Monday 31 October 2016

1.మాంగల్య బలం (1958) 2. ఖైదీకన్నయ్య 3. పూజాఫలం (1964) 4. ప్రేమించు పెళ్ళాడు, 5. ముత్యమంత ముద్దు (1989)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే  నమ:

 సర్వేజనా సుఖినోభవంతు

వాడిన పూలే వికసించెనే...చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..

చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే

చరణం 1:

వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము...
లోటు లేదిక మనదే సుఖము ...

తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే

చరణం 2:

పగలే జాబిలి ఉదయించెనేలా..
వగలే చాలును పరిహాసమేలా...
పగలే జాబిలి ఉదయించెనేలా...
వగలే చాలును పరిహాసమేలా...
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే..

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే

చరణం 3:

జీవితాలకు నేడే వసంతం...
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం...
ఆలకించగ మధురం మధురం ...

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే

https://www.youtube.com/watch?v=VfCmQCFVqvQ
Mangalya Balam Songs - Vaadina Poole - ANR - Savithri
Watch ANR Savithri's Mangalya BalamTelugu Old Movie Song With HD Quality Music - Master Venu Lyrics ...




తియ తీయని తేనెల మాటలతో...తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు...

చిత్రం : ఖైదీకన్నయ్య
సంగీతం : రాజేశ్వరరావు
గానం : సుశీల
సాహిత్యం : ఆత్రేయ

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు

దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదుగిరిలోన పరువును పెంచి
పేరు తెచ్చే పెన్నిదది

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగనేను పాసౌతా శభాష్

అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లపుడాడుట కూడనిది
ఏడువరాదు ఏమనరాదు
వీరునివలెనే నిలవాలి

అదరనునేను బెదరనునేను
ఏదెదురైనా ఎదిరిస్తా శభాష్

బ్రతుకును బాటను కడదాకా
నడచియె పోవలె ఒంటరిగా
ఇడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడునా
పిడుగులు పడినా జడవను నేను
వడివడిగా నే అడుగేస్తా శభాష్

https://www.youtube.com/watch?v=8ZGEMZRvV8Q

Khaidi Kannayya movie songs - Tiya Teeyani song - Gummadi, Raja Sulochana, Kantha Rao, Relangi
For more content go to http://www.mangomobiletv.com/ Follow us on twitter at https://twitt



..
గోపెమ్మ చేతిలో గోరుముద్ద...రాధమ్మ చేతిలో వెన్నముద్ద...
చిత్రం: ప్రేమించు పెళ్ళాడు
సంగీతం: ఇళయరాజా
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా ముద్దా కావాలా
ముద్దు కావాలా ముద్దా కావాలా
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద

రాగాలంత రాసలీలలు
అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు
అలు అరు ఇణి
రాధా... రాధా బాధితుణ్ణిలే
ప్రేమారాధకుణ్ణిలే
ఆహాహా
జారు పైట లాగనేలరా
ఆరుబయట అల్లరేలరా
ముద్దు బేరమాడకుండా ముద్దలింక తింటావా

వెలిగించాలి నవ్వు మువ్వలు
అలా అలా అహహ
వినిపించాలి మల్ల గువ్వలు
ఇలా ఇలా ఇలా
కాదా... చూపే లేత శోభనం
మాటే తీపి లాంఛనం
ఆహాహా
వాలు జళ్ళ ఉచ్చులేసినా
కౌగిలింత ఖైదువేసినా
ముద్దు మాత్రమిచ్చుకుంటె ముద్దాయల్లె ఉండనా

Watch The Song Called "Gopemma Chethilo" from Preminchu Pelladu Movie. The Other Tracks in the…
youtube.com

No comments:

Post a Comment