Thursday 21 December 2017

నేటి సినిమాపాట -180


ప్రాంజలి ప్రభ-ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:

సేకరణ/ మల్లాప్రగడ రామకృష్ణ - నేటి సినిమాపాట 

నా మనసుకు నచ్చిన పాట మీకు నచ్చుతుందని పొందుపరుస్తున్నాను  

ఒక బృందావనం ..... సోయగం


ఒక బృందావనం ..... సోయగం
ఎద కోలాహలం ..... క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం ..... సోయగం
నే సందెవేళ జాబిలీ
నా గీతమాల ఆమనీ
నా పలుకు తేనె కవితలే
నా కులుకు చిలకపలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధమోహనం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం ..... సోయగం
నే మనసు పడిన వెంటనే
ఓ ఇంద్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజిపూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా

ఒక బృందావనం ..... సోయగం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం ..... సోయగం

సినిమా : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
గానం : వాణీ జయరాం


No comments:

Post a Comment