Thursday 9 June 2016

01.గోదావరి (2006), 02. పుణ్యవతి (1967),03.గండికోట రహస్యం (1969),04.భైరవద్వీపం,05. మువ్వగోపాలుడు ,06. నారి నారి నడుమ మురారి ,07.ముద్దులమేనల్లుడు, 08.వాన 09. డబ్బు డబ్బు డబ్బు 10. ష్ గప్ చుప్,11. మిధునం

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజన సుఖినోభవంతు



నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం...

చిత్రం : భైరవద్వీపం
సాహిత్యం : వేటూరి
గానం : బాల సుబ్రహ్మణ్యం
సంగీతం : మాధవపెద్ది సురేష్

శ్రీ తుంబుర నారద నాదామృతం ఆ.. ఆ ... ఆ..
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం

సప్త వర్ణముల మాతృకగా శుక్త వర్ణముల డోలికగా – 2
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
స ప స గరిగని దపమగ గనిగమగరిసనిస
సగమ గమప మపని స గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం

స స ససస సనిప గరిస గ ప ని స గరిస నిసరి పనిస గపని రిగప గరిస
సంగీతారంభ సరస హేరంభ స్వరపూజలలో షడ్జమమే
రి రీ రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమగరిస నిసరినిదమప మగరి నిదప మగరి
శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే
గ గా గారిస రిసగ సాదప గగపదస
మురళి వనంతాల దిరియు వసంతాల – 2 చిగురించు మోహన గాంధారమే
మ సమగసనిదమ సమగ మదని మగనిసస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము ఇందోళ మద్యమమే
ప పమప గగప పమప దనిద పదస పదసరి పమరిసనిదపమప రిసరిమ ప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగరి పదనిరిసనిదప రిసనిదప మగరిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిస నినినిని ని రిపమగరి మద మదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే....
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న – 2 నినిపమగమ పనిమపనినిస
నిని సస సస నిని రిరి రిరి నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
నినినిసస సస నినిని గగ గగ నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప – 2
గమ గమ గమ గమ సగ సగ సగ నిస – 2
నిస గమ సగ మప గమ పని మప నిస సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప ......

శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం.
bhairavadweepam sri tumbura narada by AVUDARI VENKATA RAMANAIAH

వేగుచుక్కా వెలగాపండా...ఎన్నెల్లో వెండికొండా...
చిత్రం : మువ్వగోపాలుడు
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

పల్లవి :
వేగుచుక్కా వెలగాపండా ఎన్నెల్లో వెండికొండా
పండు చూస్తే నిండుగుంది పట్టబోతే బెట్టుగుంది
పండు మీద కన్ను పడ్డా కొండమీది గండు చిలకా
ఎందుకంతా తొందరంటా మాగేదాకా ఆగమంటా

చరణం :
అచ్చట్లు లేక ముచ్చట్లు లేక గుప్పెట్లో దాస్తే ఎట్టామరి
సందిట్లోకైనా కౌగిట్లోకైనా పందిట్లోతంతూ కానీమరి
రేపే మన కల్యాణం నేడే ముద్దు తాంబూలం
పోనీ ఆషాడమాసం మరి రానీ వైశాఖమాసం

చరణం :
కడియాలు మోగా అడుగేసిరాగా కదిలింది నాలో నాదస్వరం
మలిసందే కాగా మనసూగి పోగా మామిళ్ళతోపే బృందావనం
నీరూపే చంద్రరేఖా నీరాకా ఏరువాకా
నీమాటే శుభలేఖ అది నిలవాలి కడదాకా

మనసులోని మర్మమును తెలుసుకో...నా మనసులోని మర్మమును తెలుసుకో...
చిత్రం: నారి నారి నడుమ మురారి
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
మనసులోని మర్మమును తెలుసుకో...
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మాన రక్షకా.. మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో...
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మదన కీలగ.. మరిగిపోక..
నా మనసులోని మర్మమును తెలుసుకో

చరణం 1:
ఇనకులాబ్ధ.. నీవేకాని వేరెవరులేరు దిక్కెవరు లేరు
ఆనంద హృదయా.. మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన.. ఏకాంతకైనా
ఆ కాంక్ష తగున.. రాకేందు వదనా
మనసులోని మర్మమును తెలుసుకో

చరణం 2:
మునుపు ప్రేమగల దొరవై
సదా తనువునేలినది గొప్ప కాదయా
మదిని ప్రేమ కథ మొదలై
ఇలా అదుపుదాటినది ఆదుకోవయా
కనికరమ్ముతో ఈ వేళ...కనికరమ్ముతో ఈ వేళ..
నా కరముబట్టు..త్యాగరాజ వినుతా..

చరణం 3:
మరుల వెల్లువల వడినై ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా
మసక వెన్నెలలు ఎదురై ఇలా తెగువ కూడదని మందలించవా
కలత ఎందుకిక ఈ వేళా కలవరమ్ముతో ఈ వేళ..
నా కరము వణికే..ఆగాడాల వనితా..
Nari Nari Naduma Murari Songs - Manasu Loni Marmamulu Telusuko Movie: Nari Nari Naduma…

ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో..మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
చిత్రం : ముద్దులమేనల్లుడు
సంగీతం : కే.వి.మహదేవన్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, యస్.పి. శైలజ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైడు భాగ్యాలిస్తుంది

ఇది మొదలె నమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన
దొర వయసు వాయనాలు ఇవ్వాలమ్మ

పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన నా రాణి నాకె కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షి గా
మాటే మనుగదగా మనమే పాటగా
సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్గ మంటూ

తేనె కు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయి లో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడు గా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా
జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవం గా

వాన
ఎదుట నిలిచింది చుడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

ప్రాణంమంత మిటుతుంటే వాన వీణలో

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టిఅపాలి

కలే ఐతె ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది ని రుపం
చెలిమి బంధం అల్లుకుందే...

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో వ్రాసున్న చిరునామ
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలంటి శాపమేదో సోంతమైందిలా..

Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra
watch: Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra Subscribe to ou.


కుహు కుహూ కూసే..కోయిల నాతో నీవు వచ్చావని..నీతో వసంతాలు తెచ్చావని...

చిత్రం :
బ్బు డబ్బు  డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

పల్లవి :

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

చరణం : 1

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా...
కురిసీ..మురిసీ..పులకించాలంటా...

కుహు కుహూ... కుహు కుహూ...

చరణం : 2

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

https://www.youtube.com/watch?v=83oJ3B6CKVg
Kuhu Kuhu Song - Dabbu Dabbu Dabbu Movie Songs - Mohan Babu, Murali Mohan, Radhika
Watch Kuhu Kuhu Song From Dabbu Dabbu Dabbu Movie, starring Mohan Babu, Murali Mohan, Radhika among ...

చిత్రం =ష్ గప్ చుప్
ఓరే గ్రాఫీ...మహా పాపీ...కురూపీ...
నిన్ను చూడంగనే వచ్చు హై లెవల్ బీపీ...
ముండమోపీ జిరాఫీ నిన్ను తెగ్గోస్తే లోకానికే పిచ్చ హ్యా.....పీ.....
అంఖ చండాలుడా....బంక బదిరాంధుడా...
పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా...
నీ నీచరూపంబు చూడంగ పాపంబు
నీ కంఠ నాళంబు కక్కోసు గొట్టంబు
నీ కళ్ళలో కుళ్ళు...నీ బుర్రలో బురద...
నీ పైపులే చెత్త నీ జన్మ డ్రైనేజీ...
నువ్వో దగుల్బాజీ ఏబ్రాసి చప్రాసి సన్నా..సివీ...

అశుద్ధ స్వరూపా అబద్ధ ప్రలాపా పింగు బొంగైన పింజారిగా...
కుత్తేకా బచ్చా కొవ్వెక్కిన లుచ్చా
పగిలేను నీ పుచ్చ తీరేను నా కచ్చ
నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా...
భ్రష్టాతిభ్రష్టా పరాకాష్టకెళ్ళావు దుష్టత్వమందున్ ముదనష్టుడా త్రాష్టుడా...
కుష్టు ముష్టోడి అంకుష్ఠమా...వృద్ధ క్షయరోగి ఉచ్చిష్టమా...

ఒరేయ్ పళ్ళకిచ్చి అరేయ్ చిల్లి గోచి
నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా.. పెన్... టచ్చిగా...
ఒరేయ్ పాచి ముఖమా నడుస్తున్న శవమా
వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగత్రాగు సోంబేరిగా...
పెద్ద ఇడియట్టువి చద్ది పెసరట్టువి
పిచ్చి టేస్టున్న శాడిస్టువి గజ్జి పాదాల మరుగుజ్జువి
ఉఛ్ఛ నీచాలు లేనట్టి రాస్కేలువు స్కే...లు..వీ.....
ఒరేయ్ అక్కుపక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాక్షి సంఘాల అద్యక్ష్యుడా...
నువ్వు చుంచెలుక గొద్దెవి రాబందు రెట్టవి బొద్దింక కేశానివి
సీంపంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకీకవీ...
న్యూసెన్సు డాంకీవి నో సెన్సు మంకీవి కుడితిలో చిట్టెలుకవీ..
మునిసిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి...
ఎద్దు మొండానివి...సృష్టి మొత్తంబులో శుంఠవి

ఒరేయ్ పేడ తట్టా అరేయ్ చెత్త బుట్ట
ఒరేయ్ గడ్డిపోచా అరేయ్ నారపీచా
ఒరేయ్ తుప్పు మేకా అరేయ్ పంది తోకా
ఒరేయ్ వానపాము ఇలా తొక్కుతాము
ఒరేయ్ గౌడిగేదె ఇదే బడిత పూజ
సెంటిమెంటన్నదే లేని పెంటాసురా.....

నిన్ను తిట్టంగ నేనెంతవాడన్ దురాత్మా...
ఏడేడు లోకాల భాషలకే శోషొచ్చి మూర్ఛిల్లురా...
మహా బండబూతుల్ తలల్వంచు నీ ముందు పాపాత్ముడా..

చావరా ఓ బోడి వెధవా
చావరా ఓ అంట్ల వెధవా
చావరా నెల్తక్కువెధవా
వెధవన్నర వెధవా
ముప్పావు వెధవా
పరిపూర్ణ వెధవా
చావరా.... చావరా..... చావూ... చావూ....ఊ..... ధూ....

చిత్రం : ష్ గప్ చుప్
సంగీతం : రాజ్ - కోటి
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,SP.శైలజ

One of Jandhyala's most hilarious works!
మిధునం

అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు
అమృతమ్మన్నది హంబక్కు అయ్యలారా...ఆ...ఆ..

జైకాఫి......
విశ్వాంతరాళంబులో నున్న బ్రహ్మాండ గోళాలలో
నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మానోటికీ
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ

యెర్లి మార్నింగులో నిద్రలేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు
బెడ్కాఫి కోసమ్ము పెండ్లాముపై ఱంకెలేయించకే బెస్ట్ టేస్టేశ్వరీ
ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫేశ్వరీ
జిహ్వకున్ సిధ్ధి చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ
లోకప్రాణేశ్వరీ ప్రాణదానేశ్వరీ
గంట గంటా ప్రతీయింట ఉప్పొంగవే ఉష్ణపానీశ్వరీ...

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న
రంధ్రాలలో నుండి నీ సారమంతా సుతారంగ జారంగ
నోరూరుచుండంగ నాసామి రంగా నిజంగానె చచ్చేవిధంగా
కాస్త తాగంగ మళ్ళీ పునర్జన్మ వచ్చేవిధంగా

ప్ప్రొద్దున్నె నీ పొందు లేకున్న మూడంత పాడయ్యె
టైమంత వేస్టయ్యె కచ్చెక్కి పిచ్చెక్కి
అశ్లీల సంభాషణల్ చేసి కాంటాక్ట్స్ సర్వంబు
నాశమ్ము కావించుకుంటారుగా
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా
దాచుకుంటారుగా కాచుకుంటారుగా
చచ్చినట్లింక యిచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా

కాఫీని అంతెత్తుపైనుంచి ఓ కప్పులో వుంచి
ఆకప్పు లోనుంచి ఈ కప్పులోపోసి
అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టియున్నుర్గలుప్పొంగగా తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ వరిష్టాలలోనన్
గరిష్ఠంబుగా కాఫి తాగేందుకిష్టంబుగా పోవుగా...
షాపు మూసేయ వాపోవుగా...
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ శుభాంగీ ప్రభాంగీ
నమస్తే నమస్తే నమః

చిత్రం : మిధునం
సంగీతం : స్వరవీణాపాణి
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : జొన్నవిత్తుల

Coffee Dandakam full Telugu Video Song from Midhunam movie on Mango Classics, ft SP…

2 comments: