Tuesday 27 March 2018

చిత్రం: గోదవరి


చిత్రం: గోదవరి
గానం: గాయత్రి
సంగీతం: కె.ఎమ్. రాధాకృష్ణ
సాహిత్యం: వెటూరి

నీల గగన, ఘనవి చలన, ధరణిజా శ్రీ రమణ
మధుర వదన, నళిన నయన, మనవి వినరా రామా!

రామ చక్కని సీతకీ, అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే!
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే..
ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళలో? రామ చక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేనని పెదవి చెప్పె, చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనస్సు తెలిపే ..హమ్ .మ.మ. మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ..రామ చక్కని సీతకీ, ఆర చేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

ఇందు వదన కుంద నదన మంద గమనా భామా!
ఇందు వదన ఇందు వదన ఇంత మదనా ..ప్రేమా!



చిత్రం : అల్లుడా మజాకా (1995)
రచన : వేటూరి
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు॥ఊరి॥
ఓ రామా రఘురామా
జగమేలే జయరామా
అది రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన ॥
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే ైవె భోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి
జంట తాళమేసెనంట
చరణం : 1
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మ రా
తాళికట్టు బావయ్యే తారక రామయ్య రా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి
కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు ॥
దేవుడి గుడిలో హారతి తిప్పు...
తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు ॥
చరణం : 2
ఏదిరా లక్ష్మణ...
సీతా పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచకూతా వాడు
లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి
బాణానికేస్తాను మేతా ॥
నే నాడతా... నే పాడతా... (2)
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా... (2)
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి
పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
తళతళ తారక మెలికల మేనక
మనసున చేరెగా కలగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో
మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడూలేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు గేయమై
తీయగా స్వరములు పాడగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం ఆమె నెమ్మది
అందుకే అంకితం అయినదీ మది
సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు
ఆయువే ఆశగా తపములు చేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
తళతళ తారక మెలికల మేనక
మనసున చేరెగా కలగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి



చిత్రం : అల్లుడా మజాకా (1995)
రచన : వేటూరి
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు॥ఊరి॥
ఓ రామా రఘురామా
జగమేలే జయరామా
అది రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన ॥
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే ైవె భోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి
జంట తాళమేసెనంట
చరణం : 1
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మ రా
తాళికట్టు బావయ్యే తారక రామయ్య రా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి
కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు ॥
దేవుడి గుడిలో హారతి తిప్పు...
తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు ॥
చరణం : 2
ఏదిరా లక్ష్మణ...
సీతా పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచకూతా వాడు
లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి
బాణానికేస్తాను మేతా ॥
నే నాడతా... నే పాడతా... (2)
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా... (2)
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి
పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే
భళిరా భళిరా భళిరా... ॥ఊరి॥



annamayya
   
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైని సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ

నీస గసగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిసమగసనిదమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడలద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ హరే హరే హరే
దివిజేంధ్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ వేంకట నారాయణ
తిరుమల నారాయణ లక్ష్మి నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే హరే హరే

ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో

తీయనైన ఈ బాధ కి ఉప్పునీరు కంట దేనికో
రెప్ప పాటు దూరనికే విరహం ఎందుకో
ఓ.. నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమ కి ఇన్ని శిక్షలు ఎందుకో

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన
ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన

ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో

కనులలోకోస్తావు.. కళలు నరికేస్తావు
సెకనుకోసరైన చంపేస్తావు….
మంచులా ఉంటావు.. మంట పెడుతునతావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు…
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి..

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన
ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన

ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో

చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి.. కాల్చేయనా…
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతేయనా..
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే..

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన
ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన

ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో.

చైత్ర మాస సూరీడే చుర చుర చూసెనులే
తెల తెల తెలవారే ఉదయంలో మిల మిల మెరిసెనులే
చిగురులు కొరికిన కోయిలలు కు కు కు పాడేనేలే
పచ్చని పల్లెలు పరవశమై జిలుగులు తొడిగెనులే
మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిచే
ఇంతలో వసంతం వచ్చే రెండు కన్నులకు వర్ణాలోచ్చే
పుల్ల మామిళ్ళు వచ్చే వేప పువ్వులు పూచే
ముంగిట కళ్ళాపి చల్లే రంగు ముత్యాల ముగ్గుల ముగ్గే వేసే

పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది
శుభకర మధుకర దినకర సురుచిర
సుమధుర సిరివర గిరిధర అదితర
హరిహర నరహర శశిధర
కారాహార భవహార మొలహార
శ్రీకర సురవర
శుభకర మధుకర దినకర సురుచిర
సుమధుర సిరివర గిరిధర అదితర
హరిహర నరహర శశిధర
కారాహార భవహార మొలహార
శ్రీకర సురవర

మంచు తెరనే తెంచుకొచ్చే
వెచ్చనైన రవి కిరణం
నీలి మేఘం నేల వాలే
పైరు పంపే ఆహ్వానం
గుమ్మా గుమ్మనా గున్నమామి తోరణాలు
గడప గడపలో శ్రీ లక్ష్మి స్తోత్రాలు
పాడి పంటలతో అలరాడు మన ఊళ్లు
పాలపొంగులు నురగలు తెలుగింటి లోగిళ్ళు

పచ్చని చిగురుతో వెచ్చని వెలుగుతో
పచ్చడి రుచులతో వచ్చే వచ్చేలా
ఉగాది వచ్చెనులే
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.......
తెలుగోళ్ల సవంత్సరాది

ఆరు రుచుల అమృతములే
తెలుగు తాయిలమే ఇదిలే
కమ్మనైన అమ్మ తనమే
మనకు పంచె పండుగలే
కొత్త పంచాంగ శ్రవణాల సందడులు
కోటి ఆశలతో మన రాశి ఫలితాలు
సీత రాముల గాథల్లో సారములు
రాధాకృష్ణుల లీలలు వింటుంటే మధురాలు
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది

శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ |
సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం ||
త్వామలోక నరాభీష్ట మధుమాస సముద్భవ |

పిబామి శోక సంతాప్తాం మమసోకం సదాకురు ||

No comments:

Post a Comment