Friday 22 April 2016

01. నరసింహా (1999),02. స్వర్ణ కమలం (1988) 03. నేటి భారతం ,04. Whatsapp funny indian 2016, girls pranks best very funny in hindi 05. Aadha hai chandrama-Instrumental On Keyboard, 06. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, 07.ఓ భార్య కధ 08.శ్రీవారికి ప్రేమలేఖ ,09.బంగారు పంజరం 10. షావుకారు , 11. సీతారామ కళ్యాణం

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

She's singing "Baby come home" in a melody of tears while the rhythm of the rain keeps time... I remember:
సర్వేజనాసుఖినోభవంతు



మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా...నాతోడు రావా నా ఆశ బాష వినవా
చిత్రం : నరసింహా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివగణేష్
గానం : శ్రీనివాస్, నిత్యశ్రీ , శ్రీరామ్

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడు రావా నా ఆశ బాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయన్నీవా
సఖియా సఖియా సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ

శృంగారవీర...శృంగారవీరా
రణధీర నా ఆజ్ఞ తోటి నావెంట రార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలనై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చెలికాచుకోరా మధనా మధనా మధనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా
శృంగార వీర ...

మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
నా పైట కొంగును మూయ నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నీతాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మొక్షం నీకెకదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా

చంద్రుని చెక్కి చెక్క చేసినట్టి శిల్ప మొకటి చూసా
తన చూపున అమౄతం కాదు విషమున చూసా
తను నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటేనే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్నీ తలందాల్చ పురుషులెవరూ పూలుకాదు
శృంగార వీర ...

Narasimha, Narasimha Songs Juke Box Movie : Narasimha Rajinikanth - Soundarya and Ramyakrishna's Narasimha Telugu Movie All…

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ...సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ...

చిత్రం: స్వర్ణ కమలం (1988)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం: బాలు, సుశీల

పల్లవి:

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ

పరుగాపక పయనించవే తలపున నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించి నావ
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవే తలపున నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ

చరణం:

పడమర పగడలపై మెరిసే తారలకై
పడమర పగడలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ

చరణం:

తన వేళ్ళే సంకేల్లై కదలలేని మొక్కలా ఆ ఆ ఆ ఆ
ఆమనికై ఎదురుచూస్తూ ఆగిపోదు ఎక్కడ ఆ ఆ ఆ ఆ
అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా ఆ ఆ ఆ ఆ
ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా ఆ ఆ ఆ ఆ
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపక పయనించవే తలపున నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ

చరణం:

లలితా చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో...
వికశిత శాత దళ శోభాల సువర్ణ కమలం

పరుగాపక పయనించవే తలపున నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించి నావ
మది కోరిన మధు సీమలు వరించి రావా

స్వధర్మే మిధనం శ్రేయః పర ధర్మో భయవహా......

https://www.youtube.com/watch?v=4htJnHaKI4w
Shiva Poojaku Song - Swarna Kamalam Movie Songs - Venkatesh - Bhanupriya - Ilayaraja Songs
Watch Shiva Poojaku Song From Swarna Kamalam Movie, Starring Venkatesh, Bhanupriya, Sharon Lowen amo...

నవ్వు నలుగురికి మంచిది ఒక్కసరిచూడండి 

Whatsapp funny indian 2015, girls pranks best very funny in



సంగీఅ ప్రియులకు ఈ సంగీతమ్ వింటారని ఇందు పొందు పరిచాను మీకు ధన్యవాదములు



సుమధుర గాయని జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు... :)
వల్లభా..ఆ..ఆ..ఆ. ప్రియ వల్లభా..నాలో వలెనే నీలోనూ..జిలిబిలి ఊహలు సాగేనా...

చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల
నేపధ్య గానం : జానకి

పల్లవి :

వల్లభా..ఆ..ఆ... ప్రియ వల్లభా..
వల్లభా..ఆ..ఆ..ఆ. ప్రియ వల్లభా..
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ...

వల్లభా..ఆ..ఆ...ఆ.. ప్రియ వల్లభా

చరణం 1 :

అపుడే విరిసిన పువ్వులలో..ఓ.. ఓ... ఓ..
అపుడే విరిసిన పువ్వులలో.. గుప్పుమనే పరిమళమువలే
బుగ్గలకావిరి తగిలేలా.. సిగ్గులు సెగలై చెలగేనా..ఆ..... ఆ...... ఆ.....

వల్లభా..ఆ..ఆ.... ప్రియ వల్లభా

చరణం 2 :

చంద్రుని చూసిన సంద్రములో..ఓ..ఓ...ఓ..
చంద్రుని చూసిన సంద్రములో.... సందడి చేసే అలలవలే
కొల్లగ మమతలు మూచేనా.... చల్లగ వలపులు వీచేనా...ఆ..ఆ..ఆ

వల్లభా...ప్రియ వల్లభా..
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..
వల్లభా....ఆ...

https://www.youtube.com/watch?v=ealB-qDUY-I

Srikakula Andhra Mahavishnu Katha Songs - Vallabha Priya - NTR - Jamuna
Watch NTR Jamuna's Srikakula Andhra Mahavishnu Katha Telugu Movie Old Song With HD Quality Music : P



మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే...తొందరపడితే అలుసే మనసా...తెలుసా...

చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
గానం : జానకి
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు

పల్లవి:

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

చరణం 1:

ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి
చదువా ..... పదవా ..... ఏముంది నీకు
తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా

చరణం 2:

ఏ నోము నోచావు నీవనీ ..... దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

https://www.youtube.com/watch?v=NIdv9P0F_p0
Srivariki Premalekha Movie Songs - Manasaa Thullipadake - Naresh,Poornima
www.youtube.com

For latest updates on ETV Network http://www.etv.co.in/ Subscribe for more latest Episodes - http://...


పలుకరాదటే చిలుకా ... సముఖములో రాయబారమెందులకే

చిత్రం : షావుకారు
గానం : ఘంటసాల
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల

పలుకరాదటే చిలుకా ... పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే

ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే పలుకాడగ నేరమటే
ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే

మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే

https://www.youtube.com/watch?v=NNySJpBIDfY
Shavukaru Songs - Palukaraadate - NTR - Shavukaru Janaki
Watch NTR Shavukaru Janaki's Shavukaru Telugu Old Movie Song With HD Quality Music : Ghantasala Venk...

పాడవే రాగమయి వీణా....పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా

చిత్రం : సీతారామ కళ్యాణం
గానం : సుశీల
సాహిత్యం : సీ.సముద్రాల
సంగీతం : నరసింహారావు

వీణా.......పాడవే....రాగమయీ.......
పాడవే రాగమయి వీణా....
పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా
పాడవే రాగమయి ...

రాగములో అనురాగముకలిపి...
శివయోగములో భోగముతెలిపి
జగమే ప్రేమకు నెలవును జేసే
రసికావతంసుని రామణీయగాధా

వీణా మాధురి శివు మురిపించి
విక్రమ ధాటిని అమరులనుంచి
కనులా సైగల నామనసేలే
కైకసి శూరుని కమనీయగాధా...

పాడవే రాగమయి వీణా....
పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా

https://www.youtube.com/watch?v=wrtj0xQoC6c
Padave Ragamayi Veena Padave Ragamayi Song - Seetharama Kalyanam Movie, NTR, Kanta Rao, Gitanjali
Watch Padave Ragamayi Veena Padave Ragamayi Song From Seetharama Kalyanam Movie, Starring Harinath, ...

2 comments: