Sunday 31 May 2020




తెలవారదేమోస్వామీ..నీతలపులమునుకలోఅలసిన దేవేరి అలమేలు మంగకూ
చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి :
తెలవారదేమో స్వామీ..
తలపుల మునుకలో.. నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..

తెలవారదేమో స్వామీ.. నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..
తెలవారదేమో స్వామీ..

చరణం 1 :
చెలువమునేలగ చెంగట లేవని.. కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని.. కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలాలజడికి నిద్దుర కరవై..
కలలాలజడికి నిద్దుర కరవై

అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ... తెలవారదేమో స్వామీ

చరణం 2 :
మక్కువ మీరగ అక్కున జేరిచి... అంగజుకేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి... అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..

అలసిన దేవేరి అలమేలు మంగకూ... తెలవారదేమో స్వామీ
గామపని... తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ... తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ...

--(())--

No comments:

Post a Comment