ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు, జానకి పల్లవి: లాల...లాలా....లాలా..లా.లా.. ల..లా..లాలా...ల..లా.. ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని లాలా..లాలా..ల..లా..లా..లా..లా. చరణం 1: విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే.. తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే... పూలే గంధం పూస్తుంటే ..ఏ.. తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా... ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని లాలా..లాలా..ల..లా..లా..లా..లా. లాలా..లాలా..ల..లా..లా..లా..లా. చరణం 2: గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్.. నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం... గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే... సంధ్యారాగం అవుతుంటే... లయలే ప్రియమై పోతుంటే....హోయ్.. వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా... ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. https://www.youtube.com/watch? | ||
|
Friday 8 May 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment