Friday 23 September 2016

1. మేజర్ చంద్రకాంత్, 2.కోరుకున్న మొగుడు (1982) ,3. తోట రాముడు, 4.అన్నయ్య, 5. జల్సా (2008)

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

స్సర్వేజనా సుఖినోభవంతు



1. మేజర్ చంద్రకాంత్

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2)
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ..
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2)
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు...
నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా..
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా..
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,,
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు..

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా...
బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..
అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం..

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి..
అఖండ భరత జాతి కన్న మరో శివాజి..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని మన స్వర్గమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2)
గాంధీజి కలలు కన్న స్వరాజ్యం..
సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే
ద్రువతారలు కన్నది ఈ దేశం,,
చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ



2. చిలకమ్మ గోరింక సరసాలాడితే...నవ్వే యవ్వనం నాలో ఈ దినం
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 1:
పువ్వులలో పులకింతలలో చలిజింతలలో చెలరేగి
కౌగిలిలో కవ్వింతలలో చెలి చెంతలలో కొనసాగే

ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
తొలకరి వలపుల వేళలలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 2:
కోరికలో దరి చేరికలో అభిసారికనై జతకూడి
అల్లికలో మరుమల్లికలా విరిపల్లకినై కదలాడి

ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ఎగసిన సొగసుల ఘుమఘుమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చరణం 3:
అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై పెనవేసి
మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే

ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
కలిసిన మనసుల సరిగమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

Watch Chilakamma Gorinka Video Song from Korukunna Mogudu Starring Shoban Babu,…
 3. తోట రాముడు
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

O Bangaru Rangula Chilaka Song From Thota Ramudu Movie. Starring Chalam, Manjula and…

4. వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

చిత్రం : అన్నయ్య
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : సుజాత,హరిహరన్

పల్లవి
వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే

చరణం 1
ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా రారా

చరణం 2
వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
తూరు రురు తూరు రురు తూరు రురు

Watch the song 'Vaana vallappa vallappa...' featuring Chiranjeevi and Soundarya from the movie 'Annayya'. Hariharan and Sujatha have sung the song to…

5. గాల్లో తేలినట్టుందే..గుండె పేలినట్టుందే..తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: భాస్కరభట్ల
నేపధ్య గానం: టిప్పు, గోపిక పూర్ణిమ
పల్లవి:
గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకీ
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకీ
చరణం 1:
హే .. నిదుర దాటి కలలే పొంగె .. పెదవి దాటి పిలుపే పొంగె ..
అదుపుదాటి మనసే పొంగే నాలో...
గడపదాటి వలపే పొంగె .. చెంపదాటి ఎరుపే పొంగె ..
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో...
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకీ
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకీ
గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
చరణం 2:
తలపుదాటి తనువే పొంగె .. సిగ్గుదాటి చనువే పొంగె ..
గట్టుదాటి వయసే పొంగె నాలో...
కనులుదాటి చూపే పొంగె .. అడుగు దాటి పరుగే పొంగె ..
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో...
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికీ
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికీ

1 comment: