Monday 26 September 2016

1.చీకటి వెలుగులు (1975), 2.నిర్మలా కాన్వెంట్, 3. రావోయ్ చందమామ, 4. దేవుడు చేసిన మనుషులు, 5. నాగమల్లి (1980)

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు


1. మీటి చూడు నీ హృదయాన్ని .. పలుకుతుంది ఒక రాగం
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి :
మీటి చూడు నీ హృదయాన్ని.. పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో...
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరిపోవును

చరణం 1:
పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
నీలో... ఊపిరాడక ఉన్నదీ ...
హృదయమే అర్పించుకున్నదీ ...హృదయమే అర్పించుకున్నదీ ...

ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

చరణం 2:
పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
నీలో ..లీనమైనది... కానరానిదీ..
నీ పదము తానై మూగపోయినదీ ...మూగపోయినదీ ...

ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

చరణం 3:
మనసు మూలలు వెతికి చూడూ ...మరుగు పొరలను తీసి చూడూ
ఏదో ...మబ్బుమూసి ..మసక కమ్మి
మమత మాయక ఉన్నది ...నీ మనిషి తాననుకున్నదీ ...

మీటి చూడు నీ హృదయాన్ని..పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని ...మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

Watch Cheekati Velugulu Telugu Movie Video Songs. Cheekati Velugulu Telugu Movie Video Songs On…

3. రావోయ్ చందమామ
స్వప్న వేణువేదో
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

LikeShow more reactions


4. దేవుడు చేసిన మనుషులు
విన్నారా అలనాటి వేణుగానం
మ్రోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు
తలపించును కృశ్ణుని కథలు (విన్నారా)
పుట్టింది ఎంతో గొప్ప వంశం
పెరిగింది ఏదో మరో లోకం (పుట్టింది)
అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు (౨)
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు
దొంగైనా దొర అయినా మనసే హరించేనులే (విన్నారా)
ద్వేశించే కూటమి లోనా నిలిచీ
ప్రేమించే మనిశే కదా మనిశి (ద్వేశించే)
ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు (౨)
అందరికీ ఆనందాన బృందావని నిలిచాడు
ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే (విన్నారా)



5. మల్లీ మల్లీ... నా నాగ మల్లీ...మదిలో మెదిలే అనురాగ వల్లీ..
చిత్రం : నాగమల్లి (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..

చరణం 1 :
ఆషాడ మాసాన...మిల మిలమన్నా
మెరుపే చూసి... నీవను కొన్నా..ఆ ఆ ఆ ఆ ఆ
కార్తీక దీపాన కాంతులలోనా... కళలే చూసి నీవనుకొన్నా
ఆరారు రుతువుల ఆలాపనగా... కనులే తెరచి నే కలలే కన్నా
మా మ్మ మా మ్మ మమ..మా మ్మ మా మ్మ మమ..రిరినిస్సాస్స
కాల మేఘములు..కామ దాహములు..కరిగినా మధుర గీతం
ససమమమమ రిరిదదదద మమమనీనినీ సాస్సా...
నిను నను కల్పిన నిముషము వలపున యుగయుగాల సంగీతం..

తనువు నీ వేణువే... మనసు నీ రాగమే..మల్లి నీ కోసమే
చరణం 2 :
మధుమాసంలో కుహు కుహుమన్నా
పిలుపే విని నీ కబురనుకొన్నా.. ఆ ఆ ఆ ఆ
వైషాఖమాసాన వేసవిలోనా
వడగాలులు నీ ఉసురనుకొన్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళినీ పద నివాళికై తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై... చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై... గిరులు నవ్వులై... ఝరులు నడకలై..
అరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలిరా శిల్పమై... ఆ ఆ ఆ ఆ
సంగీతమై నాట్యమై... ససస మమమ నినిని రిరిరి

కదలిరా శిల్పమై... సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా... నేను నీ మేనుగా
నీవే... నేనుగా.......

Provided to YouTube by Sa Re Ga Ma Malli Malli Naa Naagamalli · S Janaki · S P Balasubramaniam Nagamalli ℗ Saregama India Ltd Released on: 1980-01-12 Auto-ge...

1 comment: