Monday 25 December 2017

184



 కవిత్వం రాయడం గొప్పవిషయమేమి కాదని కొందరి అభిప్రాయం అది ఎంత కష్టమో?
శ్రీకంఠచరితంలో మంఖకుని ఈ శ్లోకం చెబుతుంది-

అర్థోస్తి చే న్న పదశుద్ధి రథాప్తి సాపి
నో రీతి రస్తు, యది సా ఘటనా కుతస్త్యా
సాప్యస్తి చే దపి స వక్రగతి స్తదేతత్
వ్యర్థం, వినా రస మహోగహనం కవిత్వమ్

కవిత్వం చాల గహనమైంది, ఎందుకంటే, దానిలో అర్థం బాగా ఉంటే పదాల శుద్ధి ఉండదు. ఒక వేళ పదశుద్ధి ఉన్నా
రీతి సరిగా ఉండదు.అది కుదిరితే పదసంఘటన సరిగా ఉండదు. అది కుదిరినా వక్రగతితో ఉంటుంది.
ఇవి అన్ని అమరినా దానిలో రసస్ఫూర్తి సరిగా లేకపోతే అది వ్యర్థం. అందువల్ల పదశుద్ధి, రీతి్, పదసంఘటన(శయ్య)
కలిగి రసప్రతిపాదితమైనది ఉత్తమ కవిత్వం.అటువంటి కవిత వ్రాయటం చాల గహనమైన విషయం-
అని ఈ శ్లోకభావం.

నైర్గుణ్య మేవ సాధియో
ధిగస్తు గుణ గౌరవమ్
శ్లాఘినోన్యే విరాజన్నతే
ఖండ్య న్తే చన్దన ద్రుమాః

అడవిలో చెట్లుంటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు అదే గంధపు చెట్టు దొరికిందా - నరికి పట్టుకుపోతారు.
దాని సుగంధమే దాని ఉనికికి చేటు తెచ్చినట్లు ఇంకెందుకూ మంచి గుణాలు - అవి ఉండి ఏం లాభం-
అని శ్లోక భావం.
ఈ శ్లోకం చూడండి
కేవలం పేర్లనే శ్లోకం మలచి చివర్లో
మాత్రమే తన విన్నపాన్ని తెలిపాడు

హేగోపాలక! హేకృపాజలనిధే! హేసిన్ధుకన్యాపతే!
హేకంసాంతక! హేగజేన్ద్రకరుణాపారీణ! హేమాధవ!
హేరామానుజ! హేజగత్త్రయగురో! హేపుండరీకాక్ష! మాం
హేగోపీజననాథ! పాలయ పరం జానామి న త్వాం వినా


Pranjali prabha
కరుణశ్రీగారి కలం నుండి జాలువారిన
పెండ్లి పద్యం చూడండి ఎలావుందో-

బృందారకానంద మందార మకరంద
        బిందునిష్యందాల విందు పెండ్లి;
రంగారు ముంగారు బంగారు సరసాంత
        రంగాల సత్యనర్తనము పెండ్లి;
సోగకన్నులరాణి రాగరంజితపాణి
        రాణించు మాణిక్యవీణ పెండ్లి;
చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
        నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి;
ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి;
అక్షయంబైన శ్రీరామరక్ష పెండ్లి;
వధువు వరుడు "ద్వంద్వ"మై మధువు గ్రోలు
ప్రేమ బృందావనారామసీమ పెండ్లి!!

No comments:

Post a Comment