Monday 12 March 2018

ఆత్మీయులు (1969)


అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు....

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు
పెళ్ళి మాట ఎత్తగానే చల్లగ దిగజారతారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మ్యారేజీలంటూ లగ్నం పెట్టేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి ఇక చూస్కోమంటారు

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు

చరణం 1:

వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 2:

ఆస్తి వున్న పిల్లయితే అందం జోలికి పోరు
కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
పెళ్ళి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
బయటికి అత్తామామల దయచేయండంటారూ

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 3:

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

https://www.youtube.com/watch?v=Sn5_WfxT10c
Amma Babu Nammaraadu Song - Aathmeeyulu Movie Songs - ANR - Vanisri

No comments:

Post a Comment