Wednesday 7 September 2016

02. కులగోత్రాలు (1962), 03. శ్రీరామరాజ్యం 04. చీకటి వెలుగులు (1975) 05. ద్రువ నక్షత్రం (1989) 06. బావ బావ పన్నీరు 07. అన్నదమ్ముల అనుబంధం (1975) 08. దేవుళ్ళు 09. సప్త పది 10. అల్లుడుగారు 11.చంద్రముఖి

ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్ 
 సంగీత ప్రభ 
 సుఖినోభవంతు 


ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ..ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
ఆహా . . .ఆ .. ఆ
ఓహో . . .హొ .. హో ..

చరణం 1:
ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం 2:
న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు

ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. హిందీలొ అర్థమూ షాదీ ఓహో...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం 3:
పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .
ఓహో . . .

Enlishulona Marriage Video Song From Aradhana Movie Starring Akkineni Nageswara…



రావే రావే బాలా..హలో మై డియర్ లీల..పోవోయ్ పోవోయ్ బావా..ఎందుకీ పెడత్రోవా
చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, జమునారాణి

పల్లవి:
రావే రావే బాలా...హలో మైడియర్ లీల
ఇటురావే ఇటురావే ... ఐ లవ్ యు
పోవోయ్ పోవోయ్ బావా...ఎందుకీ పెడత్రోవా
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ ... చాలునే సరసాలు
ఇకచాల్లే...ఇక చాల్లే

చరణం 1:
టిప్పుటాపు దొరసాని ..అప్టుడేటు అలివేణి
ఈ రోజుల్లో మనఫోజుల్లో ..ఇది దొరలఫేషనే రాణీ
పెద్దవాళ్ళు చూస్తారు .. దేహశుధిచేస్తారు
పచ్చి పచ్చి లవ్ చూపావంటే పిచ్చాస్పత్రిలో వేస్తారు
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ ... చాలు నీ సరదాలు
ఇకచాల్లే..." ఐ లవ్ యు " ..

చరణం 2:
తప్పేమున్నది మేడం ..నాతో షికారు రావడం
ఇక్కడ పుట్టినవాళ్ళం ..ఎందుకు మనకీ మేళం
ఈ పల్లెల్లో మన పల్లెల్లో...
ఈ పల్లెల్లో మనపల్లెల్లో...
సాగవీవేషాలూ... చాలునీ సరదాలు
ఇక చాల్లే..." ఐ లవ్ యు "


Watch Kula Gothralu movie songs Starring ANR, Krishna Kumari, Krishna, Relangi Venkatramaiah,…

శ్రీరామ లేరా ఓ రామా...ఇలలో పెనుచీకటి మాపగరా...
చిత్రం : శ్రీరామరాజ్యం
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : రాము,శ్రేయాఘోషల్

పల్లవి :
శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమా
మదిలో అసురాళిని మాపగరా
మద మత్సర క్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా
శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా

చరణం : 1
దర్శనమునుకోర దరికే చేరే దయగల మా రాజు దాశరధి
తొలుతనె ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియ వాది
ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహపరమై మేలు ఒసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగుడుదులే
మా శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగరా
సీతారామ చూపే నీ మహిమ ఆ ఆ ఆ

చరణం : 2
తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడ మధురం
సమయం అంతా సఫలం
ఇది రామ ప్రేమలోకం ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం ఆ ఆ
శ్రీరామ రామ రఘు రామ
పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతాభామ ప్రేమారాధనమా
హరికే హరిచందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ ఊ ఊ ఊ

Listen to Sri Rama Lera Telugu Devtional Song Composed by Ilayaraja Sung by Shreya Ghoshal.…
సప్త పది 
ఓంకార పంజర శుకీమ్... ఉపనిష దుద్యాన కేళికల కంఠీమ్..
ఆగమ విపిన మయూరీ ...ఆర్యాం..అంతర్విభావ యేత్ గౌరీమ్!!
అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
పరిపాలయమాం... గౌరి
అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి...పాలయమాం గౌరీ
పరిపాలయమాం.. గౌరి
శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి
ఆ...శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి...
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి..
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి..
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్బశాంతర భువనపాలిని
కుంకుమరాగశోభిని కుసుమ బాణ సంశోభిని
మౌనసుహాసిని... గానవినోదిని.. భగవతి పార్వతి... దేవీ
అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి.. పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరి

చరణం 1:
శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి ..ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి
సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...
అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
పరిపాలయమాం ..గౌరి

చరణం 2:
ఇందువదనే ..కుందరదనే ..వీణాపుస్తకధారినే
ఇందువదనే.. కుందరదనే... వీణాపుస్తకధారినే
శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది.. వ్యాసవాల్మీకి.. మునిజన పూజిత శుభచరణే...
సరససాహిత్య... స్వరస సంగీత.. స్తనయుగళే
సరససాహిత్య ...స్వరస సంగీత.. స్తనయుగళే
వరదేఅక్షరరూపిణే ....శారదే దేవీ
అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
పరిపాలయమాం ..గౌరి

చరణం 3:
వింధ్యాతటీవాసినే...యోగసంధ్యాసముద్భాసినే
సింహాసనస్తాయినే.. దుష్టహరరంహక్రియాశాలినే
విష్ణుప్రియే.. సర్వలోకప్రియే ..సర్వనామప్రియే ..ధర్మసమరప్రియే..
హే.. బ్రహ్మచారిణే... దుష్కర్మవారిణే..
హే.. విలంబితకేశపాశినే....
మహిషమర్దనశీల.. మహితగర్జనలోల..
భయతనర్తనకేళికే... కాళికే..
దుర్గమాగమదుర్గ పాహినే... దుర్గే దేవీ.....

Akkilandeswari Song From “ Saptapadi Movie” Starring Somayajulu Ramana Murthy, Sabitha and…

దేవుళ్ళు
అందరి బందువయ్య భద్రాచల రామ్మయ్య
ఆడుకునే ప్రబువయ్య ఆ అయోధ్య రామయ్య ||
చేయుతనేచ్చే వాద్య ఆ సీత రామయ్య ||
కోర్కెలు తీర్చే వాద్య కోదండరామయ్య |అందరి||

తెల్లవారితే చక్రవర్థెఇ రాజ్యమునేలే రామయ్య
తండ్రిమటకై పదవిని వదలి అడవులుకేగేనయ
మహిలో జనులను కవగావచ్చిన మహావిష్ణు అవతరమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోసిన్చినయ
పశువును ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్షకుదిన్చేనయ
చాకలి నిందకు మర్త్యము చాతగాకులసకినేవిదనదనయ
న రాము ని కష్టం లోకంలో ఎవరు పదలెరయ్యాఆ ||
సత్యం ధర్మం త్యాగంలో అతనుకి సరిలేరయ్య
కరుణ హ్ర్య్దయుడు సరనువాడికి అభాయమోసుగునయ
||అందరి||

భద్రాచలము పుణ్యక్షేత్రము అంత రామ మాయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై వుఉన స్థలం
పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించేనయ
సీతారామ లక్షమనలకు ఆభానములే చేయిన్చేనయ
పంచావాటిని ఆ జనకిరముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములడిన సేశాతీర్ధమదిగో
రామభాక్తితో నడిగా మారిన శబరి ఎదేనయ్య||
శ్రీరామ పదములు నిత్యం కడిగే గోదారైయ్య
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన?
జన్మధన్యంయ్య... ||అనదరి|| ||కోదండరామయ్య|||

Andari Bandhuvaya Song from Movie "Devullu" Movie Starring Prithvi Raasi. Devullu Movie Directed by…
youtube.com


చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా

చరణం : 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి

వెలుతురైనా చీకటైనా విడిపోదు
ఈ అనుబంధం

చరణం : 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి

ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం

Movie: Annadammula Anubandham Actor : NTR, Bala Krishna, Murali Mohan
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే...సంబరాల సాగే సందె మబ్బు రావే...

చిత్రం :
బావ బావ పన్నీరు
సంగీతం : చక్రవర్తి
గీత రచయిత : సీతా రామ శాస్త్రి
నేపధ్యగానం : SP.బాల సుబ్రమణ్యం,చిత్ర

ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
సంబరాల సాగే సందె మబ్బు రావే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
గోరువంక రావే కోరుకున్నదీవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె
చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే

నవ వధువై చెలి వయ్యారి హొయలొలికి వరించాలి
కలయికతో ప్రియా సరాగం శుభకరమై ఫలించాలి
ఆ.. హరివిల్లుల ఆమనిలోన నిలువెల్లా నే అల్లుకుపోనా
నూరేళ్ళ బందీని కానా

ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
గోరువంక రావే కోరుకున్నదీవే

తొలి వలపే వరం సుతారం జత కడితే అదో తమకం
చెలి పలుకే శుభం సరాగం ముడిపడితే సుధా మధురం
సురపొన్నల పానుపు పైన సుఖ శాంతుల వెల్లువ కానా
నీలోన నేనుండిపోనా

గోరువంక రావే కోరుకున్నదీవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె
చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
సంబరాల సాగే సందె మబ్బు రావే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే

https://www.youtube.com/watch?v=MXORWug9Hq4


పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి...అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి...

చిత్రం : ద్రువ నక్షత్రం (1989)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

చరణం 1 :

తత్వమసి... డిప్లమసి పనికి రావురా
తాళిబొట్టు తగిన జట్టు తప్పు కాదురా
కొంప అనే కుంపటినే నాకు పెట్టకు
కొంగు ముడి రంగు తడి నాకు గిట్టదు
ప్రేమ అమృతం.. ప్రేమ జీవితం..
నవ్వేటి యవ్వనమే ప్రేమకంకితం

చరణం 2 :

సీత సొద రామ వ్యధ విన్నదే కదా
పెళ్లి కథ ఊటి కథ ఎందుకే రొద
అమ్మ కథ నాన్న కథ పెళ్ళియే కదా
జంటకొక బొంత ఇక ఫిక్సుడే కదా
ప్రేమ కులాస.. అదే ప్రేమ బరోసా
ఏనాడు తీరనిదే ప్రేమ పిపాసా

https://www.youtube.com/watch?v=dNUeKIVO52U


మీటి చూడు నీ హృదయాన్ని .. పలుకుతుంది ఒక రాగం

చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి :

మీటి చూడు నీ హృదయాన్ని.. పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో...
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరిపోవును

చరణం 1:

పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
నీలో... ఊపిరాడక ఉన్నదీ ...
హృదయమే అర్పించుకున్నదీ ...హృదయమే అర్పించుకున్నదీ ...

ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

చరణం 2:

పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
నీలో ..లీనమైనది... కానరానిదీ..
నీ పదము తానై మూగపోయినదీ ...మూగపోయినదీ ...

ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

చరణం 3:

మనసు మూలలు వెతికి చూడూ ...మరుగు పొరలను తీసి చూడూ
ఏదో ...మబ్బుమూసి ..మసక కమ్మి
మమత మాయక ఉన్నది ...నీ మనిషి తాననుకున్నదీ ...

మీటి చూడు నీ హృదయాన్ని..పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని ...మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ..ఆ రాగం ఎక్కడిదో ...
తెలుసుకుంటే చాలును.. నీ కలత తీరిపోవును

https://www.youtube.com/watch?v=w_PR8Nermhk



1 comment: