Tuesday 12 December 2017

173 రగిలే మంటలు

ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం 

పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా

ఒడిలో పెరిగిన చిన్నారినే, ఎరగా చేసినదాద్వేషము
కధ మారదా, ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే, కసిగా శిశువును కుమ్మితే

అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా

విరిసీ విరియని పూదోటలో, రగిలే మంటలు చల్లారావా
ఆర్పేదెలా, ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

No comments:

Post a Comment