అభినయ నటనలే ఆరాధనగా...
అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా....

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ..
ఆ...ఆ..ఆ...ఆ...ఆ...
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ


ఏమని పిలువనురా...నిను నే ఏ విధి కొలువనురా...
చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా

అండ పిండ బ్రహ్మాండమంతటా నిండియున్న ఓ స్వామీ
నిను నే ఎక్కడ వెదుకుదురా ఏ విధి కొలువనురా

అంగ రంగ సర్వాంగమంతటా నిండియున్న ఓ స్వామీ
ఎక్కడ వెదుకుదురా.. ఏమని పిలువనురా

చరణం 1 :
రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూసేరు
రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూశాను

పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని తెలియగజాలేరు
పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని కనుగొన గలిగాను

గల గల పారే సెలయేరులలో..
గల గల పారే సెలయేరుల నీ గానమునే వినగలిగాను

కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో.. కొలువై యున్నావట స్వామీ
ఏ గతి చూతునురా.. ఏమని పిలువనురా

చరణం 2 :
అంతే లేని ఆకసమే నీ ఆలయమని పూజించేరు
అందాలొలికే అరవిందాలే నీ చిరునవ్వని ఎంచాను

నీవే లేనీ తావేలేదని నిమిష నిమిషము తలచేరు
నాలో నిన్నే చూసిన నేను ఎక్కడ వెదుకుదురా స్వామీ

ఏ విధి కొలువనురా.. ఏమని పిలువనురా

Listen to the romantic melody of SP Balasubramaniam and P Susheela ," Yemani Piluvanuraa " from the super hit film Sri Rajeswari…

2 comments: