Tuesday 28 June 2016

01.మాయలోడు (1993) ,02.యుద్దభూమి 03.లంకేశ్వరుడు,04.మిథునం,05. మరో చరిత్ర (1978), 06.సత్తెకాలపు సత్తెయ్య,07. రాధాగోపాళం ,08.రాధాకళ్యాణం (1981),09. పెళ్ళిపుస్తకం (1991),10.మిస్టర్ పెళ్ళాం (1993)11. ముత్యాల ముగ్గు (1975)


ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు




చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత : జొన్నవిత్తుల
నేపధ్య గానం : చిత్ర , బాలు

పల్లవి :

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

చరణం 1 :

నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో...గుండెల్లో ఎండ కాసే ఏలో...
అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో...
చిటికేస్తే బుగ్గ మీద ఏలో...
తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం
ఆహా…ఊహూ… ఓహోహొహో

చరణం 2 :

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో..వయసంటే తెలిసొచ్చే ఏలో...
మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే
సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

https://www.youtube.com/watch?v=4_ggMpnegcg



 జాలి జాలి సందెగాలి లాలిపాడినా..తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
చిత్రం : యుద్దభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

పల్లవి :
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు

సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు

చరణం : 1
పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా
తారకల్లు ఆకసాన దీపమెట్టినా
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా
ఆగదు అందదు మనసు ఎందుకో
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి
కంటి మీద కునుకురాని కొంటె కోరిక తెలుసుకో ఇక

చరణం : 2
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా
తీరని తీయని మనసు ఏమిటో
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక తెలుపుకో ఇక...



పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు...పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
చిత్రం : లంకేశ్వరుడు
గానం : బాలు, జానకి
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : దాసరి

పల్లవి :
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
ఎవరీ బడి పదహారేళ్ళ వయసు
థట్స్ గుడ్ పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

చరణం : 1
రెండు రెండు కళ్ళు చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు లోన వానజల్లు
లేనిపోని దిగులు రేయిపగలు రగులు
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే రాజుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

చరణం : 2
పిల్లదాని ఊపు కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో


happy birthdayto tanikella bharani garu
lovely song from midhunam movie

ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం (2)
అవని దంపతులు ఆరాదించే ముచ్చటైన మిథునం (2)

సుధా ప్రేమికుల సదనం
సదా శివుని మారేడు వనం (2) (ఆది దంపతులే )

దాంపత్య రసజ్ఞులు ఆలికోసగు
అనుబంధ సుఘంధ ప్రసూనం

నవరసమాన సమరసమానా (2)
సహకార స్వర మే వనం

భారతీయతకు హారతి పట్టే
క్రుషిమయ జీవన విహారం

భార్య సహాయం తోడ్కోని సాగే
భవసాగర ధరణం (2) (ఆది దంపుత్లే)

అల్పసంతసముకు కల్పవ్రుక్షమున
ఆత్మ కోకిలల గానాం
పుషార్దములా మూల బాటలలోఅ
పుణ్య దంప్తులపయనం

అరవై దాటిన ఆలుమగల
అనురాగామ్రుత మధనం
గ్రుహస్థ ధర్మం సగర్వమ్ముగ
తానెగరేసినా జయకేతనమ్మ్ ..జయకేతనమ్మ్మ్

Avakaya Mana Andaridi video song from Midhunam telugu movie on Mango Music, featuring S. P.…

పదహారేళ్ళకు.. నీలో... నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
చిత్రం : మరో చరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : జానకి

పల్లవి :
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి... వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

చరణం 1:
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు..
పాటలు పాడిన చిరు గాలులకు...
తెరచాటొసగిన.. చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ...
కోటి దండాలు.. శతకోటి దండాలూ

చరణం 2:
నాతో కలిసి నడచిన... కాళ్ళకు
నిన్నే పిలిచే... నా పెదవులకు
నీకై చిక్కిన... నా నడుమునకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ

చరణం 3:
భ్రమలో లేపిన... తొలి జాములకు
సమయం కుదిరిన... సందె వేళలకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకు
మనకై వేచే... ముందు నాళ్ళకూ
కోటి దండాలు.. శతకోటి దండాలూ

Watch Maro Charitra Video Songs. Kamal Hasan Saritha's Maro Charitra Telugu Movie Song With…


ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ...జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నువ్వు
చిత్రం :సత్తెకాలపు సత్తెయ్య
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
రచన : ఆత్రేయ
గానం : పి.బి.శ్రీనివాస్, బెంగుళూరు లత

పల్లవి :
లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ
లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ
ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు
ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు

చరణం : 1
ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో
ఈ వంటి వానికీ..నా వంటి పేదకూ
ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో
ఈ వంటి వానికీ..నా వంటి పేదకూ
ప్రాణాలు పోసావు..బతకాలి అన్నావు
ఉరితాడు జో జోల ఉయ్యాల చేసావు
ఉయ్యాల చేసావు..

చరణం : 2
నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో
నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో
చిన్నారీ పొన్నారి..చిగురల్లె వెలిసావు
సిరిలేదు గిరిలేదు..మనసుంటే అన్నావు..
మనసుంటే అన్నావు..
ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు
బజ్జోమ్మ నీవు

చరణం : 3
లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ
లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ
ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు
బజ్జోమ్మ నీవు..బజ్జోమ్మ నీవు
బజ్జోమ్మ నీవు..బజ్జోమ్మ నీవు

Chalam, Shoban Babu, Rajasri's Sattekalapu Satteya Movie - Muddu Muddu Navvu Song with HD…


మా ముద్దు రాధమ్మ రాగాలే...శ్రీమువ్వగోపాల గీతాలు
చిత్రం:రాధాగోపాళం
సంగీతం:మణిశర్మ
రచన: వేటూరి
పాడినవారు: SP బాలు, సునీత

మాముద్దు రాధమ్మ రాగాలే శ్రీమువ్వగోపాల గీతాలు
ఆచేయి ఈచేయి తాళాలు అనురాగాలలో గట్టిమేళాలు

నువ్వందం నీనవ్వందం తల్లో మల్లెపూవందం
కట్టందం నీబొట్టందం నువ్వు తిట్టే తిట్టే మకరందం
సూరీడు చుట్టూ భూగోళం రాధమ్మ చుట్టూ గోపాళం
నడుము ఆడితే కథాకళి జడే ఆడితే కూచిపూడి
తలే ఆడితే పలానా తథిమ్మాథి థిల్లాన

కూరలు తరిగే కూరిమి ఇష్టం చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం ముద్దుల దాకా వెడితే
వలచినవారి పరాకు అందం గెలిచిన సతిపై చిరాకు అందం
కోపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మాంగల్యం
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కల్యాణం

ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలారా మీరు
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో

RadhaGopalam

కలనైనా క్షణమైనా మాయనిదే...మన ప్రేమా.. మన ప్రేమా
చిత్రం : రాధాకళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

పల్లవి :
కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ..

చరణం : 1
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ..
చరణం : 2
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ...
కరిగేదే.. మన ప్రేమా


కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : SP.శైలజ

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య
గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానంద
రూపం జగత్రయభూపం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ
తీర్థం పరమపురుషార్థం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

Pelli Pustakam Songs, Krishnam kalayasakhi Song from Pelli Pusthakam Telugu Movie with Starring :…
youtube.com

రాదే చెలి నమ్మరాదే చెలిమగవారినిలా నమ్మరాదే చెలి
చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : ఆరుద్ర
గానం : చిత్ర

పల్లవి :
రాదే చెలి నమ్మరాదే చెలిమగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనారీ మనసమ్మరాదే చెలి

చరణం : 1
నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలుచీరకి డబ్బులు కరువన్నాడే
నెలతప్పిన నెలత తనకి పరువన్నాడే
నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నడే
ముంగురులను చూసి తాను మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరచిపోయాడే
ప్రేమించు సీజన్లో పెద్ద మాటలు
పెళ్ళయ్యాక ప్లేటూ ఫిరాయింపులు
మొదటి వలపు.. మధుర కథలు.. మరిచెను ఘనుడు

చరణం : 2
మాటల్తో కోట కట్టాడే.. అమ్మో
నా మహరాణి నీవన్నాడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
గాలి తాకితే వాగుల కాలువిరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలికోసం
ఆ కాస్త తీరాక మొదటికి మోసం
మనవి వినడు.. మనసు కనడు.. మాయల మొగుడు

చరణం : 3
తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే
సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోమభయము తోయజనేత్రా
తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ...కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : గుంటూరు శేషంధ్రశర్మ
గానం : సుశీల

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండీ నావకు చెప్పండి

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

1 comment: