Thursday 28 April 2016

01. అభిమన్యుడు (1984),02. సీతారామకళ్యాణం (1986),03. కోరుకున్న మొగుడు (1982),04.జయసుధ (1980),05. బాల గోపాలుడు (1989) 06. ఆదిత్య 369 (1991) 07.ఒక్కడు , 08.చక్రపాణి (1954):09.బొబ్బిలి యుద్ధం (1964), 10.ఖైదీ # 786 (1988), 11. విప్రనారాయణ

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

Upside down - Lucia Stewart:
సర్వేజనాసుఖినోభవంతు



సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 1:
నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము...

ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము...

అది వెలిగించని ప్రమిదలాంటిది...ఈ..ఈ..
వలచినప్పుడే వెలిగేది...

వెలిగిందా మరి? వలచావా మరి..
వెలిగిందా మరి? వలచావా మరి..
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 2:
ఏయ్.. వింటున్నావా?..
ఊ.. ఏమని వినమంటావ్?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగగా వినపడుతోంది?
అది విన్నవాళ్ళకే భాషవుతుంది ...

అది పలికించని వీణ వంటిది...మీటి నప్పుడే పాటవుతుంది...
మిటేదెవరని...పాడేదేమని...
మిటేదెవరని...పాడేదేమని...
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నా వాడూ...నేడు... రేపు... ఏనాడూ...

పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా...నీలాంబరి..నేరేడు గురివింజా...
చిత్రం : సీతారామకళ్యాణం (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
సా..రీ..గా..మా..పా..దా..నీ...సా నీ..దా..పా..మా..గ..రీ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా...నీలాంబరి..నేరేడు గురివింజా
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా...నీలాంబరి..నేరేడు గురివింజా

ఏడు రంగుల వలువలు.. ఏడస్వరముల మెరుగులు..
ఏడందాలు వెలిగే ముగ్గులేయాలీ.. ఏడేడు లోకాలు మురిసిపోవాలీ..

సా..రీ..గా..మా..పా..దా..నీ...సా నీ..దా..పా..మా..గ..రీ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా...నీలాంబరి.. నేరేడు గురివింజా
ఏడురంగుల వలువులు.. ఏడశ్వాల పరుగులు..
ఏడడగులు వేసి అందుకోవాలీ.. ఏడేడు జన్మలకు కలసి వుండాలీ..

సా..రా..గా మా.పా..ద..నీ.. సా..నీ..దా..పా..మా..గ..రీ
సా...ఆ..ఆ..ఆ

చరణం 1 :
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కూనిరాగం తీస్తుంటే.. కొండగాలి వీస్తుంటే..
కునుకెంత ఎరుపెక్కి కొండెక్కి పొడిచింది

తొలిరేకల తళతళలూ..ఊ..ఊ నులివేడి తలుపులతో..
గుండెలోన వెండి గిన్నే.. నిండి నింగి పొంగింది..

మోజు పెంచే రాజహంస.. రోజూ రోజూ ఇదే వరస
మోజు పెంచే రాజహంస.. రోజూ రోజూ ఇదే వరస
వేకువందున తనివి తీరా.. నిన్ను చూస్తానూ..
నిన్ను తప్ప లోకమంతా.. మరచిపోతానూ...

సా..రా..గా మా.పా..ద..నీ
సా..నీ..దా..పా..మా..గ..రీ
సా...ఆ..ఆ..ఆ

చరణం 2 :
మనసేమో మందారం... పలుకేమో బంగారం..
కోరుకున్న చందమామ.. ఓరు చూపు కలిపాడూ..

జాజీ నీ తెలుగుతనం... జవరాలై వెలిసిందీ..
జిగినించే నగుమోము... మమకారం చిలికింది..

గోడ చాటు గోరువంక.. ఇంటిముందు రామచిలుక
గోడ చాటు గోరువంక.. ఇంటిముందు రామచిలుక
నింగిలోన గాలిమేడ.. నిజం కావాలీ..
అందులోనే నువ్వు నేను ఆడుకోవాలీ..

సా..రా..గా మా.పా..ద..నీ
సా..నీ..దా..పా..మా..గ..రీ
సా...ఆ..ఆ..ఆ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా...నీలాంబరి.. నేరేడు గురివింజా
ఏడురంగుల వలువులు.. ఏడశ్వాల పరుగులు..
ఏడడగులు వేసి అందుకోవాలీ.. ఏడేడు జన్మలకు కలసి వుండాలీ..
సా..రా..గా మా.పా..ద..నీ
సా..నీ..దా..పా..మా..గ..రీ
సా...ఆ..ఆ..ఆ

Pasupu Kempu Video Songs Seetharama Kalyanam Move. Starring Nandamuri Balakrishna, Rajani,…
చిలకమ్మ గోరింక సరసాలాడితే...నవ్వే యవ్వనం నాలో ఈ దినం...
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 1:
పువ్వులలో పులకింతలలో చలిజింతలలో చెలరేగి
కౌగిలిలో కవ్వింతలలో చెలి చెంతలలో కొనసాగే

ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
తొలకరి వలపుల వేళలలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 2:
కోరికలో దరి చేరికలో అభిసారికనై జతకూడి
అల్లికలో మరుమల్లికలా విరిపల్లకినై కదలాడి

ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ఎగసిన సొగసుల ఘుమఘుమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చరణం 3:
అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై పెనవేసి
మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే

ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
కలిసిన మనసుల సరిగమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7lW…
youtube.com

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా...కనుపాప నవ్వింది కనులున్న చోట
చిత్రం: జయసుధ (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

చరణం 1:
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కనులెందుకు?ఈ కనులెందుకు?
కలలు చెరిగేందుకు చెరిగి పోయేందుకు

కనుల కనుల కలయికలో
కలయికల కలవరింతలలో
కలిగే... కరిగే.... కదిలే.... కదలికలే ఆ కలలూ
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

చరణం 2:
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
కలలెందుకు? ఆ కలలెందుకు?
కధలు మిగిలేందుకు మిగిలి నిలిచేందుకు

మనసు మనసు ఊహలలో మరపురాని ఊసులలో
విరిసే... కురిసే... మెరిసే... మెరుపులవే ఈ కలలు
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

Watch the melodious song, "Kannureppa Paadindhi" sung by P Jayachandran and P Susheela from the film Jayasudha. Cast: Jayasudha, Murali Mohan,…
youtube.com

సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా...
చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి, సునంద

తా..తకతాం..తకితాం..తక తకిట దిత్తై..
తకిటతై తత్ తరికిటతాం..
తకతకిట తకతధిమి తకఝుణుతక
తకిట తద్దిమిత.. ధిమిత తక తకిట..
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో ఆఆఆఆఅ...ఓఓఓఓ..
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి
ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి
రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం - నాకు ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల
మహా మహా సభాసదులు మురిసిన...
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
మ మ గ గ మ ద మ - మ మ ద స ని ద మ
రంపంప రంపపంప
రంపంప రంపపంప రంపంప రంపపంప
భరతము నెరుగని - నరుడట రసికుడు
rock-u roll-u ఆట చూడు - బ్రేకు లోని సోకు చూడు
west side-u rhyme మీద twist చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
rock rock rock n roll shake shake shake n roll
rock rock rock n roll shake shake shake n roll
రప్ప పా ప - ప పా ప - ప పా ప
ర పా ప పా ప పా ప పా ప పా ప పా ప పా ప
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు .... త త
జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...


Watch Mohini Balakrishna's Aditya 369 Telugu Movie Song With HD Quality Music : Ilayaraja Lyrics : Veturi Sundararama Murthy Sirivennela Sitarama Sastry…

మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది...మిడిసిపడే మదిలో సందడి
చిత్రం : ఒక్కడు
సంగీతం : మణిశర్మ
గానం : హరిహరన్,శ్రేయ ఘోషల్,ప్రియ సిస్టర్స్
సాకీ :
ముత్తైదులంతా ముదమారా ఈ బాలకీ మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించారే
పల్లవి :
మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మిడిసిపడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడీ...
హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి
బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ…
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా
కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
చరణం :
గెలిచానే నీ హృదయం..కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా…
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దులగుమ్మకీ..
సిగ్గుపడు చెంపకి సిరిచుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకీ
తడబడు కాళ్లకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్లు
నగలన్నీ వెలవెలబోవ చేరందే నీ ఒళ్లో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ
చరణం :
.
ఒట్టేసి చెబుతున్నా..కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎద పైన వాలే ముహూర్తానా
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా..సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వెయ్యాలే..
ముచ్చట తీరేలా అంతా రండి
ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలూ రేయీ లేని జగమేలుకోనీ


Watch Super Hit Movie Okkadu Video Song "Attarintiki" Of Mahesh Babu Starring : Mahesh…
youtube.com


ఉయ్యాల జంపాల లూగరావయా...తులలేని భోగాల తూగి...
చిత్రం: చక్రపాణి (1954)
సంగీతం: పి.భానుమతి
నేపధ్య గానం: భానుమతి
సాహిత్యం : రావూరి వెంకట సత్యనారాయన రావు

పల్లవి:
ఉయ్యాల జంపాల లూగరావయా
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి..ఈ..ఈ..
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి..ఈ..ఈ..
ఉయ్యాల జంపాల లూగరావయా
చరణం 1:
తాతయ్య సిరులెల్ల వెగర పెంపా
జాబులో పుట్టిన బాబు నీవయ్య
జాబులో పుట్టిన బాబు నీవయ్య
ఉయ్యాల జంపాల లూగరావయా ...
చరణం 2:
మా మనొరమక్కాయి మదిలోన మెరసి
ఎదురింటి ఇల్లాలి వొడిలోన వెలసి...
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి..
నా వారసుడావనుచు నవ్వు రా కలసి ..
నా వారసుడావనుచు నవ్వు రా కలసి...
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి..ఈ..ఈ..
ఉయ్యాల జంపాల లూగరావయా
చరణం 3:
మా మదిలో కోర్కెలను మన్నింప దయతొ
అవతిరించినావయ్య అందాల రాశి..
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా...
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష...
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి..ఈ..ఈ..
ఉయ్యాల జంపాల లూగరావయా..ఊగరావయా..ఊగరావయా


ఊయలలూగినదోయి మనసే...తీయని ఊహల తీవెలపైన
చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. భానుమతి

పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన .. ఊయలలూగినదోయీ...
చరణం 1:
వెన్నెల పూవులు విరిసే వేళా
సన్నని గాలులు సాగే వేళా
వలపులు ఏవో పలికెను నాలో ... ఆ...
తెలుపగ రానిది ఈ హాయి...
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...
చరణం 2:
కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై.. పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...


Listen to the melodious hit of P Bhanumathi," Vooyalalooginadoyi Manase" from the historical film Bobbili Yuddham. Director: C Seetaram Producer:…

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట..నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీణపాట...
చిత్రం : ఖైదీ # 786 (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట
ఆడుకొవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై
చరణం 1
జొడు కొసం గొడ దూకే వయసిదె తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం తగుదులె తమరికి అబ్బాయిగరు
ఆత్రము అరాటము చిందే వ్యామొహం
ఊర్పులొ నిట్టూర్పులొ అంతా నీ ధ్యానం
కొరుకున్ననని ఆత పట్టించకు
చెరుకున్నానని నన్ను దోచెయకు
చుట్టుకుంటాను సుడిగాలి
చరణం 2:
కొండ నాగు తొడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందె కాడ అందగత్తె పొందులొ ఉందిలె ఎంతో సంతొషం
పువ్వులొ మకరందం ఉందె నీ కొసం
తీర్చుకొ ఆ దాహము వలపే జలపాతం
కొంచం ఆగాలిలే కొరిక తీరెందుకు
దూరం ఉంటానులే దగ్గరయ్యెందుకు
దాచిపెడతాను నా సర్వము


Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets: iPhone: http://…
youtube.com


ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన...ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ
చిత్రం : విప్రనారాయణ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : భానుమతి రామకృష్ణ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా
వన్నె వన్నె చిన్నెలీను ఈ విలాసం .. వన్నె వన్నె చిన్నెలీను ఈ విలాసం ..
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
నిన్నేలువాని లీలలేరా.. నిన్నేలువాని లీలలేరా..
కన్నార కనరా ఏలుకోరా
అందరాని విందుపైన ఆశలేల..అందరాని విందుపైన ఆశలేల..
పొందు కోరు చిన్నదాని పొందవేల
అందాలరాయ అందరారా..అందాలరాయ అందరారా..
ఆనందమిదియే అందుకోరా..ఆనందమిదియే అందుకోరా..
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా


http://www.weekendcreations.com This song is one of the all time greats from Bhanumathi, Endukoyi Thotamali from Vipranarayana.

2 comments: