Monday 13 June 2016

01. శృతిలయలు (1987) ,02. ముద్దమందారం (1981) , 03.కల్యాణి ,04, చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) ,05.తూర్పు పడమర (1976) ,06. ఇన్స్పెక్టర్ భార్య (1970) 07. మూగ మనసులు (1963) ,08.బుద్ధిమంతుడు (1969) ,09.దీపావళి (1960) , 10. ప్రేమ విజేత (1992) 11. సరిగమలు (1994)


ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ


సర్వేజనా సుఖినోభవంతు
తెలవారదేమో స్వామీ.. నీ తలపుల మునుకలోఅలసిన దేవేరి అలమేలు మంగకూ

చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి :

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ

చరణం 1 :

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలాలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ... తెలవారదేమో స్వామీ

చరణం 2 :

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..
అలసిన దేవేరి అలమేలు మంగకూ...తెలవారదేమో స్వామీ

గామపని... తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ... తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ...

https://www.youtube.com/watch?v=8-cxDavJ51g


Thelavaarademo Swami Song - Sruthilayalu Movie Songs - Rajasekhar - Sumalata
Watch Thelavaarademo Swami Song From Sruthilayalu Movie, Starring Rajasekhar, Sumalata, Shanmukha Sr...

ముద్దుకే ముద్దొచ్చే మందారం...మువ్వల్లే నవ్వింది సింగారం

చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు

పల్లవి :

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

చరణం 1 :

అడుగులా అష్టపదులా
నడకలా జీవనదులా
పరువాల పరవళ్లు పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి

చరణం 2 :

పలుకులా రా చిలకలా
అలకలా ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి

https://www.youtube.com/watch?v=Zgzf6mPjWM8&feature=youtu.be


Mudduke Muddoche Mandaram - Superhit Song Of SP Balasubramaniam - Mudda Mandaram Movie Video Song
Mudduke Muddoche Mandaram - Superhit Song Of SP Balasubramaniam - Mudda Mandaram Movie Video Song. W...

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను...

చిత్రం : కల్యాణి
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల

పల్లవి:
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను..
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...

చరణం:
కృతిని అమ్మని పోతన్నకు
కృతిని అమ్మని పోతన్నకు
మెతుకే కరువైపోలేదా....
బ్రతికి ఉండగా త్యాగయ్యకు
బ్రతికి ఉండగా త్యాగయ్యకు
బ్రతుకే బరువైపోలేదా...
విరిసిన కుసుమం...వాడిపోతే....కరుణ చూపేదెవరు
పాడే కోకిల మూగ వోతే...పలకరించేదెవరూ
కడుపునింపని కళలెందుకు
తనకుమాలిన ధర్మమెందుకు...

https://www.youtube.com/watch?v=a2exBkQ5t0M


Kalyani | Lalitha Kalaradhanalo song
Listen to one of the melodious romantic songs, "Lalitha Kalaradhanalo" sung by P Sussheela from the ...

చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా

చిత్రం : చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం : ఎల్. ఆర్. అంజలి, శారద

పల్లవి :

చీటికిమాటికి చిట్టెమ్మంటే
చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు
కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి

చరణం 1 :

చినబాబుంటాడు పెదబాబుంటాడు
కాపులుంటరు కరణాలుంటరు
చిట్టెమ్మ అని పిలవకురా... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా

పిన్నలు పెద్దలు మన్నిస్తారు...
కాపులు కరణాలు దీవిస్తారు
ముద్దుల అత్త కూతురివే.. లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి.. ఓలమ్మీ..చిట్టెమ్మి

చరణం 2 :

వరసా వరసా వక్కల ఆకు... కురసా కురసా ముక్కలి పీఠ
పిల్లకు పిల్లాడు తోడంటా... నీకు నాకు పెళ్ళంట.. ఆహా.. అలాగా
తోడంటా... పెళ్ళంటా...పెళ్ళంటా... తోడంటా
ఏయ్.. నేను జీళ్ళ సీతయ్య మరదలినోయ్.. రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువు జీళ్ళ సీతయ్య మరదలివా... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
ఓలమ్మీ.. చిట్టెమ్మి

https://www.youtube.com/watch?v=J9DqxZSp_eY


Chitimatiki Chittemante

శివరంజని...నవరాగిణి...వినినంతనే
నా తనువులోని అణువణువుకరిగించే అమృతవాహిని

చిత్రం: తూర్పు పడమర (1976)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు

పల్లవి:

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృతవాహిని
ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

చరణం 1:

రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
స్వర సుర ఝురీ తరంగానివి
సరస హృదయ వీణా వాణివి
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

చరణం 2:

ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్రనీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధుకలశం
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

చరణం 3:

జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే రావే నా శివరంజనీ మనోరంజనీ
రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే నా దానివీ
నీవే నా దానివీ
నా దానివి... నీవే నాదానివీ

https://www.youtube.com/watch?v=ieb2Xtr_jY4

Sivaranjani Navaragini Video Song - Thoorpu Padamara
watch

రాధను నేనైతే... నీ రాధను నేనైతే...నిన్ను మలచుకుంటాను నా మురళిగా

చిత్రం : ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపధ్య గానం : మోహన్ రాజ్, సుశీల

పల్లవి :

రాధను నేనైతే... నీ రాధను నేనైతే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

చరణం 1 :

తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మేదలు
అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె మల్లెలు సవరించు పై ఎదలు
గడసరి చినవాడు తోడుగ ఉంటే కరగును నును సిగ్గు పరదాలు...
చిలిపిగ నను నీవు చేరుకుంటే.. జల జల పొంగును పరువాలు

చరణం 2 :

రాధ అంటే ఎవ్వరదీ మాధవు పాదాల పువ్వు అది
అంతటి స్వామి చెంతగ ఉంటేనే ఆమె మనసు పూచేది
తీయగ సోకే పిల్లగాలికి పూయని పువ్వే ఉంటుందా
కన్నుగీటే వన్నెకానికి కరగని జవ్వని వుంటుందా

https://www.youtube.com/watch?v=y31u1DMQnsg


Radhanu Nenithe - Inspector Bharya [ 1972 ] - Krishna, Chandrakala
Watch Radhanu Nenithe - Inspector Bharya [ 1972 ] - Krishna, Chandrakala Inspector Bharya is a Telug...



మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను..

చిత్రం : మూగ మనసులు (1963)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

మానూ మాకును కాను...
రాయీ రప్పను కానే కాను..
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

చరణం 1 :

నాకు ఒక మనసున్నాదీ
నలుగురిలా అశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి
అవి కలత పడితే నీళ్ళున్నాయి

చరణం 2 :

పెమిదను తెచ్చి వొత్తిని యేసి
చమురును పోసి బెమ చూపేవా
ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా..

చరణం 3 :

మణిషితోటి ఏళాకోళం
ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా
ఇరిగిపోతే అతకదు మల్లా..

https://www.youtube.com/watch?v=UhvOE0OPf2Y


Mooga Manasulu Songs - Maanu Maakunu Gaanu Raayi Rappanu - Akkineni Nageswara Rao, Jamuna, Aathreya
Mooga Manasulu Songs - Maanu Maakunu Gaanu Raayi Rappanu Movie: Mooga Manasulu, Cast: Akkineni Nages...



గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది...గుడిలోన జేగంట మ్రోగింది..

చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ.. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది

ఓ..గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
ఓ.. గుండెలో తొలివలపు పండింది

చరణం 1:

నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది
తనువు సెలరేఖలై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 2:

కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే...
గోరింక తానింక గూడు కట్టకపోతే
కొమ్మా యెంతో చిన్న బోతుంది...
కొమ్మా యెంతో చిన్న బోతుంది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 3:

సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
మనసైన జవరాలే వలచింది...
మనసైన జవరాలే వలచింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
ఊ...ఊ

https://www.youtube.com/watch?v=9IlZzEmVxN8


Buddhimanthudu Movie Songs - Guttameeda Guvva Kusindi Song - ANR - Shoban Babu - Vijaya Nirmala
Buddhimanthudu Movie Songs, Buddhimanthudu Songs, Buddhimanthudu Film Songs, ANR's Buddhimanthudu So...

యదుమౌళి ప్రియసతి నేనే...నాగీటు దాటి చనజాలడుగా...

చిత్ర్రం : దీపావళి (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్యులు
గానం : పి.సుశీల, ఘంటసాల, ఎ.పి.కోమల

యదుమౌళి ప్రియసతి నేనే
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే

లేదు భూమిని నా సాటి భామా
లేదు భూమిని నా సాటి భామా
అందచందాలు నీవేను లేమా
అందచందాలు నీవేను లేమా
నీ హృదయేశ్వరి నేనేగా

యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే

హే ప్రభూ
నీ సేవయె చాలును నాకూ
హే ప్రభూ
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ
మురిసెడి వరము నొసగుము స్వామీ
అదియే నాకు పరమానందమూ
హే ప్రభూ

సోగ కన్నుల నవ్వారబోసీ
సోగ కన్నుల నవ్వారబోసీ
పలుకు పంతాల బందీని జేసీ
కోరిక తీరగ ఏలేగా

యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే

https://www.youtube.com/watch?v=FuZx1zxG1F4
Yadhumauli Priyasathinene - Deepavali (1960) - P.Susheela, Ghantasala, A.P.Komala
మహానటి సావిత్రి 29వ వర్థంతి సంధర్భంగా నేను అప్‌లోడ్‌ చేసిన దీపావళి (1960) చిత్రంలోని ఈ పాట. యదుమౌళి ...

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా

చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని...నిస రిమ పద నిద సా నిసని...శభాష్
సరి నిస దని పదమా...సరి నిస దని పదమామపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా

https://www.youtube.com/watch?v=eslk2kDJCdI
Neelo Ala Godari - Prema Vijetha (1992) // Telugu Song
Movie: Prema Vijetha (1992) // Language: Telugu // Actors: Suresh, Harish, Yamuna, Roja // Singers: ...


1 comment: