Monday, 25 December 2017

నేటి కవిత -85

ప్రాంజలి ప్రభ
Ramakrishna మల్లాప్రగడ
 అలా చూడమాకు
ఉక్కిరిబిక్కిరి చేయమాకు
ముసుగుతో కవ్వించకు
అసలే శీతాకాలం ఉడికించకు

మాయాజాలంతో మురిపించకు
నిద్దురకు అడ్డు పడుటెందుకు
గిలిగింతలు పెట్టి నవ్వించకు
చెక్కిలతో తుల్లి పడకు

కౌగిలికోసం ఆరాట పడకు
 మనసును మభ్యపెట్టకు
మతిలేక ప్రవర్తించకు
మక్కువకోసం నటించకు

మత్తుకళ్ళతో చూడమాకు
మగశిరిని రెచ్చగొట్ట మాకు
మగువా మాయ చేయకు
మతి పోగొట్టుట యెందుకు

కలియుటకు రావాలి ముందుకు
అదే దారీ ఇద్దరమూ ఏకమగుటకు

No comments:

Post a Comment