Sunday 30 October 2016

1అల్లరి ప్రేమికుడు (1994), 2. రాజసింహం,3. పెళ్ళి పీటలు 4. నమ్మిన బంటు 5. భార్యాభర్తలు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

 సర్వేజనాసుఖినోభవంతు 
  
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో...కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం

చరణం : 1
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల ఒంపు
ఆ... కబురు పంపు....ఆ... గుబులు చంపు
వంగల్లి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ... మరుల గుంపు....ఆ... మగువ తెంపు
అహో ప్రియా మహోదయా లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి చెలీ సఖీ చలావో
ఈ వసంతాల పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో...మోజు పడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తీయని జీవితం

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో

చరణం : 2
నీలాల మబ్బుల్లో నీళ్లోసుకున్నాక
మెరిసిందిలే చుక్క రూపు
ఆ... కలల కాపు ఆ... కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లాడి ఊపు
ఆ... చిలిపి చూపు ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఏదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయా వరించుకోమనాలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు ైరె కు ఎత్తిపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో
నచ్చిందమ్మా అమ్మడి వాలకం
ఒక చిన్నమాట ప్రియతమా...మనసైన మాట తెలుపుమా...
చిత్రం : రాజసింహం
సంగీతం : రాజ్ - కోటి
సాహిత్యం : వేటూరి
గానం : మనో,చిత్ర

పల్లవి :
ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని
ఇవి పాడలేని ప్రేమ పాట మూగ పలకరింతలు
ఎద నోరు విప్పి చెప్పలేని కన్నెపూల బాసలు

ఒక చిన్నమాట ప్రియతమా ఒడి కోరుకున్న హృదయమా
అరచేతిలోన చూపు నాకు ప్రేమరేఖనీ...
ఇవి జంకు బొంకు లేని ప్రేమ లింకు సంకురాత్రులు
నును లేత బుగ్గ కందగానే జరుగు జంట శాంతులు

చరణం : 1
జమలు పడ్డ వయసుమీద సొగసులెక్క చూడనా
చిలిపి లిప్పు వలపు అప్పు కలిపి నేను తీర్చనా
వలపునింక అదుపు చేసి పొదుపు చేస్తే మెచ్చనా
తలుపు చాటు చిలిపి కాటు పడితే నిన్ను గిచ్చనా
కౌగిళ్లు లవ్ గిల్లు క్యాషు చేసి చూడనా
చెక్కిళ్ళ చెక్కుల్లో క్రాసు చేసి ఇవ్వనా
ఒక పసిడి వనిత రజిత కమల నిలిచె కనుల ఎదుట
ఇక గనక గుళిక విసరమనక మనకు పవరుబరువై

చరణం : 2
పడుచు సోకు ఉడకబోత మెడల దాకా ఎక్కినా
తలుపు నేను తెరవలేను వలపు గాలిగా
నడుములేని నడకలోని తడుపు ఎంత చూసినా
తడమలేను తొడిమనింత తొలకరింతగా
ఎన్నెల్లో ఎండల్లే మనసు మంట పెట్టనా
కనుల్లో గుండెల్నే కలలు గంట కొట్టినా
ఇది ఒకరికొకరు దొరికి ఇరికి చెవులు కొరుకు వయసు
ఇది మెలిక పడిన మెరుపు చెలికి నాలుగులిడిన వెలుగే

ఒక చిన్నమాట ప్రియతమా మనసైన మాట తెలుపుమా
ఒకసారి చిత్తగించు నాదు ప్రేమలేఖని
ఇవి పాడలేని ప్రేమ పాట మూగ పలకరింతలు
నును లేత బుగ్గ కందగానే జరుగు జంట శాంతులు
లల...లలల...లల...
Raja Simham Movie Songs, Raja Simham Songs, Raja Simham Film Songs, Oka Chinna Maata Priyatama…
youtube.com
జిల్ జిల్ జిల్ జిల్ అని మోగింది...ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం...
చిత్రం : పెళ్ళి పీటలు
సంగీతం: యస్ వి కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర

జిల్ జిల్ జిల్ జిల్ అని మోగింది
ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం
ఝుం ఝుం ఝుం ఝుం అని మోగింది
కన్నె గుండెల్లో కాంభోజి రాగం
చిలకలు పరికిణీలు కాగా చుక్కలు హారమేసి పోగా
కోకిల కాలిగజ్జె తేగా పచ్చిక పాదరక్షలవగా
లేత గోరింటే చేతుల్లో పండగా

పైవాడే ఎదురేవస్తే పదహారు ప్రాయంలోనే
వయసే నిలిచే చక్కని వరమిమ్మంటా
క్షేత్రయ్యే మళ్ళీ పుడితే నా రూపురేఖల పైనే
కాస్తో కూస్తో కవితను రాసిమ్మంటా
తెలుగు భాషలో అక్షరాలు యాభై ఆరు
తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు
వానకు మబ్బులెంత ముఖ్యం
వీణకు తీగలెంత ముఖ్యం
తోటకు పువ్వులెంత ముఖ్యం
పుడమికి పడతులంత ముఖ్యం
మగువే లేకుంటే ఏకాకీ లోకం

మెరుపేమో మబ్బుల సొంతం
చురుకేమో చిరుతల సొంతం
చురుకు మెరుపు రెండూ నాకే సొంతం
పద్మానికి పగలే ఇష్టం పున్నాగకి రేయే ఇష్టం
రేయి పగలు రెండూ నాకే ఇష్టం
అంతరిక్షమే ఆటబొమ్మగా నన్ను చేరుకోదా
కల్పవృక్షమే కంటిచూపుకే నేల జారుకోదా
రాజుకు రాజ్యముంటే చాలు
లోభికి సంపదుంటే చాలు
యోగికి ప్రార్థనుంటే చాలు
నాకీ ప్రకృతుంటే చాలు
ఎంతో సంతోషం సందిట్లో వాలు
నమ్మిన బంటు
చెంగుచెంగున గంతులు వేయండి...
జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా..
తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు...
మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బతుకే లేదు...
అన్న వాక్యాలు అద్భుతం.
.
పంచభక్ష్య పరమాన్నం తెమ్మని బంతిని గూర్చుని అలగరుగా
పట్టుపరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ
నమ్మిన బంటు మాయాబజార్ వచ్చిన రెండేళ్లకి... అంటే 1959 లో వచ్చిన మంచి సినిమా. ఈ సినిమా నెగిటివ్సే పోయాయని అన్నారు. మన అదృష్టం కొద్దీ దొరికాయి.…
youtube.com


1 comment: