Monday 11 April 2016

01 సువర్ణ సుందరి , 02. చెంచు లక్ష్మి 03. అపరిచితుడు ,04. ,శివ (1989), 05. రామ రాజ్యం , 06. సత్య (1988) , 07.రాజా విక్రమార్క ,08. ఘర్షణ 09. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 10. పద్మవ్యూహం 11. ప్రేమ

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ- సంగీత ప్రభ 

@aubreytate_:
సర్వేజనా సుఖినోభవంతు 


నీ నీడలోన నిలిచేనురా..ఆ..యువతీ మనోజా..ఆ ఆ ఆ

చిత్రం : సువర్ణ సుందరి
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : P.సుశీల బృందం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా..ఆ..యువతీ మనోజా..ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా
నిను కొలిచేనురా..యువతీ మనోజా
ఏనాటికైనా నీ దానరా..యువతీ మనోజ
ఏనాటికైనా నీ దానరా రాజా
నవ శోభ లీను నా మేను నీ పూజకేనురా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా - ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి
మురిసి చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే
వినిచేనే ఈవేళా..
ఏనాటి కయినా నీదానరా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

https://www.youtube.com/watch?v=BqVPeEDOjco
Suvarna Sundari Movie Songs - Nee Needalona Song - ANR - Anjali Devi
Suvarna Sundari Movie Songs, Suvarna Sundari Songs, Suvarna Sundari Old Movie Songs, ANR's Suvarna S...


నారాయణా హరి నారయణా ...శ్రీమన్నారాయణా లక్ష్మీ నారయణా...

చిత్రం : చెంచు లక్ష్మి
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
సాహిత్యం : సదా శివబ్రహ్మం
గానం : సుశీల

కనలేరా కమలాకాంతునీ
అదిగో కనలేరా భక్తపరిపాలునీ
ఇదిగో కనలేరా శంఖచక్గదారదారినీ
నారాయణా హరి నారయణా ...
శ్రీమన్నారాయణా లక్ష్మీ నారయణా
నారయణా హరినారయణా .....

దీనావన నీ దివ్యస్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా
నారయణా హరినారయణా శ్రీమన్నారయణా లక్ష్మీ నారయణా ...

పాపాత్ములు నిను పరికింపరుగా
నీపై కోపము వైరము పూని
హే పరమేశా...ఎటు చూసిన నీ రూపమే కాదా లోకేశా...

https://www.youtube.com/watch?v=36EZrYjNkjo
Adhigo Kana Ledu Ah Video Song || Chenchu Lakshmi Telugu Movie
Watch Chenchu Lakshmi Telugu movie || Akkineni Nageshwara Rao,Anjali Devi, S. V. Ranga Rao,Relangi V...

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో..కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :
ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో

ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో..
కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో...

చరణం 1 :
సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే..
జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిపే..

సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలి చేస్తోంటే.. వడ్డించనా వయసంతా

వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కధకళి లోనా

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో

చరణం 2 :
ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే..

నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా
తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా..

ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా...
చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా...

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో..
లలలల..లలలలలా..

రామ రాజ్యం
రాం రాం రామ రామ రమారాం
రాం రామా రామరాం అనె రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామసుందరం

రాం రామ రామ అనె రాజమందిరం
ఘల్లు ఘాలు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం

ముద్ధు ముద్ధు మాటలంట ముద్ధుగారిపొతడంట
ఆపలేని అల్లరంట తేప తెప తీయనంట
బాల రాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట (రామ రామ )

బాణముతో గోడమీద కోతి బోమ్మ గీస్తడంట
వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట
సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట
కర్జురాలు ద్రాక్షలు ఉడతలకే పేడ్తడంట

దాకుండంటా సేట్టుసాటుకేల్లి
రాల్లేస్తడంట సేరువులోన మళ్ళి
అమ్మ నాన్నలంతా ఆ అల్ల్రి మేచ్చుకోనీ
బాల రాముని ,, బలే అనీ ముద్ధులు పెట్టారంటా (రామ రామ )

పాల బువ్వ తినమంటే మేడపైకి పరుగులంట
పసిడి బిందేలోని పన్నీరు ఒలకబోస్తడంట

సందమామ కావాలని సందేకాడ గోడవంట
అద్దములో సూపిస్తే సంచిలోన దాస్తడంటా

హ హ హ హ హా హ హా
శ్రీ రాముడైనా చిన్నప్పుడు ఇంతేఅ
ఆకాసమంటే అల్లరి చెసాడంటా

అమ్మ నాన్న మాకు అన్ని నువ్వే కాదా అమ్మా
ఎప్పుడు ఇంకా హద్దులు మీరు తప్పుని మన్నించమ్మా .... (రామ రామా )


పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళలో

చిత్రం : సత్య (1988)
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, సుశీల

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

కలలూరించనీ నీకళ్ళు చెలరేగించనీ పరవళ్ళు
నీచూపులో వుంది మందారం
అది నాకు కావాలి సింధూరం
రాగాల నీ నవ్వులోన రతనాలు నేనేరుకోనా
ఊరింత కవ్వింత పులకింత కలిగేను
కరిగేను నీ చెంత ఒళ్ళంతా

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
లాలలాలలాలా..లాలా..మ్.ఊఊఊ..
లాలలాలలాలా..లాలా..హే...
లాలాలాలాలలా..లాలాలాలాలలా..
అపురూపం కదా నీ స్నేహం
అనురాగానికే శ్రీకారం
అణువణువు నీలోన వున్నానే
అనుబంధమే పంచుకున్నానే
నీ కంటి పాపల్లె నేను..
వుంటాను నీ తోడు గాను
నీ మాట నా పాట కావాలీ
నీ వెంట ఈ జంట కలకాలం సాగాలి

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

https://www.youtube.com/watch?v=rnUtND10ObE&nohtml5=False
PARUVALU KANIVINI
kamal hasan

భళా ఛాంగు భళా...మహ రాజు కళా...దొరికావు గురో....దొంగోళ్ళ దొరో

చిత్రం : రాజా విక్రమార్క
సంగీతం : రాజ్ - కోటీ
గానం : SP. బాల సుబ్రహ్మణ్యం,చిత్ర
సాహిత్యం : వేటూరి

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

ఓయ్....నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ /2/
అసలెసరెడతారు..కసి కసి బుస గొడతారూ
పదముల బడతారూ....తమ పదవికి పెడతారూ

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

దిగ్గో దిగ్గో దగా దగా ఏలికా
లెగ్గో లెగ్గో.....ఎగా దిగా ఏలకా

మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము /2/
నీది కోలాహలం కోటా...మాది హాలాహలం ఆటా
పడతది ఉరితాడు తమ పరువుకి చెవుతాడు..

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

భూతా ప్రేతా పిశాచాల ఏలికో
ఏతా వాతా శ్మశానాలు ఏలుకో

నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం /2/
గతి మాదాకోళం నీకూ అది వేళాకోళం మాకు
యముడిక దిగుతాడు నీ మొగుడిక అవుతాడూ

https://www.youtube.com/watch?v=CMKfrhjXFbA
Raja Vikramarka Telugu Movie | Bhala Changu Bhala song | Chiranjeevi | Amala | Raadhika | Raj Koti
Raja Vikramarka Telugu Movie Bhala Changu Bhala song Starring Chiranjeevi, Amala, Raadhika, Rao Gopa...

కురిసేను విరి జల్లులే...ఒకటయ్యేను ఇరు చూపులే

చిత్రం : ఘర్షణ
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం,వాణీ జయరాం

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె

ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళమ్
నీవు నాకు వేద నాదం ఆ...

కన్నుల కదలాడు ఆ....,ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ...

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె.

https://www.youtube.com/watch?v=MgG-ng6do6E&feature=youtu.be
Kurisenu Virijallule Video Song - Gharshana Movie | Prabhu | Karthik | Mani Ratnam | Ilayaraja
Watch Kurisenu Virijallule video song from Gharshana movie, starring Prabhu, Karthik, Amala, Nirosha...

అమ్మ అని కొత్తగ.. మళ్ళీ పిలవాలని...తుల్లె పసి ప్రాయమె.. మళ్ళీ మొదలవ్వని

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
సంగీతం : మిక్కీ జే మేయర్
గానం : శశి కిరణ్,శ్రావణ భార్గవి
సాహిత్యం : వనమాలి

అమ్మ అని కొత్తగ.. మళ్ళీ పిలవాలని
తుల్లె పసి ప్రాయమె.. మళ్ళీ మొదలవ్వని
నింగి నేల నిలిచేదాక తోడుగ
వీచె గాలి వెలిగె తారల సాక్షిగ
నువు కావాలె అమ్మ
నను వీడొద్దె అమ్మ
బంగారం నువ్వమ్మ

అమ్మ అని కొత్తగ.. మళ్ళీ పిలవాలని
తుల్లె పసి ప్రాయమె.. మళ్ళీ మొదలవ్వని

నిదుర లొ నీ కల చూసి తుల్లి పడిన ఎదకి
ఏ క్షణం ఎదురవుతావొ జోలపాటవై
ఆకలని అడగకముందె నోటి ముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగి నేల నిలిచేదాక తోడుగ
వీచె గాలి వెలిగె తారల సాక్షిగ
నువు కావాలె అమ్మ
నను వీడొద్దె అమ్మ
బంగారం నువ్వమ్మ

చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వ్యధలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
నింగి నేల నిలిచేదాక తోడుగ
వీచె గాలి వెలిగె తారల సాక్షిగ
నువు కావాలె అమ్మ
నను వీడొద్దె అమ్మ
బంగారం నువ్వమ్మ

https://www.youtube.com/watch?v=_7YQFAkHD6Y&nohtml5=False

Amma Ani Kothaga Full Video Song - Life Is Beautiful Movie Video Songs
Watch & Enjoy Amma Ani Kothaga Video Song Full Video Song from Life Is Beautiful Movie Nokia Mobile .

నిన్న ఈ కలవరింత లేదు లే...నేడు చిరుగాలి ఏదో అంది లే

చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : హారిక

నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా

దైవం ఉందంటిని అమ్మనెరిగాకనే
కలలు నిజమంటిని ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం
నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే
నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే
నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా

https://www.youtube.com/watch?v=-SrEdWbGTSw&nohtml5=False
Ninna Yee Kalavarintha
Beautiful And Soulful Song ... Ninna Yee Kalavarintha Ledule Song from the Telugu Movie "Padmavyuham...

ప్రియతమా నా హృదయమా...ప్రేమకే ప్రతిరూపమా...

11. చిత్రం: ప్రేమ
గానం : బాలు
సాహిత్యం : వేటూరి
సంగీతం : ఇళయరాజా

ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

శిలలాంటి నాకూ జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకూ కళతోటి నింపి
వలపన్న తీపీ తొలిసారి చూపీ
ఎదలోని సెగలూ అడుగంట మాపీ
నులివెచ్చనైనా ఓదార్పు నీవై
శృతిలయ లాగా జతచేరినావు
నువులేని నన్నూ ఊహించలేనూ
నా వేదనంతా నివేదించలేనూ
అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

నీ పెదవిపైనా వెలుగారనీకు
నీ కనులలోనా తడిచేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకూ
అది వెల్లువల్లే నను ముంచనీకూ
ఏ కారు మబ్బూ ఎటు కమ్ముకున్నా
మహాసాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదూ
పదిజన్మలైనా ముడే వీడిపోదూ
అమరం అఖిలం మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

https://www.youtube.com/watch?v=9cT3Czgxi94&nohtml5=False
Priyathama Na Hrudayama - Prema
Song :Priyathama Na Hrudayama-- movie:-- Prema (1992)

1 comment: