Saturday 17 September 2016

1స్టేట్ రౌడి (1989) 2సైనికుడు 3అర్ధాంగి (1955)4. వెలుగు నీడలు 1961 5. బడి పంతులు 1972

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 


సర్వేజనా సుఖినోభవంతు
 స్టేట్ రౌడి
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం
మలయ సమీరంలో

నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని
హే పడుచుదనం చెప్పిందిలే
పానుపు మెచ్చిందిలే హే...(చుక్కల)

తలపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని
పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని
హే తనువెల్లా కోరిందిలే
తరుణం కుదిరిందిలే ఓ ఓ(చుక్కల)

చిత్రం : స్టేట్ రౌడి (1989)
సంగీతం : బప్పిలహరి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల
**************************************



సొగసు చూడ తరమా...అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా...
చిత్రం : సైనికుడు
గానం : శ్రేయ ఘోషల్
సంగీతం : హారిస్ జయరాజ్
సాహిత్యం : కుల శేఖర్

పల్లవి :
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వీ సువ్వి సువ్వాలమ్మా సిందులేసే సూడవమ్మా వయసునాపతరమా
సువ్వీ సువ్వి సువ్వాలమ్మా నాలో నేనూ లేనోయమ్మా ప్రేమ వింత వరమా

చరణం :
ఓ చల్ల గాలీ ఆ నింగి దాటి ఈ పిల్లగాలివైపు రావా
ఊహల్లో తేలి నీ ఒళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడనీవా
పాల నురుగుల పైన్ పరుగులు తీసి పాలుపంచుకవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమ గాధ వినవా

చరణం :
డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టి మేళా
బుగ్గే కందేలా సిగ్గేపడే లా నాకొచ్చెనమ్మా పెళ్ళికళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేనా పంపెనమ్మ వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగ ఆదమరిచిపోనా

Watch Sainikudu Telugu Movie Songs (1080p) Starring Mahesh Babu, Trisha, Irfan Khan, Prakash...
నేడు జిక్కి వర్ధంతి
రాక రాక వచ్చావు చందమామా ... (2)
లేక లేక నవ్వింది కలువభామా .........
కలువభామా ...       !1రక రాక !!
చరణం -1
మబ్బులన్నీ పోయినవి మధుమాసం వచ్చినది
మబ్బులన్నీ పోయినవి మధుమాసం వచ్చినది
మరులుకొన్న విరికన్నె విరయబూచి మురిసినది
మరులుకొన్న విరికన్నె విరయబూచి మురిసినది
విరయబూచి మురిసినదీ ........
చరణం - 2
రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెదకినది .....(2)
ఆకసాన విను చూచి ఆనందం పొంగినది ..(2)
ఆనందం పొంగినదీ ...............
లేక  లేక నవ్వింది కలువభామా  .....కలువభామా
చరణం -3
తీరని కోరికలే తీయని తేనియలై
తీరని కోరికలే తియ్యతీయని తేనియలై
వెన్నెలలో కన్నులలో వెల్లివిరిసి మేరసినవి .....(2)
దొంగలాగా దూరన తొంగిచూతువెలా...
తొంగిచూతువేలా
రావోయి రాగమంతా నీదోయి ఈ రేయి
!! రక రాక !!
చిత్రం: అర్ధాంగి (1955)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతమ్: బి నరసింహారావు - అ శ్వత్ద్వామ
గానం : జిక్కి  
 

పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయితలు ఆత్రేయ, శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి. రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం

నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం

నేడె నవోదయం నీదే ఆనందం ఓ..

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ..

పాడవోయి భారతీయుడా

ఓ ఓ ఓ ఓ

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ

సంబర పడగానే సరిపోదోయి

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ

సంబర పడగానే సరిపోదోయి

సాధించిన దానికి సంతృప్తిని పొందీ

అదె విజయమనుకుంటె పొరపాటోయి ఆగకోయి భారతీయుడా

కదలి సాగవోయి ప్రగతి దారులా

ఆగకోయి భారతీయుడా

కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ

ఆగకోయి భారతీయుడా

ఆకాశం అందుకొనే ధరలొక వైపు

అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు

ఆకాశం అందుకొనే ధరలొక వైపు

అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు

అవినీతి బంధుప్రీతి

చీకటి బజారూ

అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు

కాంచవోయి నేటి దుస్థితి

ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ

కాంచవోయి నేటి దుస్థితి

ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ

కాంచవోయి నేటి దుస్థితి

పదవీ వ్యామోహాలు కులమత భేధాలు

భాషా ద్వేషాలు చెలరేగె నేడు

పదవీ వ్యామోహాలు కులమత భేధాలు

భాషా ద్వేషాలు చెలరేగె నేడు

ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ

ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే

తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే

స్వార్ధమీ అనర్ధకారణం

అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్

స్వార్ధమీ అనర్ధకారణం

అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్

స్వార్ధమీ అనర్ధకారణం

సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం

నీ ధ్యేయం

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

నీ లక్ష్యం

సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే

లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం

లోకానికి మన భారతదేశం

అందించునులె శుభ సందేశం

లోకానికి మన భారతదేశం

అందించునులె శుభ సందేశం

లోకానికి మన భారతదేశం

అందించునులె శుభ సందేశం

https://youtu.be/avBaFtPkuhw
ANR and Savitri's Paadavoyi Bhaaratheeyudaa Song from Velugu Needalu

భారత మాతకు జేజేలు...
మిత్రులందరకూ భారత రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. రామారావు గారి సినిమాలలో ఆయన గెటప్ పరంగా నాకు బాగా నచ్చే సినిమా బడిపంతులు. అందులోని ఒక చక్కని దేశభక్తి గీతాన్ని నేడు గుర్తు చేసుకుందాం.

చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, బృందం

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ

త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు

శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు
విప్లవ వీరులు వీర మాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు

సహజీవనము సమభావనము
సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా
సహజీవనము సమభావనము
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ

https://youtu.be/Vpmhm0TwcTQ
Badi Panthulu | Bharatha Mathaku song
Song: Bharatha Mathaku Jejelu Singer: Ghantasala Lyrics: Aathreya Music: KV Mahadevan Cast: NTR, Anj...

   

1 comment: