Thursday 15 September 2016

01.మల్లెలతీరం, 02. నరసింహా (1999) 03.,చిన్నబ్బాయి, 04.సుఖదుఃఖాలు (1968),*05.సీతా రామాయ్య మనవరాలు

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు

మాటకందని పాటగా....మనమిద్దరమూ కలిశాముగా...
చిత్రం : మల్లెలతీరం
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
Starring Sri Divya, Kranthi, Goerge, Rao Ramesh, etc. Directed By Rama Raju Written By Rama Raju Screenplay By Rama Raju Produced By Uma Devi
youtube.com

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా...నాతోడు రావా నా ఆశ బాష వినవా
చిత్రం : నరసింహా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివగణేష్
గానం : శ్రీనివాస్, నిత్యశ్రీ , శ్రీరామ్

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడు రావా నా ఆశ బాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయన్నీవా
సఖియా సఖియా సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ

శృంగారవీర...శృంగారవీరా
రణధీర నా ఆజ్ఞ తోటి నావెంట రార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలనై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చెలికాచుకోరా మధనా మధనా మధనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా
శృంగార వీర ...

మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
నా పైట కొంగును మూయ నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నీతాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మొక్షం నీకెకదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా

చంద్రుని చెక్కి చెక్క చేసినట్టి శిల్ప మొకటి చూసా
తన చూపున అమౄతం కాదు విషమున చూసా
తను నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటేనే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్నీ తలందాల్చ పురుషులెవరూ పూలుకాదు
శృంగార వీర ...

Narasimha, Narasimha Songs Juke Box Movie :

Narasimha Rajinikanth - Soundarya and Ramyakrishna's Narasimha Telugu Movie All…
youtube.com

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే...జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే...
చిత్రం : చిన్నబ్బాయి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..యా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
హే జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు\

సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవంట వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె
గుండె మువ్వమీటి కట్టేసుకోవా
ఓ ధగధగ దందందం ధగధగ దందందం
వన్నె ఒంపులన్నీ ఒడికెత్తుకుంటే
కన్నెకెంపులన్నీ ముడిపెట్టుకోనా
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి..ఓ..ఓ...
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి
సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటే
మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ
మనసున చల్లగా మ్రోగే తొలి మంగళవాద్యాలమ్మ
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..

సిగ్గు పగ్గాలన్నీ తెంచేసుకుంటే
బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా
హా ధగధగ దందందం ధగధగ దందందం
వెన్ను మీద వాలి ఊయాలవైతే
వెన్నపూస లాంటి వయ్యారవీణ
చలి మంట వేసుకున్న చందమామ..ఓ..ఓ...
చలి మంట వేసుకున్న చందమామ
తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ
చుక్కల చెక్కిలి తాకే చిరు మబ్బువి నీవంట
అక్కున తానాలాడే పసి చినుకుని నేనంట
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
సందెపొద్దే ఓ మంచి మాట చెప్పిపోతే
సాగరాలే సందిత్లో పొంగి సాక్షులైతే
నడిపించు నన్ను ఏడడుగులు
నీతో నే నడిచివచ్చేను ఏడేడు జన్మలు
జాజిమల్లి జాజిమల్లి..హా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు

Venkatesh Ramya Krishna Ravali's Chinnabbayi Telugu Movie Song Music : Ilayaraja Lyrics : Sirivennela Sitarama Sastry Bhuvana Chandra…


మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

చిత్రం : సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :
మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

చరణం 1 :
నేనైతె ఆకు కొమ్మ... తానైతె వెన్నెల వెల్ల
నేనైతె ఆకు కొమ్మ... తానైతె వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన.... పొదరిల్లు మాది
మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

చరణం 2 :
కోవెలలొ వెలిగే దీపం ... దేవి మా తల్లి
కోనలలో తిరిగే పాటల గువ్వ.... మా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు.... గొరవంక గాని
వంకంటే వంకా కాదు.... నెలవంక గాని
మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

చరణం 3 :
గోరింక పెళ్ళైపొతే .... ఏ వంకో వెళ్ళిపొతే
గోరింక పెళ్ళైపొతే .... ఏ వంకో వెళ్ళిపొతే
గూడంతా గుబులై పోదా ? గుండెల్లో దిగులై పోదా ?
మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

anisri's Sukha Dukhalu Telugu Old Movie Song With HD Quality Music - S P…
youtube.com

*సీతా  రామాయ్య మనవరాలు


బధ్ర గిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
పాపికొండల కున్న పాపాలు కరగంగ
పరుగుళ్ళు తీసింది భూదారి గంగ

సమయానికి తగు పాట పాడెనే
సమయానికి తగు పాట పాడెనే
త్యాగరాజుని లీలగ స్మరించునటు
సమయానికి తగు పాట పాడెనే

పప మగ రిరి మగరిరి ససదద సస రిరి సరిమ
సమయానికి తగు పాట పాడెనే
ధీమంతుదు ఈ సీతా రాముడు సంగీఅ సంప్రదాయకుడు
సమయానికి తగు పాట పాడెనే

దద పదప పదపమ మపమగ రిరి రిపమ పప సరిమ
సమయానికి తగు పాట పాడెనే
రారా పలుక రాయని కుమారునే ఇలా పిలువగనొచ్చని వాడు
సమయానికి తగు పాట పాడెనే

దపమ పదస దదపప మగరిరి ససస
దదప మగరిరి సస సదప మపదసస దరిరి
సనిదస పద మప మగరిరిమ

సమయానికి తగు పాట పాడెనే
చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు
చిలకంటి మనవరాలు సదాగ లయలతెల్చి
సుతుండు చనుదెంచునంచు ఆదిపాడు శుభ
సమయానికి తగు పాట పాడెనే

సద్భక్తుల నడతలే కనెనే
అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనెనే
విముఖులతో చేరబోకుమని
వెదకలిగిన తాలుకొమ్మనెనే

తమాషామది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరజనుతుడు చెంతరాకనే సా

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
పాపికొండల కున్న పాపాలు కరగంగ
పరుగుళ్ళు తీసింది భూదారి గంగ

Awesome song from Seetharamayya gari manavaralu.
youtube.com

e

1 comment: