Sunday 3 April 2016

శరీరంలోని షట్చక్రాలు

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - షట్చక్రాలు

సర్వేజనా సుఖినోభవంతు 


శరీరంలోని షట్చక్రాలు

శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు..
మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
– వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.
7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.

2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.

3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.

4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.

5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.

6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.

7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

షట్చక్రాలు
శ్లో. మహీం మూలాధరే - కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే - హృది మరుత మరుత మాకాశ ముపరి
మనోపి భ్రూమధే - సకల మపి భిత్త్వా కులపధం
సహస్రారే పద్మే - సహ రహసి పత్వా విహరసే. - 9శ్లో 
 
తా. ఓ పరాశక్తీ! మూలాధార చక్రమందు భూతత్త్వమును, స్వాధిష్ఠాన చక్రమందు అగ్నితత్త్వమును, మణిపూర చక్రమందు జల తత్త్వమును, అనాహత చక్రమందు వాయు తత్త్వమును, దానిపై నున్న విశుద్ధ చక్రమం దాకాశ తత్త్వమును, ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రార పద్మమందు ఏకాంతమున, భర్తతో విహరించుచున్నవు. – సౌందర్యలహరి

విశేషము:- లింగ స్థానమందు(స్త్రీ పురుష భేదము) స్వాధిస్థాన చక్రము, నాభియందు మణిపూర చక్రము, హృదయమందు అనాహత చక్రము, అనాహత చక్రమునకు పై భాగమున విశుద్ధ చక్రము, భ్రూ మధ్యమందు ఆగ్నేయ చక్రము నున్నదని యెఱునునది.
దేహస్థషట్చక్రదేవీ దహరాకాశమధ్యగః,
యోగినీగుణసంసేవ్యా భృంగ్యాదిప్రమథావృతః.

నీవే మన – ఆకాశ – వాయు(ప్రాణమున) – అగ్ని(ముఖము) – జల – భూ(భూమి) తత్త్వములుగ నగుచున్నావు.
వినాయకుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, బృహస్పతి, ఇంద్రుడు ఈ ఆరుగురు మూలాధారము మొదలు ఆరు చక్రములుకు అధిస్థాన దేవతలు.
ఓం షడద్వాతీత రూపిణ్యై నమః : వర్ణ, పద, మంత్ర భువన తత్వ, కళాత్మ, లారూ షడధ్వ లనబడుతాయి. ఈ షట్కాతీత స్వరూపిణియై తేజరిల్లు మాతకు వందనాలు.

మహాపద్మావటీసంస్థా - కదంబవనవాసినీ|
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ. - 23శ్లో

 
వందలు - పద్మము - పరము.
వేలు - మహాపద్మము - పరార్ధము.

మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః - గొప్పదైన పద్మము.

తటిల్లేఖా తన్వీం - తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా మ - ప్యుపరి కమలానాం తవ కలామ్,
మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో - దధతి పరమాహ్లాద లహరీమ్. - 21శ్లో
 

తా. తల్లీ! భగవతీ! మెఱపు తీగవంటి శరీరము గలిగియు, సూక్ష్మమై దీర్ఘమై అజ్ఞాది ద్వాదశాంతమువరకు క్షణ విలసనము కలదియు, సూర్య చంద్రాగ్ని(కళారూపము) ప్రభసమానమైనది, షట్చ్రాకాలలో ఉపరిదైనది యైన సహస్రార మహాపద్మాటవిలో కూర్చున్న నీ సదాఖ్య (శివ శక్తుల సాయుజ్యం; ప్రకృతి పురుషుల కలయిక) కళను మహాత్ములు, పరిపక్వ చిత్తులు మూల(అరిషడ్వర్గముల)మాయ తొలగిన మనసు(చిత్తము)తో పరమహ్లాద లహరిగా అనుభూతి నొందుతున్నారు. అంటె నిరతిశయా నందాన్ని సదా పొందుతున్నారని భావం. - సౌందర్యలహరి
ఓం షట్చక్రో పరిస్థితాయై నమః : మూలాధార, స్వాధిస్థాన, మణిపూర, అన్నహత, విశుద్ధ, ఆజ్ఞా - నామ కాలైన షట్చక్రాలకూ ఉపరి భాగంలో - సహస్రార పద్మంలో భాసిల్లు నట్టి శ్రీదేవికి వందనాలు.
ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః : షట్చక్రాలు లేదా అసంఖ్యాక సహస్రనాడులే మహాపద్మాలన బడుతాయి! అగణితనాడీ నిలయమైన దేవరూప పద్మారణ్యంలో వసించు మాతకు ప్రణామాలు. పద్మాలతో పోల్చబడు కాళ్ళు, చేతులు, కన్నులు షట్చక్రములు.

తటిల్లతా సమరుచి - షట్చక్రోపరిసంస్థితా |
మహాసక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ. - 40శ్లో


1. చతుర్దళమును హేమవర్ణమునగు మూలాధార చక్రమునందు - గణపతి కలడు. (భూతత్త్వమును)
వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిపాః,
అప్యేకదన్త హేరమ్బ లంబోదర గజాననాః.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
బుద్ధుఁడు -1.ఒక గ్రహము, (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుక గలవాడు.
వేలుపు - దేవత(దేవత - వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.

వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
నీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుత్యస్య స్వతంత్ర త్వాత్ - స్వతంత్రుఁ డౌటవలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.

విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
ద్వైమాతురుఁడు - 1.వినాయకుడు, 2.జరాసంధుడు, వ్యు.ఇద్దరు తల్లులు గలవాడు.
ద్వయో ర్మాత్రో రుమాగంగాయో రపత్యం ద్వైమాతురః - గంగా పార్వతులకు నిద్దఱికినిఁ గుమారుడు.
గణానాం ప్రమథాదీనామధిపో గణాధిపః - ప్రమథాధిగణములకు నాయకుఁడు.
ఏకదంతుఁడు - వినాయకుడు.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.
హేరుద్ర సమిపే రంబతే తిష్ఠతీతి హేరంబః - రుద్రునియొద్ద నుండువాఁడు. ఋ గతౌ. హేరతే వర్థయతి భక్తానితివా - భక్తుల వృద్ధిబొందించువాఁడు. హేవృద్ధౌ.
లంబోదరుఁడు - వినాయకుడు.
బొజ్జదేవర - వినాయకుడు. (బొజ్జ(ౙ)- కడుపు)
లంబ ముదరం యస్య సః లంబోదరః - వ్రేలెడి బొజ్జగలవాడు.
గజవదనుడు - వినాయకుడు.
ఏనుఁగు మోముసామి - గజానునుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజస్యేవ ఆననం యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు. ఈ ఎనిమిది వినాయకుని పేర్లు.

పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ గణపతి చేయుట, ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిషరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. గడ్డితో తృప్తిపడే దైవం వినాయకుడు.
గణపతి - వినాయకుడు.
పుష్ఠి : గణపతి అర్థాంగి. ఆమె లేకపోతే సృష్టిలో స్త్రీ పురుషులకు పుష్టినహి. దారువనమునందు దేవి పుష్టిరూపిణి. పుష్టి - 1.బలుపు, సమృద్ధి.

తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే - నవరస మాహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా - ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే - జనక జననీమజ్జగదిదమ్ || - 41శ్లో
తా. ఓ తల్లీ! నీయొక్క మూలాధార చక్రమునందు లాస్యరూపమైన నృత్యమునందు మిక్కిలి ఆసక్తురాలై సమయ అను పేరు గలదైన(చంద్రకళతో కూడిన) ఆనందభైరవి(భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము)యను శక్తితో గూడి, నవరసములతో నొప్పు తాండవ నృత్యమును నటించు నటుడైన వానిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా తలచెదను. ఏలననగా పుట్టుక నుద్దేశించి (దగ్దమైన లోకమును మరల పుట్టింపవలెనని దయచేత కూడియున్న ఆనందభైరవీ భైరవులను ఈ జగత్తు తల్లిదండ్రులుగ దలంచుచున్నాను.) - సౌందర్యలహరి

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ|
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ. - 38శ్లో

మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స అనే అక్షరాలు ఉంటాయి. సుషుమ్నను అనుసరించి మూలాధార స్వాధిష్ఠాన మణిపూర కాలయందు ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే శక్తిత్రయం వుంటుంది.
ఓం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి స్వరూపిణ్యై నమః : శక్తిత్రయ స్వరూపిణికి వందనాలు.
ఓం మూలాధారైకనిలయాయై నమః : మూలాధారపద్మంలో నాలుగుదశలుంటాయి. మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స, అనే అక్షరాలు ఉంటాయి. ఆ పద్మకర్ణికా మధ్యదేశంలో సర్వనిద్రాణస్థితిలో కుండలినీ శక్తిరూపాదేవి ఉంది. ఆ స్థానంలో ఏకాకిగా ఉండునట్టి శక్తి స్వరూపిణికి ప్రణామాలు.
ఊష్మధ్వనులు(శ, ష, స, హ) శీతల ప్రదము స వర్ణము, శీతకిరణః - స తేజో యుతమము హ వర్ణము, సూర్య జ్ఞాపకమగు హ వర్ణము. శివుడనగా హ కారము. ఆకాశబీజము హ కారము, హ కారం స్థూలదేహం. రవిః - హ, సూర్యుడు హకారాధిపతి. సహ – భూమి.
మూలాధారే హకారం చ హృదయే చ రకారకం |
భ్రూమధ్యే తద్వదీకారం హ్రీంకారం మస్తకే న్యసేత్ ||

వసుంధర(భూమి) సర్వాధార, సర్వసంపద్ధాత్రీ, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. "పృథివీ హేషా నిధిః" అన్నది వేదం. భూమి వసుంధర, వసువు అంటే బంగారం, రత్నం, ధనం, కిరణం, అగ్ని ఇవన్నీ భూమిలో ఉన్నాయి.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ. హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ. హిరణ్యరేతుడు. హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ, హిరణ్మయాండ సంభవుడు కనుక హిరణ్యగర్భుడు. ప్రజాపతిర్వై హిరణ్య గర్భః.
ఆరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి సుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడనె చూడఁబదారువన్నె బం
గారములో నైన వెలిగారము గూడకయున్న, భాస్కరా.
తా. భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తి లేక అతని గొప్పతనము రాణింపదు.

ప్రజాపతి రగ్నిః - అగ్ని వాయువుల కూడిక నలన భూమి ఆవిర్బవించినది. సత్యం, విశాలజలం, దీక్ష, ఉగ్ర తప్పస్సు, బ్రహ్మ, యజ్ఞం ఇవి భూమిని ధరిస్తున్నాయి.
భూమి నుండి అన్నం(అన్నం వై ప్రజాపతిః) - అన్నం నుంచి రక్తం - రక్తం నుంచి రేతస్సు - రేతస్సు నుండి సంతానం.
మూలము -1.వేరు(root), ఊడ మఱ్ఱి, (ఊఢ- పెండ్లియైన స్త్రీ, భార్య). వేరు - చెట్టు యొక్క మూలము.
ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడివెరు శిఫ. (ఈ యూడల వేళ్ళవలననే చెట్టున కాహార మందును).
శిఫ - ఊడ, పడుగొమ్మ.

వేద మూల విందం జ్ఞానం, భార్యామూలమిందం గృహమ్|
కృషిమూల విందం ధాన్యం, ధనమూల మిదంజగత్||
తా. జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. – నీతిశాస్త్రము

ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, 4.(యోగ.) మూలాధార చక్రము.
అధిష్ఠానము - 1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము(ప్రాభవము - ప్రభుత్వము), ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.
అధిపానదేవత - అధిదేవత.

ఆనిక - 1.ఆశ్రయము, ఆధారము, ప్రాపు, 2.దార్ఢ్యము, 3.పానము, రూ.అనువు.
ప్రాపు - ఆశ్రయము, సం.ప్రావణమ్ ప్రాపః.
ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము, 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
సంశ్రయము - ఆశ్రయము.
కుదురు - 1.అనుకూలమగు, 2.స్వస్థమగు, వి.1.పాదు, 2.నెమ్మది, 3.అగసాలె వానికుంపటి, 4.స్థానము, 5.ఆధారము, 6.చుట్టకుదురు.
పాదు - 1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదః, పదమ్.
ఆలవాలము - పాదు. గడ్డిబొద్దు - చుట్టకుదురు.
నిలకడ - 1.ఉనికి, 2.స్థైర్యము(స్థిరత్వము), 3.విరామము, వి.(గణి. భౌతి.) నిశ్చలముగా నుండుట (Rest).
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).
స్థితి - 1.ఉనికి, 2.కూర్చుండుట, 3.నిలకడ, 4.మేర, సం.వి. (రసా.) 1.అవస్థ (Phase), 2.ఘన, ద్రవ, వాయు, ద్రవ్యావస్థలలో నొకటి, 1.ఒక వస్తువు యొక్క ఉనికి, రీతి (State), 2.అది ఆక్రమించిన స్థానము, (భౌతి.) ఏ వస్తువు అయినను ఉన్న విధము, అవస్థ (Mode of existence). నిలక - నిలుపు, నిలకడ, స్థితి.
విరామము - 1.విశ్రాంతి, 2.యతిస్థానము.

ఉపాధి - 1.ధర్మచింత, 2.కపటము, 3.కుటుంబమున మిక్కిలి ఆసక్తిగలవాడు, 4.విశేషణము, 5.ఆధారము.
శ్లో. క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్షి – శ్చతురధిక పంచాశ దనిలే,
దివి ద్వాష్షిట్త్రింశ - న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖా స్తేషామ - ప్యుపరి తవ పాదాంబుజయుగమ్. 14శ్లో
తా. భూతత్త్వమందు ఏబదియాఱును, జల తత్త్వమునందు ఏబది రెండును, అగ్ని తత్త్వమందు ఎబదినాలుగును, ఆకాశ తత్త్వమందు డెబ్బదిరెండును, మనస్వత్త్వమందు అరువదినాలుగును, ని ఈ రీతిగా ఏ కాంతు లుండునో వానికి పై భాగమున నీ పాదపద్మయుగ మున్నది. (9వ దానిలో చక్రనియమము కలదు.) - సౌందర్యలహరి

అంఘ్రి - 1.కాలు, 2.వేరు, 3.పద్యపాదము.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపుకోడు, క్రి.మండు.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4 వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగుభాగములలో ఒకటి (Quadrant).
వేరు - చెట్టు యొక్క మూలము.

పాదా రశ్మ్యఙ్ఘ్రి తుర్యాంశాః -
పాదశబ్దము కిరణమునకును, కాలికి, నాలవపాలికిని పేరు. పద్యంతే అనేనేతి పాదః పద గతౌ. - దీనిచేత పొందుదురు. "పాదస్స్యాద్బుధ్న పూజ్యయో" రితిశేషః.

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3మంచపుకోడు.
గొరిజ - పశువు కాలిగిట్ట, సం.ఖురః.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.

పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.
అంఘ్రిపము - చెట్టు, పాదపము.
పాదపము - చెట్టు.

అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ బీడించి, ప్రాణంబు బిగియఁబట్టి,
నాభితలముఁజేర్చి, నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి,
యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి
మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి, దృ క్కర్ణనాసాస్య మార్గములు మూసి.
ఆ|| యిచ్చలేని యోగి యెలమి ముహూరార్ధ,
మింద్రి యానుషంగ మింత లేక
ప్రాణములను వంచి బ్రహ్మ రంధ్రము చంచి,
బ్రహ్మందుఁ గలయుఁ బౌరవేంద్ర !

భా|| రాజా(పరీక్షిన్మహారాజా) ! యోగి తన దేహత్యాగ సమయంలో బడలిక త్రోసిపుచ్చి, పాదమూలంతో మూలాధారచక్రాన్ని అనగా గుదస్థానము అదిమి పట్టి, ఆ పై ప్రాణవాయువును అనగా ప్రాణశక్తిని (పొత్తి కడుపు) బిగబట్టి తరువాత బొడ్డువద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహతచక్రానికి (గుండె) అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికీ, (కంఠం) అటనుండి ఆ చక్రాగ్రముండే తాలుమూలానికీ, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్య నున్న అజ్ఞా చక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కండ్లు, చెవులు, ముక్కు, నోరు - ఇవి మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్థ ముహూర్తకాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం (సహస్రారము) లనే ఆరుస్థానముల (చక్రముల) గుండా భేధించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు. - శుకుడు, భాగవతము
మూలమాధార షట్కస్య మూలాధారం తతో విదుః |
స్వశబ్దేన పరం లింగం స్వాధిష్ఠానం తతో విదుః ||

2. షడ్దళమును విద్రుమాకారమునగు స్వాధిష్ఠాన చక్రమందు - బ్రహ్మ కలడు. (అగ్నితత్త్వమును)
ముక్తా విద్రుమ హేమ నీల
ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః,
యుక్తా మిందు నిబద్ధ రత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్|

విద్రుమము - పగడము, పగడపు చెట్టు Coral.
పగడము - ప్రవాళము, పవడము, సం.ప్రవాళః.
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణాదండము.
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.

స్వాధిష్ఠాన కమలము అగ్నితత్తోత్పత్తి స్థానము. భగవతి కుండలిని స్వాధిస్ఠాన చక్రమున స్వయముగ అధిష్టించి గ్రంధి కల్పనము చేయును. కాబట్టి స్వాధిస్ఠాన మని పేరు.
తవ స్వాధిస్ఠానే - హుతవహ మధిష్ఠాయ నిరతం
త మీడే సంవర్తం - జనని! మహతీం తాం చ సమయామ్|
యదాలోకే లోకాన్ - దహతి మహతి క్రోధకలితే
దయర్ద్రా యా దృష్టి - శ్శిశిర ముపచారం రచయతి|| - 39శ్లో.
తా. తల్లీ! స్వాధిష్ఠానచక్రమందు అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరము ప్రకాశించుచు ప్రసిద్ధుడైన సంవర్త(సంవర్తము - ప్రళయము)మను అగ్నిరూపముతో వెలుగుచున్న పరమేశ్వరుని స్తుచించెదను. అధిష్ఠాన, అవస్థాన, అనుష్ఠాన, నామరూపములందు సమానమగుటచే సమవైన నిన్నును స్తుతింతును. సంపరాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుని అతిక్రోధ కలిత వీక్షణము లోకములను దహించుచుండగా, కృపచేత నీ దయార్ద్ర దృష్టి శీతలమైన ఉపచారము కావించుచున్నది. - సౌందర్యలహరి

స్వాధిస్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా|
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా తిగర్వితా.

స్వాధిష్ఠానచక్రము నందు బ - భ - మ - య - ర - ల అను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు. సూర్యుని వంటి వర్ణమును బ కారం మొదలు ల కారం వరకు ఉండు వర్ణాలు ఆరు దళములను కల్గియుండును.
మ కారము - సుషుప్తికి. సుషుప్తి - ఒడలెరుగని నిద్ర. సుషుప్తి - ఒక నాడి.
మ కారము శివుడు. మ కారం సుషుప్తికి, లయకు సంకేతం. ర కారం సూక్ష్మం. ప్రతిభోద్దీపకమగు ల వర్ణము, భూ ప్రతిపాదకము ల వర్ణము.
అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.
అంత్యము - 1.కడపటిది, 2.అధమము.
అధమము - తక్కువైనది(తక్కువ - కొరత), నీచము.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ. పూజ్యస్త్రీ.
ప్రథమం భారతీ నామ(సరస్వతి, వాక్కు) - ద్వితీయం చ సరస్వతీ|
తృతీయం శారదాదేవీ(సరస్వతి, పార్వతి) - చతుర్థం హంసవాహనా||

బ్రహ్మ- నలువ - నాభిజన్ముఁడు బ్రహ్మ, ప్రజలను వృద్ధి పొందించువాడు. బ్రహ్మ స్తోత్రప్రియుడు. బ్రహ్మ ముఖములందు సరస్వతి; సరస్వతి యందు దేవిస్థానం దేవమాత. సరస్వతిని మున్ముందు సేవించినవాడు బ్రహ్మ.
సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషము నకును, ఆవునకును పేరు. సరస్వతి శరీరవర్ణం తెలుపు, వాహనం హంస.
అధారా హితపత్నీకా స్వాధిష్ఠాన సమాశ్రయా,
ఆజ్ఞాపద్మాసనాసీనా విశుద్ధస్థలసంస్థితా|

ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
ఆంగీరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.

క్రతువు - యజ్ఞము.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజన్ము, మనుష్యయజన్ము, ఇవి పంచయజ్ఞములు), వికృ.జన్నము.
జన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
జన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.

జన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుఁదిండి, రూ.క్రతుభూక్కు.

3. దళదళమును నీలవర్ణమునగు మణిపూరక చక్రము నందు - విష్ణువు కలడు. (జల తత్త్వమును)
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.

కుముదము - 1.ఎఱ్ఱతామర, 2.నైఋతి దిక్కునందలి ఏనుగు, 3.తెల్లకలువ.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.
అనుపమ - నైఋతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

మణిపూరే - మణి పూర చక్రము. ఆ చక్రమున అధిస్థాన దేవతగానున్న భగవతి మణికాంతులతో ఆప్రదేశమున పూరించునది కావున ఆ చక్రమునకు మణిపూర చక్రమని పేరు వచ్చినది.
శ్లో. తటిత్త్వస్తం శక్త్యా - తిమిరపరిపంథి స్ఫురణయా
స్ఫురన్నానారత్నా- భరణ పరిణద్దేంద్ర ధనుషమ్ |
తవ శ్యామం మేఘం - కమపి మణిపూరైక శరణం
నిషేవే వర్షన్తం - హరమిహిర తప్తం త్రిభువనమ్ || 40శ్లో
తా. అమ్మా! ఓ భగవతీ! మణిపూరచక్ర మాధారముగ గలదియు, చీకటిని (అజ్ఞాన)తొలగించు శక్తితో మెఱుపులు గలదియు, ప్రకాశించుచున్న అనేక రత్నాభరణాల కాంతిచే ఏర్పడిన ఇంద్రధనుస్సుతో(జ్ఞానదీప్తి) వంటిదియు, ప్రళయకాల(హరుఁడు - శివుడు)శివుడను సూర్యుడిచే(దుఃఖం) తపింపజేయబడిన ఈ ముల్లోకాలను(కృపామృత) వర్షధారచే తడుపుతూ, అనిర్వచనీయమైనది, శివశక్త్యాత్మకమైన నీ నీలి మేఘాన్ని(దయాస్వరూపం) సేవింతును. - సౌందర్యలహరి

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా|
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. - 102శ్లో

మణిపూర చక్రమందు బృహస్పతి. బృహస్పతి వేదశాస్త్ర పారంగతుడు. బుద్ధికి బృహస్పతి, దేవతల గురువు మిక్కిలి బుద్ధిమంతుడు, తన మేధాశక్తితో ఇతరులకు మేలుచేసే ఆదర్శవాది(గురుడు). గురువు త్రిమూర్తి స్వరూపుడు.
కర్బురము - 1.జలము 2.బంగారము విణ.చిత్రవర్ణములు గలది. బంగారము దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు.
సహస్రపత్రము - కమలము, తామర.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
జలము - 1.నీరు 2.జడము 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము విణ.తెలివిలేనిది.

కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 3.కమలాఫలము.
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.
ఓం మణిపూరాంతరుదితాయై నమః : నాభిలో దశదళ కమలం ఉంది. దానికే మణిపూరకమని పేరు. అందులో రత్నాలంకృతయై భాసిల్లు శ్రీమాతకు ప్రణామాలు. (నాభియందు సమానవాయువు)
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్ సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.) ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
ఇంద్రనీలము - నీలమణి. తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
కిరీటపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.

అశ్మగర్భము - మరకతము, పచ్చ.
కప్పుఱాయి - నీలమణి, నీలము - ఒక విలువ గల రత్నము, శ్రేష్ఠమైన నీలము అనురత్నము ఒకటి వున్ననూ చాలును.

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.
నీల - శ్యామ వర్ణము కలది purple, శివుడు, Indigo, పచ్చ, pearl.
నీలలోహితుడు - శివుడు, అభిషేక ప్రియుడు.
విష్ణువు - వెన్నుడు, అలంకార ప్రియుడు-విశ్వమంతట వ్యాపించినవాడు.

నారాయణుడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము(జడధి - సముద్రము) లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - లక్ష్మి, పార్వతి.

భూమి కన్న జలము - జలము కన్న వాయువు - వాయువు కన్న అగ్ని - అగ్ని కన్న ఆకాశము - ఆకాశము కన్న మనస్సు - మనసు కన్న బుద్ధి - బుద్ధి కన్న కాలము. ఒకదాని కన్న మరొకటి గొప్పది. అన్నింటి కన్న గొప్పవాడు విష్ణువు - నారాయణుడు.
ఓం హరి సోదర్యై నమః : హరి-అంటే నారాయణుడు హరికి సహోదరీ స్వరూపిణియైన నారాయణికి వందనాలు. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వ ప్రవర్తినీ. సుపార్శ్వమునందు దేవీస్థానం నారాయణి.
నాభిస్థానమైన మణిపూర చక్రమున డ - ఢ - ణ - త - థ - ద - ధ - న - ప - ఫ లను వర్ణపద్మములు పశ్యంతీవగ్రూపములు. పద్మం రేకులు పది అగ్నిరూపం. .
ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః : దశ దళాలలో భాసిల్లు మణిపూర కమలంలో విలసిల్లు దేవికి నమోవాకాలు.
ఓం విష్ణు గ్రంధి విభేదిన్యై నమః : మణి పూరక చక్రోపరి భాగానకల విష్ణు గ్రంధిని భేదించుకొని సాక్షాత్కరించునట్టి పరాశక్తికి ప్రణామాలు.

ద అంటే ఇచ్చేది అని అర్థం. దానం అంటే ఇవ్వబడేది. దాత అంటే ఇచ్చేవాడు, ప్రదాత అంటే విశేషంగా ఇచ్చేవాడు. ' న ' అంటే దాస్యం.
నాన్నోదకసమం దానం నద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యాః పరం మంత్రం నమాతుర్దైవతం పరమ్||
తా. అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. – నీతిశాస్త్రము

దానం వల్లనే ఆకలి దప్పిక(దాహం) తీరుతుంది. ఆకలన్నవారికి అన్నము పెట్టువాడు, అంతటా సుఖముగా ఉండును. అన్నము ఎక్కువగా ఇచ్చువాడు ఆరోగ్యవంతుడు కాగలడు. నీరు సర్వజీవులకు ప్రాణాధారం. చల్లని నీరు నాలుకకు ఇంపు. నీరు దానము చేయువాడు మంచి రూపము పొందును.
లోభునకు ఇద్దరు ఇల్లాండ్రు. ఆకలి, దప్పి అని వారి పేర్లు. వారి మహిమ యింతా అంతాకాదు. వారి సేవతోనే ప్రపంచమంతా మునిగి తేలుతూ వుంటుంది.
'పరోపకారం మిదం శరీరం' దానం పుచ్చుకునేవారు వుంటేనే కదా దాతలయొక్క దానగుణానికి కీర్తివచ్చేది.
గాయత్రి త్రిమూర్త్యాత్మకము. గాయత్రి మంత్రం ఋగ్వేదం లోనిది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ముఖాలతో (వేద వదనమునందు గాయత్రి) శోభించే తల్లి వేదమాత గాయత్రి.
ఓం గాయత్ర్యై నమః : గానం చేయువారిని తరింపజేయునది గాయత్రి, వేదజననీయ గాయత్రి, అట్టి గాయత్రీ స్వరూపిణికి వందనాలు.
అన్ని ప్రేమలకన్న మిన్నమైన ప్రేమ - తల్లి ప్రేమ. ప్రేమకు ప్రతిఫలాపేక్ష ఉండదు. కన్నతల్లి కంటె ఘనము లేదు.
మణి పూర చక్రము పదిదళములును ఎర్రని వర్ణము, దకారము మొదలు మకారము వరకు, అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని కకారము మొదలు రకారము వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.
మంత్ర వ్యాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా,
ఇడా పింగళికా మధ్యా సుషుప్నా గ్రంథిభేదినీ.

4. ద్వాదశ దళమును పింగళ వర్ణము నగు (అ)ననాహత చక్రము నందు - రుద్రుడు కలడు. (వాయుతత్త్వమును) హృదయాకాశమున అనాహత చక్రము.
దశ వాయు జయాకారా కళాషోడశ సంయుతా|
కాశ్యపీ కమలాదేవి నాద చక్ర నివాసినీ||

రుద్రుడు - శివుడు – Solitude, మనసు చెడినపుడు(హతుడు). రుద్రాణి - పార్వతి. రుద్రకోటయందు దేవిస్థానం రుద్రాణి. రుద్రుని భార్య నిద్ర. ఈమె యోగము అధారముగా రాత్రులందు లోకమును ఆవహిస్తుంది.
సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వన్ద్వం - కిమపి మహతాం మానసచరమ్|
యదాలాపా దష్టా - దశగణిత విద్యా పరిణతిః
ర్యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ|| 38శ్లో
తా. ఓ దేవీ! ఏ హంసల జంటల యొక్క గానము(కూతలు) పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణములను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి(అనాహత కమలమందు) మకరందముచే ననందించు యోగీశ్వరుల యొక్క మనస్సు లనెది మానస సరస్సు నందు విహరించు నా హంస జంటను సేవించుదును. - సౌందర్యలహరి

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా|
దంష్ట్రోజ్జ్వలా క్షమాలాది - ధరా రుధిరసంస్థితా. – 100శ్లో

అనాహతము - కొట్టబడనిది, ఉత్తరింపబడనిది, చలువచేయబడనిది, (క్రొత్త వస్త్రము). (గణి.) గుణింపబడనిది, వి.1.దేహమందలి షట్చక్రములలో ఒకటి, 2.దౌడ మొ.ని స్పర్శలేకుండ పుట్టుధ్వని.
కారికము - చలువ చేయని క్రొత్తది (వస్త్రము). అనహూతము - పిలువబడనిది.

దౌడ - తాలుపు, రూ.దవుడ.
తాలుపు - దౌడభాగము (Palate).

దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బ లు సరళములు.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.నిష్కపటము.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
అనాహత మహాపద్మ మందిరాయై నమః
అనాహతమున మరుత్ - వాయుతత్త్వము. మరుత్తులు దితి(ప్రకృతి కళ నుండి పుట్టింది) దైత్యమాత పుత్రులు, వాయువుల కధిస్ఠాన దేవతలు. మరుత్తు - వేలుపు, గాలి.
దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
దైత్యారి - విష్ణువు.

మరుతౌ పవనామరౌ : మరుచ్చబ్దము వాయువునకును, దేవతలకును పేరు. మ్రియతే అనేనేతి మరుత్. మృజ్ ప్రాణత్యాగే, దీనిచేత చత్తురు.
ప్రాణా పాన వ్యానో దాన సమాన నాగ కృకర దేవదత్త ధనుంజయ కూర్మా ఇతి దశ వాయువః|
వాయువు – (భూగో.)గాలి యొక్క చలనము, సం.వి.గాలి. ముఖ్యప్రాణుడు, శబ్దము, స్పర్శగలది. వాయువు దేహంతో ప్రవేశించి ఆయాదేహ విభాగములలో సంచరిస్తూ కూడా ఆసక్తి పొందదు. నింగిచూలు - వాయువు, ఆకాశము నుండి పుట్టినది, గాలి నుండి అగ్ని దీని నుండి నీరు పుట్టుటచే నీటికి తాత.
గాలిని బంధించిన మొనగాడు లేడు! గాలిని బంధించి హసించి దాచిన పనిలేదు.
సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు. స్పర్శనము - 1.తాకుడు 2.ఈవి 3.వాయువు.
స్పర్శము - 1.తాకుడు 2.ఈవి 3.వ్యాధి.

పింగళః కృతికాసూనుః శిఖివాహా ద్విషద్భుజ. పింగళ సూర్యరూపిణి, పమోక్ష్ణియందు దేవీస్థానం పింగళేశ్వరి.
పింగళము - అగ్ని, శివుడు, కొంచెము నలుపు కలిసిన పసుపు వన్నె, Brown, రాగి copper metal. పింగళుఁడు - 1.అగ్ని, 2.శివుడు.
అవసరమైనవాడు - ఆత్మబంధువు వాడు, బహుముఖంబులవాడు వాయు సఖుడు - అగ్ని. తెలియక స్పృశించినను అగ్ని కాల్చును అను న్యాయము. అంటరాని వేలుపు - అగ్ని.
సేనగ వాంచితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట, నిజమేకద దేహులకగ్ని హోత్రుడౌ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టి వహించులేని నా
డూని, విభూతిలో నడిగి యుండడి తేజము దప్పి, భాస్కరా.
తా.అగ్నిదేవుడయునను తాను తిను తిండి మానిన యెడల తన కాంతిని గోల్పోయి బూడిదలో నణగియుండును. అట్లే, తనకు ఎక్కువ ప్రీతి అయిన ఆహారమును తిన్నచో మనుష్యుడు వృద్ధి పొందును, లేనిచో కృశించును.

అగ్గి చూలి - 1.కుమారస్వామి 2.నీరు వ్యు.నిప్పునుండి పుట్టినది.
షోడశ శ్శిఖివాహనః : అన్ని చోట్ల ఈశ్వరుని సందర్శించాలన్నది కుమారస్వామి(సుబ్రహ్మణ్యుని) బోధ.
కాంతి1 - 1.కోరిక 2.(అలం) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది(Light). ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు ఆధార శూన్యములై చెడిపోతాయి.

దీపము దానము చేయువాడు నిర్మలమైన నేత్రములు కలవాడు కాగలడు.
అక్షరము - 1.నాశము లేనిది, (జీవాత్మ, పరమాత్మ) 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము(సత్ రూపము పరబ్రహ్మము), 5.మోక్షము.
అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.
అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము, దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడుచు చున్నది.
ఓమ్(ఓం) - 1.పరబ్రహ్మ్మర్థకము, 2.ప్రారంభార్థకము, (ఓం కారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ+ఉ+మ). మంత్రములకెల్ల శిరోమణి, ఓంకారమునందు సమస్త జగత్తును ఇమిడి యున్న దని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారము - 1.ప్రణవము 2.ప్రారంభము.
ఓంకారేశ్వరుడు - శివుడు.

ఓంకార ప్రణవౌ సమౌ :
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రకృష్టో నవః ప్రణవః ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము.
ప్రణూయతే ప్రస్తూయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయుఁబడునది.

హృదయములో ప్రాణవాయువు : ప్రాణవాయువు హృదయస్థానమును ఆశ్రయించి యుండును. సర్వజీవులకూ హృదయస్థానమే భగవంతుని నిజవాసము. హృదయమందు స్వర్ణలోకము ఉండును.
ఓం రుద్రగ్రంధి విభేదిన్యై నమః : హృదయ స్థానంలో(హృదయం లలితాదేవి) అనాహాత చక్రస్థానంలోగల రుద్రగ్రంధిని(అగ్ని స్థానము) భేదించి తేజరిల్లు పరమేశ్వరికి వందనాలు. అనాహతము జ్యోతిర్లోకము.
హృదయంలోని అనాహత చక్రం తెరుచుకోవాలంటే హృదయకుహరంలోనికి ప్రవేశాన్ని కల్గించే ద్వారం వంటిదైన భ్రూమధ్యము (అనగా స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశం) భగవన్మందిర ద్వారము! అది తెరుచుకుంటే తప్ప నుదుట జ్ఞానజ్యోతి వెలుగుగా కనిపించదు. ఆకుపచ్చ వంటి పంచరంగుల నవరత్నకాంతులతో ఆజ్ఞాచక్రము వెలుగుతూ వుంటుంది, దాని మధ్య ఓంకారం ప్రణవమే ఈ హృదయకవాటము.
అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని కకారము మొదలు రకారం వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.
అనాహత చక్రము హృదయ స్థానమునందని ప్రసిద్ధము. హృదయపద్మ సూర్యతేజస్సమమై పన్నెండు రేకులతో, ఒక్కొక్క రేకున వరుసగా క, ఖ, గ, ఘ, ఙ్, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ అనే అక్షరాలు వుంటాయి. ఇది పురుషాధిష్ఠానము, అనందపదము అని ఒప్పుతూంది. దీనిపై పదారురేకుల పద్మం వుంటుంది. దీని రేకులపై అకారాది పదారు స్వరాలు వుంటాయి. దీనియందు జీవుడికి పరమాత్మ సంబంధం కలిగి జీవుడికి విశుద్ధత్వం కలుగుతుంది గనుక ఈ షోడశదళ పద్మానికి విశుద్ధం అని సంజ్ఞ. దీనికి స్థానం కంఠం. దీనియందు నాదం భిన్నమై వైఖరీ రూపాన సార్థకం అవుతుంది. దీనియందున్న స్వరాలూ, దాని క్రిందనున్న ముప్పైరెండు హల్లుల్ల్లు వర్ణత్వశుద్ధి కలుగుతుంది.
అనాహత చక్రమున క - ఖ - గ - ఘ - జ - చ - ఛ - జ - ఝ - ఞ్ - ట - ఠ - లను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు.
ఓం కకారరూపాయై నమః : "క" కారము (మంగళకరమగు క వర్ణము, తత్త్వజ్ఞాపకమగు క వర్ణము) ఆదియందుగల విద్యకు కాదివిద్య అనిపేరు. అట్టి కాదివిద్యాస్వరూపిణియగు పరమేశ్వరికి ప్రణతులు.
ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.

నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.
హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ - ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.

మోక్షము - 1.కైవల్యము 2.మోచనము, విడుపు 3.ముక్తి.
దుఃఖాదీనాం మోక్షణ మవసానం మోక్షః - దుఃఖాదులయొక్క వినాశము మోక్షము.

జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా,
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ.

మృణాలము - 1.వట్టివేరు 2.తామర తాడు. ఇడా పింగళికా మధ్యే మృణాళీ తంతు రూపిణీ.
5. షోడళ దళమును ధూమ్రవర్ణము నగు విశుద్ధ చక్రము నందు - జీవాత్మ కలడు. (ఖః - ఆకాశము, ఆకాశతత్త్వమును)
విశుద్ధ చక్రము చంద్రలోకము. చంద్రుని వంటి కాంతి కలది నై విశుద్ధ చక్రమును పద్మము, హంస అను వర్ణాలు. విశుద్ధ చక్రము శుద్ధ స్పటిక సంకాశ మగుట వలన ఆ పేరు వచ్చినది.
విశుద్ధౌ తే శుద్ధ - స్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ - మపి శివసమానవ్యవసితామ్,
యయోః కాంత్యా యాంత్యా - శ్సశికిరణసారూప్యసరణే
ర్విధూతాంతర్ధ్వాంతా - విలసతి చకోర జగతీ. - 37శ్లో
తా. ఓ జననీ! చీకటి తొలగిన చకోర పక్షివలె, జగత్తు ఏ పార్వతీ పరమేశ్వరుల యొక్క చంద్ర కిరణములవలె ప్రకాశించు మార్గమున వెలుగొందునో, అట్టి నీ విశుద్ధ చక్రమందు స్ఫటికమువలె నిర్మలమై, ఆకాశ తత్త్వమున కాధారమైన శివ తత్త్వమును, శివ సారూప్యమగు దేవిని గూడ సేవించుచున్నాను. - సౌందర్యలహరి

విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా|
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా. - 98శ్లో

విష్ణువు(ప్రజాపతిర్వై మనః) మనస్సే పద్మమగును. ఆ పద్మమునకు ఆకాశము శిరస్సు. మేరువు(బంగారము) కాండము. మనస్సు మేరువువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు. ఆకాశము కన్న మనసు గొప్పది.
జీవాత్మ - దేహి, జీవుడు. – impurity(body).
దేహి - దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
శరీరి - ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - 1.గురువు, బృహస్పతి, (Jupiter).

ప్రాణా హి ప్రజాపతిః - ప్రాణ దేహాదులను ఆశ్రయించే వుండేది జీవుడు. దేహికి ప్రాణములు బలరూపములు.
పంచభూతాత్మము – దేహము, సర్వదేహులయందు దేవి శక్తి. ఏది సాధించాలన్నా దేహం ఉండాలి. ధర్మ సాధనకు తొలుత కావలసింది దేహమే కదా! మనోబలం అందరికీ ఉంటుంది. శక్తి మాత్రం సాధన మీద ఆధారపడి ఉంటుంది. దీక్ష, మనోబలం, పట్టుదల ఆకలిని, అన్నాన్ని జయించ గలవు.
ధూమ్రవర్ణము - నలుపు(ఎక్కువ) ఎరుపు కలిసిన రంగు.
హంస - 1.అంౘ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము రూ.హంస
హంసుడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణములేని రాజు.

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్టునికిని పేరు.
"నిర్లోభనృపతౌ విష్ణావంత రాత్మన్య మత్సరే, యతిభేదే చ హంసస్స్యా చ్చ్రేష్ఠే రాజాదిపూర్వక ' ఇతి. హంసో నిర్లోభనృపతౌ శరీర మరుదంతరే, హయభేదే యోగిభేదే మంత్రభేదే విమత్సరే, పరమాత్మని విష్ణౌ చ శ్రేష్ఠే రాజాదిపూర్వక 'ఇతి శేషః. హంతీతి హంసః హన హింసాగత్యోః - పోవును గనుక హంస.

ఓం హంసినై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులున్నాయి అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యాసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేదము.
తూరీయావస్థలోని - జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుండును. తూరీయావస్థ -(అనగా ధ్యానసమాధి) జీవాత్మ పరమాత్మయందు సమత్వబుద్ధి కలిగి వుండటం సమాధి.
ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదార్థాలు వున్నాయి. హంస - అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగువేళ వాయువు "హ"కారములో బహిర్గతమై "స"కారముతో లోపలికివస్తుంది అంటే హంసశబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉండి. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్రరూపిణీయైన దేవికి వందనాలు.
శ్లో. సమున్నీలత్సంవి - త్కమల మకరందైక రసికం
భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్,
యదాలాపా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ. 38
తా. ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుంది గుణములను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ననందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. – సౌందర్యలహరి

ఓం మహావజ్రేశ్వరైనమః : నిత్యతిధులలో శుక్లషష్టి తిధికి అధీశ్వరియై - పిండాండంలోని విశుద్ధచక్రానికి అధిస్ఠాత్రియై, శ్రీచక్రబిందు వికాసమందలి త్రికోణాకారంలోనీ అధిస్టాన దేవతయగు మహావజ్రేశ్వరీ దేవతకు ప్రణతులు.
6. సహస్ర దళమును కర్పూరవర్ణమునగు (ఆగ్నేయ)నాజ్ఞాచక్రము నందు - పరమాత్మ కలడు. పరమాత్మకు ఇది అధిస్ఠానం.
సహస్రారము - షట్చక్రములలో నొకటి (ఇది శిరస్సు నందుండును)షట్చక్రాలకు పైన, శిరస్సునకు నడుమ సహస్రారము - అదే బ్రహ్మరంద్రం అనే పేరుతో వుంది. బ్రహ్మరంధ్రము నందు సత్యలోకము ఉండును.
చోడు - బ్రహ్మరంధ్రము, రూ.సోడు. ఉచ్చి - బ్రహ్మరంధ్రము, నడితల, సోడు. ముచ్చిలి - ముచ్చిలిగుంట, పెడతల యందలి గుంట.
ఓం సహాస్రారాంబుజారూఢాయై నమః : బ్రహ్మ రంధ్రానికి అధోభాగంలో సహలసత దళాలతో తేజరిల్లు పద్మం భాసిల్లుతూంటుంది. ఆ సహస్రారకమ ఆలోపలిభాగాన ఆ రూఢయైన పరమేశ్వరికి అంజలులు.
సహస్ర పత్రము - కమలము, తామర. సహస్రదళ కమల కర్ణికా రూపము.
అన్నిటికీ పైన వుండే సహస్రారం బిందువునకు స్థానం. (బిందు చక్రమునందు చంద్రుఁడు, ప్రజాపతి ర్చన్దుః) పరబ్రహ్మ ప్రతిపాదకమైనవి సకల సకలవర్ణములు.
చంద్రము(ప్రజాపతిర్వై చంద్రమా) - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు. కర్పూరవర్ణము - ఘనసారము, cranium.
సహస్రదళ కమలమునందున్న చంద్రునికి వృద్ధి క్షయములు లేవు. చంద్రునిలో పదునారవ భాగము, పదునారవ చంద్రకళలు పదాఖ్యయై, సహస్రారస్థితమై యున్నది. అది నిత్యము జ్యోత్స్నామయ లోకము.
ఆజ్ఞాచక్రము - కనుబొమల నడుమ నుండెడి చక్రము, మొగము సహస్రార పద్మము. (సహస్రాక్షమందు దేవీస్థానం ఉత్సలాక్షి).
ఆజ్ఞ - 1.ఉత్తరువు, ఆదేశము, 2.దండనము, 3.(యోగ.) కనుబొమల నడుమ నుండెడి చక్రము, వికృ.ఆన.
ఆదేశము - 1.ఆజ్ఞ, 2.ఉపదేశము, 3.(వ్యాక.) ఒకదాని స్థానమున వచ్చు వేరొక వర్ణాదికము, ఉదా. గసడదవా దేశము.
ఉపదేశము - 1.హితవచనము, 2.మంత్రోపదేశము, 3.విధివాక్యము.
ఉత్తరువు - ఆజ్ఞ, అనుజ్ఞ, సెలవు, సం.ఉత్తరమ్.
అనుజ్ఞ - 1.అనుమతి, 2.ఉత్తరువు, ఆజ్ఞ.
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
సెలవు - సెలగు, వి.1.ఆజ్ఞ, 2.ఉపయోగము.
ఆజ్ఞప్తి - ఉత్తరువు, ఆజ్ఞ, వికృ.ఆనతి.
ఆనతి1 - 1.మ్రొక్కు, 2.నమ్రత, 3.వంగుట.
ఆనతి2 - ఉత్తరువు, సం.ఆజ్ఞప్తిః.
ఆన - ఉత్తరువు, సం.ఆజ్ఞా.

నిర్దేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట.
నిదేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట, 3.దాపు.
శిష్టి - ఆజ్ఞ. (ఆజ్ - ఈషదర్థః; జ్ఞా – జ్ఞానమ్)

అపవాస్తు నిర్దేశో నిదేశ శ్శాసనం చ సః శిష్టి శ్చాజ్ఞా చ -
అపవదన మపవాదః. పా. అవవాదః. వద వ్యక్తాయాం వాచి. - పనిఁబూని చెప్పుట.
నిర్దిశ్యతే అదిశక్యతే నిర్దేశః, నిదేశశ్చ, దిశ అతిసర్జనే. - ఉపదేశింపఁబడునది.
శాస్యతే అనేన శాసనం, శిష్టిశ్చ. ఇ. సీ. శాసు అనుశిష్టౌ. - దీనిచేత శిక్షింపఁబడును.
అజ్ఞాపనం అజ్ఞా - అజ్ఞాపించుట. ఈ ఐదు ఆజ్ఞ పేర్లు.

తవాజ్ఞా చక్రస్థం - తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వన్దే - పరిమిళితపార్శ్వం పరచితా|
యమారాధ్యన్ భక్త్యా - రవిశశి శుచీ నామవిషయే
నిరాలోకే లోకే - నివసతే హి భాలోకభువనే|| 36శ్లో
తా. తల్లీ ! ఎవనిని భక్తితో నారాధించి సూర్యచంద్రాగ్నులకు అగోచరమై చూడ శక్యము కానదియును, జనరహితమై ప్రకాశించు చంద్రికా మయమైన సహస్రార చక్రమునందు, శశికోటి సూర్యచంద్రుల కాంతిని ధరించినవాడును, సరియగు చిత్తుచేత ఆవరింపబడిన నిరుపార్శ్వముల నాక్రమించియున్న ఆ పరాత్పరుడగు శంభుని గూర్చి నమస్కరించు చున్నాను. – సౌందర్యలహరి

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ|
సహస్రారంబుజారూఢా సుధాసారాభివర్షిణీ.

శుక్ల రక్తములకు ఆజ్ఞాచక్రము ద్విదళము. సత్త్వప్రధానము శుక్లము. రజః ప్రధానము రక్తము.
ఆగ్నేయము - అగ్నికి సంబంధించినది. 1.అగ్ని పర్వతము, 2.వివాహములో అరుంధతీ(సతులలో దేవిస్థానం అరుంధతి, వసిష్ఠుని భార్య) దర్శనానతరము యజుర్వేదులు చేయు ఒక శుభకర్మ(యజ్ – ఆరాధన), 3.కృత్తికా నక్షత్రము(కృత్తివాసుఁడు - ముక్కంటి, శివుడు. కృత్తి వాసః ప్రియే), 4.ఆగ్నేయాస్త్రము(అగ్ని దేవతాకమైన అస్త్రము).
దేహంలోని ఆయుః స్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికానక్షత్రం.
భ్రూ మధ్యమునందు ఆజ్ఞాచక్రం. ఇచ్చట మనస్తత్వము. దీని దళాలు రెండు. హం, క్షం అనే అక్షరాలు వీటిపై వుంటాయి. ఆజ్ఞాచక్రమున మనస్తత్త్వమనగా ఏకాదశేంద్రియ గణము.
ఇటుఫై యిలాగు చేయుము అని ఈశ్వరుని ఆజ్ఞా జీవునకు ఇక్కడ లభిస్తుంది. తండ్రి ఆజ్ఞని పాటించాలి. కనుక దీనికి అజ్ఞాచక్రం అని పేరు వచ్చింది. పరమాత్మకు ఇది అధిస్ఠానం.
ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రారపద్మమందు ఏకాంతమున భర్తతో విహరించు చున్నావు.
ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః : ద్విదళ పద్మంలో ఆజ్ఞాపరుడైన శ్రీగురువు భాసిల్లు చుండుటచే దానికి ఆజ్ఞాచక్రమని పేరు. అట్టి ఆజ్ఞాచక్రాంతరాళస్థయై తేజరిల్లు శ్రీమాతకు నమోవాకాలు.
ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః : భ్రూమధ్య ప్రదేశంలో తేజరిల్లు నట్టి ఆజ్ఞాన చక్రకమలం నిలయంగా గల దేవికి ప్రణతులు.
ఓం సహస్ర పద్మస్థాయై నమః : శిరోవరి మధ్య స్థానంలో సహస్రదళాలతో భాసిల్లు పద్మంలో నివసించు మాతకు ప్రణతులు.

పరమాత్మ – Absolute - వైకుంఠము
కేవలుడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
చేతనము - 1.ప్రాణముకలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8స్వభావము, 9హృదయము. ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు. తనకు తానే పుట్టినవాడు, 4.మన్మధుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
అభయము - భయములేనిది వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు(ఉశీరము).
పురుషుడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. పురుషో హి ప్రజాపతిః

ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.
తను శబ్దము తోలునకును(చర్మము), శరీరమునకును పేరు.
తన - ఆత్మార్ధకము; తనయ - కూతురు; తనయుడు - కొడుకు; మనుషుని ఆత్మ కొడుకు. వర్ణుడు - కుమారుడు.

ఆత్మ అంటే తాను. నీళ్ళకంటే, నేలకంటే, ఆకాశం కంటే, గాలి(వాయువు)కంటే ఎక్కువగా వెలిగేది ఒకటే. అది ఆత్మ ఒకటే. ఆత్మ నిత్య చైతన్య స్వరూపమైనది. ఆత్మ ఎల్లప్పుడూ ప్రియమైనది ఎందువలన నంటే అదే ఆనందానికి మూలాధారం.
షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహా
షట్చరాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్|
షట్చక్రాచితపాదుకాం చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీ శ్రీమాతరం భావయే.


LikeShow more reactions
Comment
6 comments
Comments
Sarat Kastury

4 ఏప్రిల్ మందుపాతరల అవగాహనా దినోత్సవం (4 Apr International Day for Mine Awareness and Assistance in Mine Action)
మైన్ (Mine) అనే పదానికి ఆయా దేశాల పరిస్థితులనుబట్టి భిన్నంగా అర్ధంచేసుకుంటారు. ప్రశాంతంగా ఉన్న దేశాలలో ప్రకృతి వనరులు లభించే ‘గని’యనీ (ఉదాహరణకు గోల్డ్ మైన, కోల్ మైన్, ఐరన్ మైన్) , అంతర్యుద్ధాలు, విదేశీఆక్రమణలు జరుగుతున్నచోట Mine అర్ధం మందుపాతరలనే (లాండ్ మైన్) చెబుతారు.
ఇప్పుడు మనం చచదువబోయేది మందుపాతరలపట్ల అవగాహన మరియు వాటి తొలగింపుకు మరియు పునరావాస చర్యలకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం. ఈ అవగాహనా దినోత్సవాన్ని 2006 నుండి ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ నిర్వహిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి 2007 సం.లో నిర్వహించిన గణాంకాల ప్రకారం మందుపాతరల మారణహోమం ఈ విధంగా ఉంది. ఈజిప్టు (2కోట్ల 30 లక్షలమంది), ఇరాన్ (కోటీ 60 లక్షలమంది), ఆంగోలా (1 కోటీ 50 లక్షలు), అఫ్గనిస్థాన్ (ఒక కోటీ), ఇరాక్ (ఒకకోటి), కాంబోడియా (80 లక్షలనుం’డి 1 కోటిమంది), కువైట్ (50 లక్షలు), బోన్సియా హెర్జ్‌గోవీనా (30 లక్షలు), మొజాంబిక్ (30 లక్షలు), సోమాలియా (10 లక్షలు).
భారత్, పాకిస్తాన్‌ల మధ్యగల వాస్తవాధీన రేఖనుండి పలుసార్లు పాకిస్తాన్ తమదేశపు టెర్రరిస్టులు సరిహద్దు దాటడానికి సహకరించడంవల్ల వారు సరిహద్దు రాష్ట్రాలలో లక్షలాదిగా మందుపాతరలు పెట్టారని భారతప్రభుత్వం ఐక్యరాజ్య సమితికీ, పాకిస్తాన్‌కూ ఋజువులు చూపపింది. భారతసైన్యం తాము కనుగొన్నవాటినన్నింటినీ తొలగించింది.
పాకిస్తాన్ మనదేశంపైకి తీవ్రవాదులను ప్రోత్సహించడంవల్ల వారు 40లక్షల మందుపాతరలు నాటితే మరోవైపు ఆదేశపు తీవ్రవాదులు పాకిస్తాన్‌లోనే దాదాపు 60 లక్షల మందుపాతరలు నాటారని అంతర్జాతీయ మందుపాతరల వ్యతిరేక సంస్థ చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగానున్న మందుపాతరలతో భూగోళంపై రెండుఖండాలను సంపూర్ణంగా ధ్వంసం చేయవచ్చు. వీటి దుష్పరిణామాలేమిటో చూద్దాం.
• వీటివల్ల విగతజీవులయ్యేది కుటుంబాన్ని పోషించే తలిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు. వీరిలో అత్యధికులు అల్పాదాయ వర్గాలవారే. వీరందరు సాధారణ పౌరులు అందులో సగం మంది పిల్లలే.
• ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం వీటివల్ల ప్రపంచం‌లో సగటున ప్రతీ 22 నిమిషాలకు ఒకవ్యక్తి చనిపోతున్నాడు.
• ఒక మందుపాతర ఖరీదు 1800 రూ నుండి 18వేల రూ. కానీ గాయపడ్డవారి వైద్యం ఖర్చు రూ. 18వేల నుండి 3 లక్షలు. పేద, మధ్య తరగతి దేశాలవారికి పెనుభారం.
• మందుపాతరలు 50 సం. వరకు క్రియాశీలకంగానే, అంటే అంతకాలమూ ప్రమాదకరంగానే ఉంటాయి.
• వ్యవసాయయోగ్యమైన ప్రాంతాల్లో మందుపాతరలవల్ల రైతులు మార్కెట్టు, పాఠశాలలు, తాగు సాగునీటికి ఇబ్బందులెదుర్కొంటారు. .
• మందుపాతరల వల్ల శరణార్ధులకు పునరావాస చర్యలు చేపట్టడంకూడా కష్టతరమౌతుంది.
• మందుపాతరలవల్ల స్త్రీలు, బాలికలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంతో కోల్పోతారు.
మందుపాతరల బాధితులకు సహాయమందించడం, అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సామాజిక ఆర్ధిక పర్యావరణ రంగాలకు జరిగే నష్టనివారణను, మందుపాతరల శకలాలను తొలగించడాన్ని మైన్ ఆక్షన్ (Mine action) అంటారు.
పేలుడు మందుల తయారీ, రవాణా, పేలిన తర్వాత పునరావాస, వైద్య ఖర్చుల మొత్తంతో దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో దారిద్ర్యరేఖకు దిగువన గలవారందరికీ మౌలిక వసతులు కల్పించవచ్చు.
అవకాశం వచ్చినప్పుడల్లా మందుపాతరల సంస్కృతికి వ్యతిరేకంగా గొంతు విప్పుదాం.

Like
Comment

No comments:

Post a Comment